...
...
Next Story

Brahmamudi August 10 Episode: బ్రహ్మముడి- రాజు ప్లాన్ ఫెయిల్- ఐశ్వర్యకు మత్తుమందు, రేప్- శశి కుట్ర తెలుసుకున్న ఇందు నందు

Brahmamudi Serial August 10th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ ఎపిసోడ్‌‌లో రాజు వేసిన లక్కీ పెళ్లి చూపుల ప్లాన్ ఫెయిల్ అవుతుంది. శశి తన బర్త్ డే ఉందని పార్టీకి ఐశ్వర్యను పిలుస్తాడు. శశిని పెళ్లి చేసుకుంటే వంద కోట్లకు అధిపతి తానే అవుతుందని ఐశ్వర్య అనుకుంటుంది. ఐశ్వర్య పార్టీకి వెళ్లిపోతుంది.

Published on: Aug 10, 2026, 09:32:25 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీకి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. పెళ్లి కొడుకు వచ్చాడుగా ముసుగు తీయవా అని శేషు అడిగితే.. పెళ్లికూతురు తీస్తుంది. ముసుగు తీయకుంటేనే బాగుండేది అని శేషు మనసులో అనుకుంటాడు.

లక్కీ అమ్మనాన్న గురించి

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ ఎపిసోడ్

పెళ్లికూతురుని లక్కీని చూడమని రాజు బలవంతం చేస్తాడు. ఐషును తప్పా ఇంకెవరిని చూడనని లక్కీ అంటే.. బలవంతంగా చూపిస్తాడు రాజు. తర్వాత లక్కీ అమ్మనాన్న గురించి అడుగుతుంది పెళ్లికూతురు తల్లి. రేఖవైపు చూస్తాడు రాజు. అందరిగురించి చెప్పారు గానీ తల్లిదండ్రుల గురించి చెప్పలేదని అడుగుతారు పెళ్లిచూపుల వాళ్లు.

ఉంటే కదా చెప్పడానికి అని భ్రమరాంబ అంటుంది. మావోడికి అమ్మనాన్న లేరండి. చనిపోయారో లేదో తేలియదండి. వాళ్ల అమ్మ ఎవరో వాడికి తెలియదండి. వాడికే కాదు మాకు ఎవరికి తెలియదని రాజు అంటాడు. అమ్మ ఎవరో తెలియదంటే ఎవరికి పుట్టాడో తెలియదన్నట్టేగా అని పెళ్లికూతురు తల్లి కాస్తా అవమానంగా అంటుంది.

వాన్ని చిన్నప్పుడే లక్కీని అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయిందని రాజు చెబుతాడు. అసలు అది తల్లేనా, మనిషినా అని తిడుతుంది పెళ్లి కూతురు తల్లి. భ్రమరాంబ కూడా తిడుతుంది. నాకు తెలిసి అది మనిషే కాదు. అలాంటి దరిద్రపుదాని కడుపులో పుట్టినందుకు వీడి బతుకు ఇలాగే ఉంటుంది. అదెవరో తెలిస్తే చెప్పు తిరిగేసి తిరగేసి కొట్టేదాన్ని, చీపురుకట్ట తీసుకుని సింగారించేదాన్ని అని భ్రమరాంబ అంటుంది.

తల్లి స్థానంలో ఉండేదేంటీ

ఈ నష్టజాతకుడికి నేను తల్లి స్థానంలో ఉండేదేంటీ అని భ్రమరాంబ అంటుంది. నీకిష్టం లేకపోతే మా రేఖ పిన్ని వాడి తల్లి స్థానంలో ఉంటుంది. అసలు రేఖ పిన్నేగా వాడి తల్లి అని రాజు అంటాడు. అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే, ఇంటికి వచ్చినప్పుడే పిన్నిలో వాడి తల్లిని చూసుకోమ్మని చెప్పాను. షాకులివ్వకండి అని రాజు అంటాడు.

వాడికి మా రేఖ తల్లిగా ఉండటం ఏంటని భ్రమరాంబ అడ్డుపడితే రాజు చేయి చూపిస్తాడు. దాంతో భ్రమరాంబ భయపడుతుంది. రేఖ పిన్ని చెప్పండి. లక్కీకి తల్లి స్థానంలో ఉంటావా. వాడి తల్లివని చెబుతావా అని రాజు అంటాడు. వదిలేయ్ బాబు. ఇంట్లోవాళ్లే ఒప్పుకోవట్లేదు. తల్లి భరించని వ్యక్తి మాకెందుకు అని పెళ్లికూతురు తల్లి అంటుంది.

రాజు ప్లాన్ ఫెయిల్

అయ్యే మా రేఖ పిన్ని ఒప్పుకుంటుందని రాజు అంటాడు. వాడికి తల్లిలా నిలబడతావా లేదా అని రాజు అడుగుతాడు. ఎవరికి పుట్టాడో తెలియనివాడిని అల్లుడిగా ఎందుకు చేసుకోవాలని పెళ్లికూతురు తల్లి అంటుంది. రేఖను ఒప్పుకోమని అపర్ణ కూడా అంటుంది. నాకు సంబంధం లేని వ్యక్తికి తల్లిగా నిలబడే అవసరం లేదు అని కోపంగా వెళ్లిపోతుంది రేఖ.

పెళ్లిచూపుల వాళ్లు కూడా వెళ్లిపోతారు. అలా రాజు ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రాజుపై లక్కీ ఇదంతా ఎందుకురా అని కోప్పడుతాడు. నీ మంచి కోసమని రాజు అంటే.. ఏంట్రా మంచి అందరి ముందు పరువు తీశావ్. ఇదేనా మంచి అని లక్కీ కూడా కోపంగా వెళ్లిపోతాడు. మనం అనవసరంగా లక్కీని బాధపెట్టామని ఇందు అంటుంది.

లేదు లక్కీపై రేఖ పిన్నికి ప్రేమ ఉంది. లక్కీని అవమానిస్తుంటే రేఖ పిన్నిలో బాధ కనిపించిందని రాజు అంటాడు. మరోవైపు కోపంగా రేఖ ఫ్లవర్ వాజ్ పగలగొడుతుంటే దాన్ని రాజు క్యాచ్ పట్టి షాకిస్తాడు. ఎందుకంత కోపమని అడుగుతాడు. ఎందుకు వచ్చావని రేఖ అడుగుతుంది. బాగా కాక మీదున్నావుగా చల్లార్చి పోదామని వచ్చానని రాజు అంటాడు.

కుంతి కంటే గొప్పదానివి

కన్నకొడుక్కి అంత అవమానం జరుగుతున్నా ఏం అనలేదు చూడు నువ్వు చాలా గ్రేట్ పిన్నీ. నీకు వాడికి ఎమోషనల్ బాండింగ్ లేదు. పెళ్లి వాళ్లు నీ అమ్మతనం గురించి కూడా తప్పుగా మాట్లాడారుగా.. ఏమనిపించలేదా అని రాజు అంటాడు. లేదని రేఖ అంటుంది. వావ్ పిన్నీ, నువ్వు ఆ కుంతి కంటే గొప్పదానివని రాజు అంటాడు.

నన్ను రెచ్చగొట్టడానికే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశావని తెలుసని రేఖ అంటుంది. నీ కొడుకును దగ్గరికి చేసేందుకు అనుకోవచ్చుగా. ఇప్పటివరకు నీకు అన్నీ అవకాశాలు ఇచ్చాను. కానీ, లక్కీ నీ కొడుకని అంగీకరించవని తెలిసిపోయింది. నీకిచ్చిన గడువు అయిపోయింది. నువ్వు లక్కీ నీ కొడుకు అని ఒప్పుకోవాలి. లేకుంటే ఎలా చెప్పాలో అలా బయటపెడతాను అని రాజు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ఐశ్వర్యకు శశి కాల్ చేస్తాడు. బర్త్ డే విషెస్ చెబుతుంది ఐశ్వర్య. క్లోజ్ ఫ్రెండ్‌కి చాలా స్పెషల్‌గా విష్ చేయాలిగా అని శశి అంటాడు. నువ్వు ఢిల్లీలో ఉన్నావుగా అని ఐశ్వర్య అంటుంది. నేను ఢిల్లీలో లేను. నీకు చెప్పానుగా నా బర్త్ డే రోజు సర్‌ప్రైజ్ ఉందని, నీకోసమే నేను వచ్చానను. నేను పార్టీ అంతా అరెంజ్ చేశాను. నీకు లొకేషన్ పెడుతున్నాను వచ్చేసేయ్ అని శశి అంటాడు.

100 కోట్లకు నేనే అధిపతి

దానికి చాలా సంతోషంగా అలాగే అని ఐశ్వర్య అంటుంది. బిజినెస్ పనులన్నీ నాకోసం వదిలి వచ్చాడంటే ఇవాళ నాకు తప్పకుండా ప్రపోజ్ చేస్తాడు. వాడు ప్రపోజ్ చేయగానే ఈ రింగ్ వాడికి తొడిగి పెళ్లి చేసుకుందామని నెక్ట్స్ స్టెప్‌కు తీసుకెళ్తా. వాడితో పెళ్లయితే 100 కోట్లకు నేనే అధిపతిని, మహారాణిలా బతకొచ్చు. ఎలా అనుకుంటే అలా ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు అని ఐశ్వర్య అనుకుంటుంది.

ఐశ్వర్య రెడీ వెళ్తుంటే స్వాతి చూస్తుంది. ఎక్కడికి వెళ్లొద్దని చేయి పట్టుకుని స్వాతి ఆపుతుంది. నీ లైఫ్ కోసమేగా అందరు చెబుతుంది, ఎందుకిలా చేస్తున్నావ్. నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని స్వాతి అంటుంది. నా లైఫ్ ఏంటో నాకు తెలుసు. నేను జీవితంలో దర్జాగా బతకాలనుకుంటున్నాను అని ఐశ్వర్య అంటుంది.

నేను త్వరలోనే మహారాణి అవుతాను. అదంతా చూసి మీరు తట్టుకోలేరు అని ఐశ్వర్య అంటుంది. స్వాతి అడ్డంగా నిల్చుంటే తోసేసి ఐశ్వర్య వెళ్తుంది. వెళ్లి ఇందుకు చెబుతుంది స్వాతి. అది రోజు ఉండేదేగా. ఈ బాధలు తప్పవని ఇందు అంటుంది. తను రెగ్యులర్‌గా వెళ్లినట్లు లేదు. నేను త్వరలోనే మహారాణిని అవుతాను, అది చూసి మీరంతా షాక్ అవుతారని అందని, ఏదో చేయబోతుందని భయంగా ఉందని స్వాతి చెబుతుంది.

శశి కుట్ర తెలుసుకున్న ఇందు నందు

తను ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. తన ఫోన్‌లో జీపీఎస్ పెట్టాను అని ఇందు అంటుంది. కట్ చేస్తే ఐశ్వర్య ఫ్రెండ్‌ను కనిపెట్టిన ఇందు, నందు కొట్టి నిజం చెప్పిస్తారు. శశి పరమదుర్మార్గుడని, ఇవాళ వాడి బర్త్ డే కాదని శశి మోసం గురించి చెబుతుంది.

మరోవైపు ఐశ్వర్యకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇస్తాడు శశి. ఐశ్వర్య మత్తుతో పడిపోగానే బెడ్‌పై వేసి ఐశ్వర్యను రేప్ చేయబోతాడు శశి. మరోవైపు ఐశ్వర్యను కాపాడేందుకు కంగారుగా వస్తుంటారు నందు, ఇందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe