Brahmamudi April 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందుని రేఖ మహారాణిలా చూసుకుంటుంది. అది చూసి ఇంట్లో వాళ్లు షాక్ తింటారు. అదే సమయంలో డ్రగ్స్ విషయంలో రౌడీల చేతుల్లో ఇరుక్కున్న రాజు, లక్కీ.. డబ్బు కోసం ఐశ్వర్య ఇచ్చిన ఇందు కిడ్నాప్ ఆఫర్ ను తీసుకునే ఆలోచనలో పడతారు.
ఆస్తిని సొంతం చేసుకునేందుకు లాయర్‌ను కలిసిన రేఖ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 1) ఎపిసోడ్ లో దుగ్గిరాల ఆస్తిని మొత్తం సొంతం చేసుకునేందుకు లాయర్ ను కలుస్తుంది రేఖ. ఇందుకి 18 ఏళ్లు నిండగానే ఆమె ఒక్క వేలిముద్రతో ఆస్తి మొత్తం మీ సొంతమవుతుంది.. పేపర్లన్నీ పకడ్బందీగా తయారు చేశాను.. ఒక్కసారి వేలిముద్ర వేసిన తర్వాత ఇందుయే కోర్టుకు వచ్చి కేసు వేసిన లాభం ఉండదు అని లాయర్ చెబుతాడు. తనకూ అదే కావాలని, ఇన్నేళ్లుగా ఈ ఆస్తి కోసమే ఎదురు చూస్తున్నానని రేఖ అంటుంది.
రాజు, లక్కీ వెంటపడిన నందు, పోలీసులు.. డ్రగ్స్ చూసి షాక్
మరోవైపు రాజు, లక్కీ వెంట నందు, పోలీసులు పడతారు. వాళ్ల చేతుల్లో ఉన్న డ్రగ్స్ కోసం వెతుకుతుంటారు. దీంతో ఇద్దరూ కలిసి ఓ గోడౌన్ లో దాక్కుంటారు. అసలు ఈ బ్యాగు కోసం వీళ్లు ఎందుకు వెంట పడుతున్నారు.. అందులో ఏముంది అని లక్కీ అడుగుతాడు. రాజు బ్యాగు ఓపెన్ చేసి చూస్తే అందులో డ్రగ్స్ ఉంటాయి. దీంతో అతడు షాక్ తింటాడు. ఇది మత్తు పదార్థం అని చెప్పడంతో లక్కీలో కంగారు మొదలవుతుంది. దీనితో పట్టుబడ్డామంటే జైలుకెళ్లాల్సిందే అని రాజు అంటాడు.
ఇందును వెనకుసుకొచ్చిన రేఖ.. అందరిలోనూ అనుమానం
ఇటు ఇంట్లో ఇందుని భ్రమరాంభ తన చీర ఇస్త్రీ సరిగా చేయనందుకు తిడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రేఖ.. భ్రమరాంబపై మండిపడుతుంది. ఇన్నాళ్లూ ఇందు చేసిన సేవలు చాలు.. ఈ కోటకు రాణి ఆమె.. మనమే ఇక నుంచి ఇందుకి సేవలు చేయాలని చెబుతుంది. అది విని ఇందుతోపాటు ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. అంతేకాదు ఇందు కోసం రేఖ కొత్త బట్టలు తీసుకొస్తుంది. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాక భ్రమరాంబ, శేషు, స్వాతి అవాక్కవుతారు.
డ్రగ్స్‌ను పారేసిన రాజు.. రూ.10 లక్షల డిమాండ్
{{/usCountry}}ఇటు ఇంట్లో ఇందుని భ్రమరాంభ తన చీర ఇస్త్రీ సరిగా చేయనందుకు తిడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రేఖ.. భ్రమరాంబపై మండిపడుతుంది. ఇన్నాళ్లూ ఇందు చేసిన సేవలు చాలు.. ఈ కోటకు రాణి ఆమె.. మనమే ఇక నుంచి ఇందుకి సేవలు చేయాలని చెబుతుంది. అది విని ఇందుతోపాటు ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. అంతేకాదు ఇందు కోసం రేఖ కొత్త బట్టలు తీసుకొస్తుంది. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాక భ్రమరాంబ, శేషు, స్వాతి అవాక్కవుతారు.
డ్రగ్స్‌ను పారేసిన రాజు.. రూ.10 లక్షల డిమాండ్
{{/usCountry}}ఇటు పోలీసుల నుంచి తప్పించుకున్న రాజుకి ఆ డ్రగ్స్ కోసం వచ్చిన రౌడీలు ఫోన్ చేస్తారు. వాళ్లు బయట ఉండటం చూసి లక్కీ.. ఈ పౌడర్ ఇచ్చేసి మనం వెళ్లిపోదాం అంటాడు. కానీ ఈ డ్రగ్స్ వల్ల ఎందరి జీవితాలో నాశనం అవుతాయని, దీనిని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వనని రాజు అంటాడు. చిన్నచితకా మోసాలు చేస్తున్నా ఎవరి జీవితాన్నీ నాశనం చేయలేనని చెబుతాడు.
వాళ్లు చూస్తుండగానే డ్రగ్స్ మొత్తం పారబోస్తాడు. అది చూసి రౌడీలు రాజును కొట్టడానికి వస్తే వాళ్ల బాస్ అడ్డుకుంటాడు. దాని విలువ రూ.10 లక్షలు అని, వారంలో ఆ మొత్తం ఇవ్వాలని అంటాడు. అంతేకాదు రాజు ఫ్యామిలీ మెంబర్స్ వివరాలన్నీ చెప్పి పరోక్షంగా అతన్ని బెదిరిస్తాడు. వారంలో రూ.10 లక్షలు ఎలా తేవాలని లక్కీ ఆందోళన పడతాడు.
ఇందుకి రేఖ సేవలు.. ఇంటికి యజమాని అంటూ..
ఇంట్లో ఇందుని రేఖ మహారాణిలా చూసుకుంటుంది. ఈ ఇంటికి అసలైన యజమాని ఆమెనే అని, ఇక నుంచి ఇందు తిన్న తర్వాతే అందరం తినాలని భ్రమరాంబతోపాటు ఇతరులకు చెబుతుంది. ఆమెనే స్వయంగా ఇందుకి వడ్డిస్తుంది. అది చూసి అపర్ణకు విషయం అర్థమై లోనికి వెళ్లిపోతుంది. ఇటు ఐశ్వర్య కూడా దీనికి సేవలు చేయడమేంటి.. మీరు చేసుకోండి అంటూ కోపంగా వెళ్తుంది.
రేఖ ఇదంతా సంతకం కోసమే చేస్తుందని ఇందుకి అర్థమవుతుంది. ఒకవేళ అలా చేయకపోతే తన తాత, నాన్నమ్మ ప్రాణాలతో ఉండరన్న విషయం కూడా అర్థం చేసుకొని దేవుడికి మొరపెట్టుకుంటుంది. మరోవైపు ఇందుకి రేఖ ఇచ్చే ప్రాధాన్యం చూసి ఆమెను కిడ్నాప్ చేయాలని, డబ్బు ఇస్తానని రాజు, లక్కీలకు ఐశ్వర్య ఆఫర్ ఇస్తుంది. దీంతో వాళ్లు ఆలోచనలో పడతారు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.