Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో డబ్బులు కుదరదంటే ఇందు వేళ్లు కత్తిరించి పంపిస్తానని రాజ్ బెదిరిస్తాడు. దాంతో భయపడిన భ్రమరాంబ అలా చేస్తే సంతకం ఎలా పెడుతుందంటుంది. ఫోన్ లాక్కున్న రేఖ కోటి రూపాయలను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని చెబుతుంది. సరేనని రాజ్ అంటాడు.
రాజ్ అడ్రస్ ట్రేస్

నందు ఇంకా మాట్లాడమని చెబుతుంది. అడ్రస్ ఎక్కడ, ఇందు తిన్నదా, ఆరోగ్యం బాగుందా అని అడుగుతుంది రేఖ. డబ్బులు రెడీ అయ్యాక అడ్రస్ చెబుతా, మీ ఇందు సంగతి మేము చూసుకుంటామని రాజ్ కాల్ కట్ చేస్తాడు. కరెక్ట్ అడ్రస్ ట్రేస్ కాలేదు కానీ ఉండే ఏరియా దొరికిందని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో ఆ లొకేషన్ నందు పంపించుకుంటుంది.
మరోవైపు రాజ్, లక్కీ ఈ సిటీలో మూడు కోట్లు ఉన్నా మధ్య తరగతి వాళ్ల కిందకే వస్తామని మాట్లాడుకుంటారు. ఇంతలో ఇందును కిడ్నాప్ చేసి దాచి ఉంచిన ఇంట్లోకి పోలీసులు వస్తారు. రాజ్, లక్కీ కంగారుపడతారు. ఇల్లు మొత్తం సోదా చేయాలని ఎస్సై అంటాడు. ఎందుకు సోదా చేయాలని రాజ్ అడిగితే.. పక్క వీధిలో దొంగతనం జరిగింది. వాడు తప్పించుకుని ఇటువైపే వచ్చాడట. అందుకే ఇల్లు సోదా చేయాలని ఎస్సై అంటాడు.
మరోవైపు తాళం తీసుకుని ఇందు వస్తుంటుంది. దొంగ కోసమా అని ఊపిరి పీల్చుకుంటారు రాజ్, లక్కీ. ఆ దొంగ మాములోడు కాదు ఇప్పటికీ చాలా మందిని చంపేశాడు. ఇంట్లో దాక్కున్న విషయం కూడా ఎవరికి తెలియదు అని ఎస్సై అంటాడు. ఇంతలో ఇందు వస్తుంది. ఈ అమ్మాయి ఎవరని ఎస్సై అడుగుతాడు. తను నా ఫ్రెండ్ వైఫ్ సర్ అని లక్కీ అంటాడు. దాంతో రాజ్, ఇందు షాక్ అవుతారు.
ఇందు రాజ్ భార్య
నా వైఫ్ ఏంట్రా అని రాజ్ అంటే.. నీకు ఇగో బాగా ఎక్కువైపోతుందిరా. మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని కలిపేందుకేగా నేను వచ్చిందని లక్కీ అంటాడు. ఇందుతో నచ్చజెప్పుతున్నట్లుగా మాట్లాడుతూ బతిమిలాడుకుంటాడు. ఇందు మాట్లాడబోతుంటే.. మీరు మాట్లాడిన నా మీద ఒట్టే అంటాడు. మావాడి తరఫున మీ కాళ్లు పట్టుకుంటాను అని ఇందు కాళ్ల మీద పడతాడు లక్కీ. ఈ ఒక్కసారి ఈ గండం నుంచి బయటపడేయమని వేడుకుంటాడు.
{{/usCountry}}నా వైఫ్ ఏంట్రా అని రాజ్ అంటే.. నీకు ఇగో బాగా ఎక్కువైపోతుందిరా. మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని కలిపేందుకేగా నేను వచ్చిందని లక్కీ అంటాడు. ఇందుతో నచ్చజెప్పుతున్నట్లుగా మాట్లాడుతూ బతిమిలాడుకుంటాడు. ఇందు మాట్లాడబోతుంటే.. మీరు మాట్లాడిన నా మీద ఒట్టే అంటాడు. మావాడి తరఫున మీ కాళ్లు పట్టుకుంటాను అని ఇందు కాళ్ల మీద పడతాడు లక్కీ. ఈ ఒక్కసారి ఈ గండం నుంచి బయటపడేయమని వేడుకుంటాడు.
{{/usCountry}}ఇంతలో ఎస్సై లేపి ఇలాంటి ఫ్రెండ్ ఉండటం మీ ఇద్దరి అదృష్టం. ఈ మధ్య ఇగోకి పోయి విడిపోవడం ప్యాషన్ అయిపోయిందని లెక్చర్ ఇస్తాడు ఎస్సై. ఇన్ని గొడవల మధ్యలో దొంగ ఎప్పుడో పారిపోయి ఉంటాడు అని ఎస్సై వెళ్లిపోతాడు. మరోవైపు నందుతో వెంకట్ ఉంటాడు. తన లవ్ కోసం హెల్ప్ చేయమంటాడు. దాంతో తను ఓ కిడ్నాప్ అయిన అమ్మాయిని వెతుకుతున్నానని వెంకట్‌పై కోప్పడుతుంది నందు.
తర్వాత సరేనని హెల్ప్ చేస్తానంటుంది నందు. దానికి ఆ అమ్మాయి దొరికేవరకు నేను హెల్ప్ చేస్తానంటాడు వెంకట్. ఇంతలో ఓ ఇంటి నుంచి ఎస్సై బయటకు వస్తాడు. నందును చూసి మత్తు పదార్థాల కేసు గురించి అడుగుతాడు. వాళ్లను పట్టుకుని లాభం లేదు. మెయిన్ తలను పట్టుకోవాలని నందు చెబుతుంది. తాను దొంగ కోసం వచ్చినట్లు ఎస్సై చెబితే.. ఎవరైనా అనుమానంగా కనిపించారా అని ఇందు కిడ్నాప్ కేసు గురించి చెబుతుంది.
కోటి కంటే ఎక్కువ ఇస్తా
నందు ఇందు ఫొటో చూపించేలోపు ఎస్సైకి వేరే కాల్ రావడంతో వెళ్లిపోతాడు. తన లవర్ గురించి వెంకట్ మాట్లాడితే.. నువ్వు నీ అమ్మాయిని వెతుక్కో నేను ఈ అమ్మాయిని వెతుక్కుంటా అని ఫొటో చూపిస్తుంది నందు. ఇద్దరు వెళ్లిపోతారు. మరోవైపు ఇందుతో భార్య సంబంధం కలిపినందుకు లక్కీపై రాజ్ సీరియస్ అవుతాడు. ఇదంతా మీ ప్లాన్ అని ఇందు తిడుతుంది. మరి నువ్వెందుకు పోలీసుల ముందు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావని రివర్స్‌లో వాదిస్తాడు రాజ్.
నువ్వు ఇక్కడ ఉండటం ఎంత అవసరమో మాకు అంతే అవసరం అని ఇందు ప్లాన్ గురించి బయటపెడతాడు రాజ్. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెబితే ఇస్తాను. విడిచిపెట్టండి అని ఇందు అంటుంది. దాంతో రాజ్, లక్కీ నవ్వుతారు. నీకు బ్యాక్ అకౌంట్ లేదు మాకు డబ్బులిస్తావా, నువ్వు సంతకం పెట్టడం తప్ప నీ దగ్గర చిల్లి గవ్వ లేదని అని ఎగతాలి చేస్తారు.
దాంతో నవ్వేస్తుంది ఇందు. మా రేఖ ఆంటీ కోటి ఇవ్వడానికి రెడీ అయిందంటే నేను పెట్టే సంతకం ఎంత విలువైందో అర్థం కాలేదా. నేను దుగ్గిరాల ఇంటి వారసురాలిని, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి కాబోయే ఛైర్మన్‌ను, నన్ను వదిలేస్తే అడిగినదానికి ఎక్కువే ఇస్తానంటుంది ఇందు. ఎప్పుడిస్తావని రాజ్ అడిగితే.. ఇప్పుడు కాదు. నా ప్లాన్స్ వర్కౌట్ అయి ఛైర్మన్ అయ్యాక వెంటనే ఇచ్చేస్తాను అంటుంది ఇందు.
ఇందును కనిపెట్టిన నందు
ఇలాంటి కథలు నమ్మేందుకు మేము ఏమైనా పిచ్చోళ్లమా. అక్కడ మీ రేఖ ఆంటీ రెండు రోజుల్లో కోటి ఇచ్చేందుకు రెడీ అయిందని రాజ్ అంటాడు. ఇందు ఎంత చెప్పిన వినకుండా లోపల బంధించి లాక్ వేస్తారు. రాజ్ ఉన్న చుట్టు పక్కల నందు, వెంకట్ తిరుగుతుంటారు. అది రాజ్, లక్కీ చూసి భయపడిపోతారు. వాళ్లను కరెక్ట్ చూసి ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నారు. ఎందుకైనా మంచిది లోపల దాక్కుందామని వెళ్లిపోతారు రాజ్, లక్కీ.
రాజ్, లక్కీ దాచిన ఇల్లు చూసి ఈ ఏరియాలో ఈ ఇల్లే డిఫరెంట్‌గా ఉందని లోపలికి వెళ్తుంది నందు. తర్వాత రాజ్, లక్కీ పడుకుని ఉంటారు. కిడ్నాప్ అయిన ఇంట్లోకి వెళ్లి అక్క ఇందును కనిపెట్టి చూస్తుంది చెల్లి నందు. అక్క అని పిలుస్తుంది. నిజం చెప్పు ఇదంతా నాకోసం ఎందుకు చేస్తున్నావని నందును ఎమోషనల్‌గా అడుగుతుంది ఇందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.