...
...
Next Story

Brahmamudi Promo: బ్రహ్మముడి.. ఇందుని లాక్కెళ్లిపోయిన రేఖ.. రాజు మనసు ముక్కలు.. లక్కీ చేతుల్లో కోటి రూపాయలు

Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇందును రాజు నుంచి రేఖ లాక్కెళ్లిపోవడం, అది చూసి అతని మనసు ముక్కలవడం చూడొచ్చు. అటు లక్కీ చేతికి రూ.కోటి అందుతాయి.

Published on: Apr 29, 2026, 16:09:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 29వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందుని కిడ్నాప్ చేసి, మెల్లగా ఆమె ప్రేమలో పడిపోతున్న రాజుకు ఊహించని షాక్ తగులుతుంది. ఇందుని రేఖ దూరంగా తీసుకెళ్లిపోతుంటే అతడు ఏమీ చేయలేక అలా చూస్తుండిపోతాడు.

విడిపోయిన రాజు, ఇందు

Brahmamudi Promo: బ్రహ్మముడి.. ఇందుని లాక్కెళ్లిపోయిన రేఖ.. రాజు మనసు ముక్కలు.. లక్కీ చేతుల్లో కోటి రూపాయలు
Brahmamudi Promo: బ్రహ్మముడి.. ఇందుని లాక్కెళ్లిపోయిన రేఖ.. రాజు మనసు ముక్కలు.. లక్కీ చేతుల్లో కోటి రూపాయలు

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో ఇందుని రేఖ లాక్కెళ్తుండటం చూడొచ్చు. ఆమె కళ్లలో పడకుండా దూరంగా రాజు.. ఇందుని బాధతో చూస్తుంటాడు. అటు ఇందు కూడా రాజుని వదిలి వెళ్తూ కంటతడి పెడుతుంది. సాహు ఇచ్చిన డెడ్ లైన్ లోపు డబ్బు వసూలు చేయాల్సిందే అని అనుకున్న రాజు.. రేఖపై ఒత్తిడి తెచ్చి డబ్బు ఇచ్చేలా చేస్తాడు.

ఇందుపై రాజు ప్రేమ

అదే సమయంలో ఇందు దూరం కాబోతుందన్న బాధ అతన్ని తీవ్రంగా కలచివేస్తుంది. కొన్ని రోజుల్లోనే వాళ్ల మధ్య ఉన్న శతృత్వం ప్రేమగా మారుతుంది. కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఏకంగా తన ఇంటికే తీసుకొచ్చి, తన తల్లిదండ్రుల పెళ్లి రోజును ఘనంగా జరిపించిన రాజు.. క్రమంగా ఇందుకు దగ్గరవుతుంటాడు.

ఇంతలో సాహు మళ్లీ ఇంటికి వచ్చి బెదిరించడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇందు కోసం రేఖ నుంచి డబ్బు వసూలు చేయడం, ఆమెను రేఖకు అప్పగించడంతో రాజు కుంగిపోతాడు. ఈ ప్రోమోలో ఇందు, రాజులకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చూడొచ్చు.

లక్కీ చేతుల్లో రూ.కోటి

అయితే ఇందుని రేఖ తీసుకెళ్లిపోవడంతో ఇక ఆస్తి పత్రాలపై సంతకం చేయలేని పరిస్థితుల్లో ఆమె పడిపోయినట్లు కనిపిస్తోంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇందు మరో ఎత్తు ఏదైనా వేస్తుందా? ఇందుని రాజు కాపాడతాడా? నందు ఆమెకు అండగా నిలుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్లు చాలా ఆసక్తిగా సాగబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe