ఒక్క కట్ లేకుండానే బోర్డర్ 2 సెన్సార్ టెస్ట్ పాస్.. 3 గంటలకుపైగా రన్‌టైమ్‌తో వస్తున్న మూవీ
శుక్రవారం (జనవరి 23) రిలీజ్ కాబోతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘బోర్డర్ 2’కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి కత్తెర వేయకుండానే, కొన్ని చిన్నపాటి మార్పులతో అనుమతి లభించింది. దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో ఈ మూవీ రానుండటం విశేషం.
ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించిన బోర్డర్ మూవీకి సీక్వెల్ గా బోర్డర్ 2 వచ్చేస్తోంది. శుక్రవారమే (జనవరి 23) సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ వచ్చేసింది. అయితే మూవీలో డైలాగులు లేదా సీన్లలో ఎలాంటి కట్ ను సెన్సార్ బోర్డు ప్రతిపాదించకపోవడం గమనార్హం. కొన్ని చిన్న మార్పులు మాత్రమే సూచించినట్లు సమాచారం.

సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు ఇవే..
బోర్డర్ 2 సినిమాలోని సీన్స్ తొలగించకపోయినా.. సెన్సార్ బోర్డు కొన్ని చిన్న మార్పులను మాత్రం సూచించింది. సినిమాలో సన్నీ డియోల్ పోషించిన పాత్రకు సంబంధించి, చివరలో వచ్చే క్రెడిట్స్ లో 'ఫతే సింగ్' అనే అసలు పేరును చేర్చాలని కోరారు. నిబంధనల ప్రకారం యుద్ధ విమానంపై కనిపించే భారతీయ జెండా దృశ్యాలను సినిమా అంతటా మార్చాలని, సరైన పద్ధతిలో చూపాలని సూచించారు. ఇక సినిమాలో చూపించిన యుద్ధ నౌక పేరును 'కవచ్'గా మార్చారు.
వీరుల గురించి సమాచారం తెరపై చూపించేటప్పుడు ఆ అక్షరాల పరిమాణాన్ని పెంచడంతో పాటు, అవి తెరపై కనిపించే సమయాన్ని కూడా పెంచారు. దీనివల్ల ప్రేక్షకులు ఆ వివరాలను స్పష్టంగా చదవగలరు. బోర్డు సభ్యులు కోరినట్లుగా, నిర్మాతలకు సంబంధించిన పత్రాలను పరిశీలన కమిటీకి సమర్పించారు.
యూనిఫాంపై చిహ్నం..
సినిమాలో సైనికుల యూనిఫాం భుజంపై చూపించిన చిహ్నం సరైనదేనా అని సరిచూసుకోవాలని బోర్డు సభ్యులు చిత్ర బృందానికి సూచించారు. దీనికి నిర్మాతలు అది కచ్చితంగా సరైనదేనని నిర్ధారించారు. తాము భారత సైన్యం, మేజర్ హోషియార్ సింగ్ దహియా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ విషయాన్ని ధృవీకరించుకున్నామని వారు తెలిపారు.
భారీ రన్‌టైమ్‌తో బోర్డర్ 2
ఈ మార్పులన్నీ చేసిన తర్వాత 'బోర్డర్ 2' సినిమాకు 'యు/ఎ 13+' సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా మొత్తం నిడివి 199.07 నిమిషాలు ఉంటుంది. అంటే సుమారు 3 గంటల 19 నిమిషాల 7 సెకన్లు. గుల్షన్ కుమార్, టీ-సిరీస్ సంస్థలు జేపీ దత్తాకు చెందిన జేపీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బజ్వా కీలక పాత్రలు పోషించారు. భూషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సన్నీ డియోల్ 'ఫతే సింగ్ కాలేర్'గా, వరుణ్ ధావన్ 'మేజర్ హోషియార్ సింగ్ దహియా'గా కనిపించనున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


