...
...
Next Story

బ్రహ్మముడి ఫిబ్రవరి 23 ఎపిసోడ్: బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ.. బస్సు కింద బాంబు.. రుద్రాణి చేతిలో రిమోట్.. పెద్ద ట్విస్ట్

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఫిబ్రవరి 23) ఎపిసోడ్ లో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేయడానికి రుద్రాణి రంగం సిద్ధం చేసింది. శ్రీశైలం టూర్లోనే వాళ్లను కైలాసానికి పంపిచేస్తానని ఆమె శపథం చేస్తుంది.

Published on: Feb 23, 2026, 07:38:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 963వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు దుగ్గిరాల ఫ్యామిలీ తమ సగం ఆస్తిని ట్రస్టుకు రాసిచ్చేస్తారు. ఆ తర్వాత శ్రీశైలం టూర్ కు వెళ్తుంటారు. ఆ టూర్లోనే వాళ్లందరినీ చంపడానికి రుద్రాణి ప్లాన్ చేసి వాళ్లు వెళ్లే బస్సు కింద బాంబు పెడుతుంది. మొత్తం ఫ్యామిలీ పెను ప్రమాదంలో పడుతుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్న రాహుల్, రేఖ

బ్రహ్మముడి ఫిబ్రవరి 23 ఎపిసోడ్: బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ.. బస్సు కింద బాంబు.. రుద్రాణి చేతిలో రిమోట్.. పెద్ద ట్విస్ట్
బ్రహ్మముడి ఫిబ్రవరి 23 ఎపిసోడ్: బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ.. బస్సు కింద బాంబు.. రుద్రాణి చేతిలో రిమోట్.. పెద్ద ట్విస్ట్

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఫిబ్రవరి 23) ఎపిసోడ్ రాహుల్, రేఖ డ్రామాతో మొదలవుతుంది. తాము కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతామని, తమ తల్లి చేసిన పనికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని నాటకమాడతారు. దీంతో మీ అమ్మ చేసిన తప్పుకు మీరెందుకు శిక్ష అనుభవిస్తారు అని ఇందిరా దేవి అంటుంది.

రాజ్ కూడా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటాడు. రాహుల్, రేఖ మాత్రం ఇంకా డ్రామాను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తారు. మీ తల్లి ఎక్కడ కలిసినా మాట్లాడకూడదు, చూడకూడదు అని ధాన్యలక్ష్మి చెబుతుంది. చివరికి వాళ్లు ఇంట్లోనే ఉండటానికి ఒప్పుకుంటారు.

రాజ్, కావ్య రొమాన్స్.. శ్రీశైలం టూర్ ప్లాన్

ఇటు రాజ్, కావ్య పాపను చూస్తూ మురిసిపోతుంటారు. కావ్య తన ముద్దులన్నీ పాపకే ఇవ్వడం చూసి రాజ్ అలుగుతాడు. పాప వచ్చినప్పటి నుంచి ఒక్క ముద్దూ ఇవ్వడం లేదంటాడు. దీంతో కావ్య అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దిస్తుంది. తర్వాత ఇద్దరూ ట్రస్టు పనులు, బారసాల, ఆ తర్వాత శ్రీశైలం టూర్ గురించి ప్లాన్ చేస్తారు. అన్నింటికీ ఏర్పాట్లు చేశానని రాజ్ అంటాడు.

దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి రుద్రాణి ప్లాన్

ఎలాగూ బస్సులో వెళ్తారు కాబట్టి కింద బాంబు పెట్టి లేపేద్దాం అని రుద్రాణి అంటుంది. మొత్తం ఫ్యామిలీ చనిపోయి మనం ఉంటే మన మీదే పోలీసులకు అనుమానం వస్తుంది కదా అని రాహుల్ అంటాడు. అందుకే మీరు వాళ్లతోపాటే వెనుకాల కారులో వెళ్లండి.. మీ వెనుక స్వప్నను కూడా తీసుకెళ్లండి.. అప్పుడు మన మీద అనుమానం రాదు అని రుద్రాణి అంటుంది.

దుగ్గిరాల ట్రస్ట్ ప్రారంభం.. పిల్లలకు బారసాల

మరోవైపు దుగ్గిరాల ట్రస్టు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే కనకం కూడా వస్తుంది. దుగ్గిరాల వంశం పిల్లలకు డ్రెస్సులు కొనడం అంటే మామూలు విషయం కాదని, అందుకే కాస్త ఆలస్యమైందని ఇందిరా దేవితో అంటుంది. ట్రస్టు విషయంలోనూ కావ్య, రాజ్ క్రెడిట్ నీదంటే నీదంటూ గొడవ పడుతుంటారు. ఇంత మంచి ఆలోచన చేసిన ఇద్దరిదీ ఈ క్రెడిట్ అని ఇందిర అంటుంది. ట్రస్టు పనుల తర్వాత బారసాలకు కూడా ఏర్పాట్లు చేస్తారు.

ట్రస్టు బాధ్యతలు ముగ్గురికి.. సగం ఆస్తి

అదే సమయంలో మంత్రి ధర్మేంద్ర ఇంటికి వస్తాడు. ట్రస్టుకు సగం ఆస్తి రాసిస్తున్నట్లు రాజ్ చెబుతాడు. ఇక ఈ ట్రస్టు బాధ్యతలను ముగ్గురికి అప్పగిస్తున్నట్లు వెల్లడిస్తాడు.

మంత్రిగారు ట్రస్టుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటారని, 30 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్న సత్యమూర్తి అనే మరో వ్యక్తి మొత్తం పనులు చూసుకుంటారని, ఇక చివరిగా మన ఫ్యామిలీ నుంచి కావ్య ట్రస్టు బాధ్యతలు నెరవేరుస్తుందని రాజ్ చెబుతాడు. దీనికి ఇంట్లో వాళ్లందరూ సరే అంటారు. తర్వాత సగం ఆస్తి రాసిస్తున్నట్లు సంతకాలు పెడతారు.

బారసాలకు సిద్ధమవుతుండగా శ్రీశైలం వెళ్లడానికి బస్సు వస్తుంది. అది తాను చూసుకుంటానని వెళ్లిన రాహుల్.. రుద్రాణి చెప్పినట్లుగా కింద బాంబు పెడతాడు. బస్సులో ఫ్యామిలీ మొత్తం పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా వెళ్తుంటారు. వెనుక కారులో రాహుల్, రేఖ ఎప్పటికప్పుడు రుద్రాణికి సమాచారం చేరవేస్తుంటారు. రుద్రాణి తన చేతిలో రిమోట్ పట్టుకొని బాంబు పేల్చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe