...
...
Next Story

బోర్డర్ 2 ట్రైలర్ వచ్చేసింది.. యుద్ధానికి సిద్ధమైన ఇండియన్ ఆర్మీ

బోర్డర్ 2 ట్రైలర్ వచ్చేసింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి లాంటి వాళ్లు నటించిన ఈ మూవీ 28 ఏళ్ల కిందట వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్. జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Published on: Jan 15, 2026, 20:10:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సినిమా ‘బోర్డర్’. దశాబ్దాల తర్వాత దానికి సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ (Border 2) రాబోతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవైటెడ్ వార్ డ్రామా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ ట్రైలర్.. ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలిస్తోంది.

మాట తప్పం.. సరిహద్దు దాటనివ్వం!

బోర్డర్ 2 ట్రైలర్ వచ్చేసింది.. యుద్ధానికి సిద్ధమైన ఇండియన్ ఆర్మీ
బోర్డర్ 2 ట్రైలర్ వచ్చేసింది.. యుద్ధానికి సిద్ధమైన ఇండియన్ ఆర్మీ

1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో బోర్డర్ 2 మూవీ కథ సాగుతుంది. ట్రైలర్ సన్నీ డియోల్ పవర్ ఫుల్ స్పీచ్‌తో మొదలవుతుంది. "మనకు సరిహద్దు అంటే నేల మీద గీసిన గీత కాదు.. అది మన దేశ ప్రజలకు మనం ఇచ్చిన మాట. శత్రువును ఆ గీత దాటనివ్వం అని చేసిన ప్రమాణం" అంటూ సన్నీ చెప్పే డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. "ఈ రోజు ఏం జరిగినా సరే.. ఆ మాటను మనం తప్పకూడదు" అని అతడు తన సైన్యానికి దిశానిర్దేశం చేయడం ఆకట్టుకుంది.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. ఇలా మూడు దళాల వీరత్వాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. యుద్ధ సన్నివేశాలతో పాటు, సైనికుల వ్యక్తిగత జీవితాలు, వారి కుటుంబాల భావోద్వేగాలను కూడా ఇందులో హృద్యంగా చూపించారు.

రిపబ్లిక్ డే కానుకగా..

గుల్షన్ కుమార్, టీ-సిరీస్, జే.పీ. దత్తా ఫిల్మ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జే.పీ. దత్తా, నిధి దత్తా నిర్మించారు. ఈ చిత్రంలో సోనమ్ బజ్వా, మోనా సింగ్, మేధా రాణా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గణతంత్ర దినోత్సవ వారాంతాన్ని పురస్కరించుకొని జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

నాన్న ప్రేరణతోనే ‘బోర్డర్’ చేశా: సన్నీ డియోల్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks