...
...
Next Story

Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి.. ఇందుని చూసేసిన ఇంటి ఓనర్.. సుభాష్‌కు సర్జరీ.. పీకల్లోతు కష్టాల్లో రేఖ

Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ఇందును ఎక్కడైతే దాచి పెట్టారో ఆ ఇంటి ఓనర్ ఆమెను చూసేస్తాడు. మరోవైపు రేఖపై ఒత్తిడి తెచ్చి సుభాష్ కు సర్జరీ చేయించేలా నందు చేస్తుంది.

Published on: Apr 20, 2026, 08:54:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో నందు అడిగినా ఇందు రాదు. దీంతో ఆమెకు హామీ ఇచ్చి ఇంటికి వెళ్లిన నందు.. నాన్నమ్మ, తాతయ్యలను బాగా చూసుకుంటుంది. మరోవైపు రాజు, లక్కీ, ఇందులకు ఇంటి ఓనర్ నుంచి ముప్పు వాటిల్లుతుంది.

కునుకేసిన రాజు, లక్కీ.. ఇందు దగ్గరికి వచ్చిన నందు

Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి.. ఇందుని చూసేసిన ఇంటి ఓనర్.. సుభాష్‌కు సర్జరీ.. పీకల్లోతు కష్టాల్లో రేఖ
Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి.. ఇందుని చూసేసిన ఇంటి ఓనర్.. సుభాష్‌కు సర్జరీ.. పీకల్లోతు కష్టాల్లో రేఖ

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఏప్రిల్ 20) ఎపిసోడ్ చేసేది లేక చక్రికి నగలన్నీ ఇవ్వాలని రేఖ డిసైడయ్యే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత అటు రాజు, లక్కీ ఫుల్లుగా తిని పడుకుంటారు. అదే అదునుగా ఇంట్లోకి వెళ్తుంది నందు. ఇందుని కలుస్తుంది. వాళ్లు లేచే లోపే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని అంటుంది.

ఆ ఇంటికి రానని తేల్చి చెప్పిన ఇందు.. ధైర్యం చెప్పిన నందు

కానీ ఇందు మాత్రం తాను రానని అంటుంది. ఆ ఇంటికి వెళ్తే తాను అనుకున్నది ఏదీ సాధించలేనని, తాను అనుకున్నది సాధించిన తర్వాతే వస్తానని స్పష్టం చేస్తుంది. వీళ్లు వెధవల్లాగే కనిపిస్తున్నా.. తనను మాత్రం బాగానే చూసుకుంటున్నారని అంటుంది.

దీంతో ఇంట్లో నాన్నమ్మ, తాతయ్యలను తాను చూసుకుంటానని నందు హామీ ఇస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావని ఇందు అడిగితే.. నువ్వే కదా నన్ను దేవుడి ఇచ్చిన చెల్లెలు అని అన్నావని నందు అంటుంది. ఆమెకు ధైర్యం చెబుతుంది. ఇంట్లో వాళ్ల సంగతి తాను చూసుకుంటానని ఇందుకి ధైర్యం చెప్పి వెళ్లిపోతుంది.

నగలు చక్రి ముందు పెట్టిన రేఖ, ఇంట్లో వాళ్లు

అపర్ణ అందుకు నో చెప్పడంతో భ్రమరాంబ బలవంతంగా ఆమె చేతికి ఉన్న గాజులను తీసుకోవడానికి దౌర్జన్యం చేస్తుంది. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే అపర్ణ చెయ్యి వదిలేస్తుంది భ్రమరాంబ. మిమ్మల్ని చూస్తుంటే అంతా డౌట్ గా ఉందని, నగల కోసమే ఇంత చేస్తున్నారంటూ ఇందు ఆస్తి కోసం ఇంకెంత చేస్తారో అని అంటుంది. అయినా స్వరాజ్ గ్రూపు నడుపుతూ మీ దగ్గర రూ.కోటి లేవా అని అడుగుతుంది. అంత డబ్బు ఎవరూ ఇంట్లో పెట్టుకోరంటూ రేఖ వెళ్లిపోతుంది.

ఇందుని కలిసినట్లు చెప్పిన నందు

ఇటు తాను ఇందుని కలిసినట్లు అపర్ణకు చెబుతుంది నందు. ఆమె బాగానే ఉందని, మళ్లీ ఈ ఇంటికి మహారాణిలా తిరిగి వస్తుందని, అంతా సర్దుకుంటుందని చెబుతుంది. దీంతో అపర్ణ ఊపిరి పీల్చుకుంటుంది.

రూ.50 లక్షలే ఇస్తానన్న చక్రి

అటు చక్రి ఇంట్లో వాళ్లు ఇచ్చిన నగలను తీసుకుంటాడు. అయితే దీనికి కేవలం రూ.50 లక్షలే ఇస్తానని, అది కూడా వారం రోజుల్లో తన అప్పు మొత్తం తీరుస్తానంటేనే ఇస్తానంటారు. దీనికి రేఖ సరే అంటుంది. నగలు తీసుకొని చక్రి వెళ్లిపోతాడు. మిగిలిన రూ.50 లక్షల గురించి రేఖ టెన్షన్ పడుతుంది.

సుభాష్ సర్జరీ గురించి నందు అనుమానం

అప్పుడే నందు బయటకు వచ్చి మీ అందరిపైనా అనుమానం వస్తోందని అంటుంది. ఇంత ఆస్తి ఉన్నా తాతయ్యకు ఎందుకు సర్జరీ చేయించలేదు.. కనీసం రూ.15 లక్షలు లేవా అని నిలదీస్తుంది. మీ అందరిపైనా అనుమానం ఉందని, ఆయనకు సర్జరీ చేయించకపోతే ఎఫ్ఐఆర్ లో అందరి పేర్లూ రాస్తానని అంటుంది. దీంతో భయపడిపోయిన భ్రమరాంబ తాము సర్జరీ చేయిస్తామని చెబుతుంది. ఇప్పటికే రూ.50 లక్షల కోసం ఆలోచిస్తుంటే.. మరో రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావంటూ భ్రమరాంబను కోప్పడుతూ రేఖ వెళ్లిపోతుంది.

ఇందుని చూసేసిన ఇంటి ఓనర్

ఇటు ఇందుని దాచి ఉంచిన ఇంటి ఓనర్ సడెన్ గా వస్తాడు. ఇంట్లో లక్కీతోపాటు రాజు ఉండటం చూస్తాడు. వీడెవడు అని అడగడంతో వంటవాడు కావాలని అడిగారు కదా అందుకే తీసుకొచ్చానని లక్కీ అంటాడు. సరే అంటూ అతడు ఈ వంటలు కావాలని పెద్ద లిస్ట్ ఇస్తాడు. దీంతో చేసేది లేక ఇందు సాయం కోరతాడు రాజు. కిచెన్ లో ఇందు వంట చేస్తుండగా ఓనర్ ఆమెను చూస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe