...
...
Next Story

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి.. రాజుకు సాహు 24 గంటల డెడ్‌లైన్.. కేక్ కట్ చేసి మరీ వార్నింగ్.. ఇందుని చూసి..

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో రాజుకు 24 గంటల గండం ముంచుకొస్తుంది. సాహు ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇందు విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాజు పడిపోతాడు.

Published on: Apr 29, 2026, 08:54:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చలపతి, లక్ష్మి 25వ పెళ్లి రోజును అందరూ కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అయితే సాహు రూపంలో రాజుకు మరోసారి గండం ముంచుకొస్తుంది. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఇందుని చూసి రాజు బాధపడుతుంటాడు.

చికెన్ కోసం అలిగిన లక్కీ

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి.. రాజుకు సాహు 24 గంటల డెడ్‌లైన్.. కేక్ కట్ చేసి మరీ వార్నింగ్.. ఇందుని చూసి..
Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి.. రాజుకు సాహు 24 గంటల డెడ్‌లైన్.. కేక్ కట్ చేసి మరీ వార్నింగ్.. ఇందుని చూసి..

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 29) ఎపిసోడ్ చికెన్ కోసం లక్కీ అలిగే సీన్ తో మొదలవుతుంది. వచ్చిన వాళ్లకే చికెన్ సరిపోదని, నీకు లేదని ఇందు అంటుంది. దీంతో తాను వెళ్లిపోతానని లక్కీ అంటాడు. ఎవరూ వద్దని అనకపోవడంతో తనకు తానుగా ఉండిపోతాడు. నువ్వు వెళ్లవని తెలుసు లేరా అని రాజు అనడంతో ఇందు, నందు నవ్వుతారు.

దండలు మార్చుకున్న చలపతి, లక్ష్మి

ఆ తర్వాత వెంకీ దండలు తీసుకొస్తాడు. ఇందు వాటిని ఇచ్చి మార్చుకోమని చలపతి, లక్ష్మికి చెబుతుంది. ఇద్దరూ దండలు మార్చుకుంటారు. అందరూ అక్షింతలు వేస్తారు. ఆ తర్వాత తమ 25 ఏళ్ల దాంపత్య జీవితం గురించి మాట్లాడమని వాళ్లను ఇందు కోరుతుంది.

ఎమోషనల్ అయిన చలపతి, లక్ష్మి

అప్పుడు చలపతి ఎమోషనల్ అవుతాడు. తాను ఎంతో గొప్పవాడిని కావాలని కలలు కన్నానని, తన భార్య కూడా అదే అనుకుందని, అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లే తమ లోకమయ్యారని అంటాడు. వాళ్లకు ఏ కష్టం రాకుండా పెంచాలనే తాము అనుకున్నామని, అందుకే ఇలా మిగిలిపోయామని చెబుతాడు.

ఆ తర్వాత రాజు గురించి చలపతి గొప్పగా చెబుతాడు. పిల్లలిద్దరినీ ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అనుకునేవాడినని, కానీ స్థోమత లేకపోవడంతో నా పెద్ద కొడుకు రాజు తాను గవర్నమెంట్ స్కూలుకు వెళ్లి, తమ్ముడిని ప్రైవేట్ స్కూలుకు పంపేలా చేశాడని అంటాడు. ఎప్పుడూ తిట్టే నాన్న తన గురించి అలా మాట్లాడటంతో రాజు సంతోషంతో ఉప్పొంగిపోతాడు. చూశావా మా నాన్న ఎలా పొగుడుతున్నాడో అని ఇందుతో అంటాడు.

అమ్మానాన్నను తలచుకొని బాధపడిన ఇందు, నందు

రాజు, వెంకీలను చలపతి, లక్ష్మీ ప్రేమగా చూసుకోవడం చూసి ఇందు, నందు బాధపడతారు. తన అమ్మానాన్న ఉండి ఉంటే ఇలాగే చేసి ఉండేదాన్నని ఇందు అంటుంది. తాను కూడా అని నందు అనుకుంటుంది. వాళ్లు లేరా అని అడుగుతుంది. వాళ్లు చనిపోయారని ఇందు చెబుతుంది. నందు కూడా తనకూ తల్లిదండ్రులు లేరని అంటుంది. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు.

ఇందు ఇంటి కోడలు కావాలని ఆశపడ్డ చలపతి

ఆ తర్వాత అందరికీ భోజనాలు వడ్డిస్తారు. ఇందు, నందు, రాజు, లక్కీ కలిసి భోజనాలు పెడతారు. వంటన్నీ అదిరిపోయానని వాళ్లు అంటారు. అవి చేసింది ఈ అమ్మాయే అని ఇందుని చూపిస్తాడు చలపతి. ఆమె మీ ఇంటికి కాబోయే కోడలా? ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు రాజుకి ఇచ్చి పెళ్లి చేయండని అనడంతో రాజు, ఇందు షాక్ తింటారు. చలపతి, లక్ష్మీ ఏమో తాము కూడా అదే కోరుకుంటున్నట్లు చెబుతారు.

చదివింపులకు ఆశపడిన రాజు, లక్కీ

అటు చికెన్ కోసం అయిన డబ్బులను చదివింపుల రూపంలో తీసుకోవాలని రాజు, లక్కీ ప్లాన్ చేస్తారు. భోజనాలు అయిపోగానే ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. వచ్చిన అతిథుల నుంచి చదివింపులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే.. ఇందు వాళ్లకు క్లాస్ పీకి అడ్డుకుంటుంది.

ఆ తర్వాత సాహు తన మనషులతో కలిసి రాజు ఇంటికి వస్తాడు. చలపతి, లక్ష్మీ పెళ్లి రోజును కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తాడు. తర్వాత రాజుకు 24 గంటల టైమ్ ఇస్తాడు. డబ్బు ఇవ్వకపోతే మీ వాళ్లు మిగలరు అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఏం చేయాలో తెలియక రాజు ఎంతో బాధతో ఇందు వైపు చూస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe