...
...
Next Story

Brahmamudi August 11 Episode: బ్రహ్మముడి- ఇందుకు టోకర ఇచ్చిన ఐశ్వర్య- లీవ్‌లో రాజు- శశి చేతిలో ఐశ్వర్య శీలం-వెంకీ ప్లాన్

Brahmamudi Serial August 11th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 11వ ఎపిసోడ్‌‌లో ఐశ్వర్య ఫోన్‌లో జీపీఎస్ పెట్టానని దాంతో ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటానని ఇందు ని రాజుకు కాల్ చేస్తుంది. అప్పటికే లక్కీతో తాగుతున్న రాజు లీవ్‌లో ఉన్నానని, ఏ పని చేయనని కాల్ కట్ చేస్తాడు. నందుకు వెంకీ కాల్ చేస్తాడు.

Published on: Aug 11, 2026, 09:36:43 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య పార్టీకి వెళ్లడం గురించి స్వాతి కంగారుపడుతుంది. ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుస్తుంది. తన ఫోన్‌లో జీపీఎస్ ట్రాకర్ బావతో పెట్టించానని ఇందు చెబుతుంది. సరే ఎలాగైనా అక్కను కాపాడనమని స్వాతి అంటుంది.

రేపు ఒకటి చేయబోతున్నా

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 11వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 11వ ఎపిసోడ్

నేను చూసుకుంటానని ఇందు వెళ్తుంది. నందుకు వెంకీ కాల్ చేస్తాడు. ఇందు అక్క చెప్పింది నిజమే అనుకుని నందు అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది. నీతో మాట్లాడాలని వెంకీ అంటాడు. నందు సెటైర్లు వేస్తుంది. ఏదో చిరాకులా అలా మాట్లాడాను. సారీ. రేపు కలుద్దామా అని వెంకీ అడుగుతాడు. సరేనని సంతోషంగా చెబుతుంది నందు.

వెంకీ మాట్లాడింది తల్లి లక్ష్మి చూస్తుంది. మళ్లీ ఎందుకు కలవాలనుకుంటున్నావ్ అని అడుగుతుంది. అలా కఠినంగా మాట్లాడినంత మాత్రానా నన్ను దూరం చేసుకోదు. తను నన్ను పూర్తిగా మర్చిపోవాలని నేను రేపు ఒకటి చేయబోతున్నాను అని వెంకీ తల్లికి చెబుతాడు. అంటే నందు శాశ్వతంగా దూరమయ్యేలా వెంకీ ఏదో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నీకు బాధగా లేదా అని తల్లి అంటే.. నరకంగా ఉందమ్మా. ఈ ప్రాణం తను పెట్టిన భిక్ష అని వెంకీ అంటాడు.

తనకోసం చచ్చిపోయేంత ప్రేమ ఉంది కానీ, చిన్నప్పటి నుంచి నాకోసం కష్టపడిన నాన్న ప్రేమ కట్టిపడేసింది. చెబితే నాన్న అర్థం చేసుకుంటారు. కానీ, సంతోషంగా ఉండలేరు. నాకు నాన్న సంతోషమే ముఖ్యమే. నాన్న కోసం నా ప్రేమను దూరం చేసుకోక తప్పదు అని వెంకీ ఎమోషనల్‌గా అంటాడు. మరోవైపు తలపై తడిగుడ్డ వేసుకుని లక్కీ మందు తాగుతుంటాడు.

మందు మీద ఒట్టు

నా మీద నమ్మకం లేదా. నేను నిన్ను మోసం చేస్తానా. నువ్వు నా ఫ్రెండ్‌విరా. నువ్వు నా ఎమోషన్‌రా అని రాజు అంటాడు. నీకు మా అమ్మ గురించి తెలుసనిపిస్తుంది. దండం పెడతానురా చెప్పు అని లక్కీ అంటాడు. నేను ఆ పనిమీదే ఉన్నాను. ఇంకొన్ని రోజులు నేను చెప్పింది విను. మీ అమ్మను తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. మనం తాగే మందు మీద ఒట్టేసి చెబుతున్నా అని రాజు ప్రామిస్ చేస్తాడు.

ఇద్దరు చేస్ కొట్టుకుని తాగుతారు. మరోవైపు ఇందుకు ఐశ్వర్య జీపీఎస్ ఆఫ్‌లో కనిపిస్తుంది. ఐశ్వర్య జీపీఎస్ ట్రాకర్ ఆఫ్‌లో పెట్టి ఇందుకే టోకర ఇస్తుంది ఇస్తుంది. నా మీద నువ్వు నిఘా పెడతావని నాకు తెలుసు. అక్షరం ముక్క రాని నీకే అంతుంటే నాకు ఎంతుండాలి అని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది. రాజుకు ఇందు కాల్ చేస్తుంది.

లీవ్‌లో ఉన్నా రేపు చేయి

బావ ఎక్కుడున్నావ్ అని ఇందు అడిగితే.. ఇక్కడే ఉన్నా మరదలా అని రాజు అంటాడు. తాగావా అని ఇందు అంటే.. అవును, దానికి కూడా పేమెంట్ కట్ చేస్తావా అని రాజు అంటాడు. ఇందు వేరే ఏం చెప్పిన రాజు వినడు. బావ హెల్ప్ కావాలని ఇందు అంటే ఇప్పుడు లీవ్‌లో ఉన్నా. ఏదైనా రేపు చెప్పు అని రాజు కాల్ కట్ చేస్తాడు.

ఇక లాభం లేదని నందు దగ్గరికి వెళ్తుంది ఇందు. ఐశ్వర్య గురించి చెబుతుంది ఇందు. ఇప్పుడు నాకు తెలిసి ఐశ్వర్య ఆ శశితో పార్టీ చేసుకోడానికి వెళ్లింది. ఐషును శశి డ్రాప్ చేసినప్పుడు చూశాను. తన ఇంటెన్షన్ కరెక్టుగా లేదు. ఐషును కాపాడుకోవాలని ఇందు అంటుంది. నువ్వు చెబితే తను పట్టించుకోవట్లేదుగా. ఏదోటి అయితే గానీ నీ విలువ తెలిసిరాదని నందు అంటుంది.

ఎంత కాదనుకున్న తను మన అక్క. ఆ పార్టీ ఎక్కడ జరుగుతుందో తెలియాలని ఇందు గట్టిగా అంటుంది. ఐషుకు, శశికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే పార్టీ గురించి తెలుస్తుంది. అది సోషల్ మీడియాలో చూస్తే ఆ ఫ్రెండ్స్‌ను పట్టుకోవచ్చని నందు అని చూస్తుంది. శశి వీడేనా అని నందు అడిగితే.. ఇందు అవునంటుంది.

శశికి రింగ్ గిఫ్ట్

వీళ్లిద్దరికి కామన్ ఫ్రెండ్ రేణు అని నందు చెబుతుంది. ఇంతలో స్వాతి వచ్చి తను రేణు ఐశ్వర్య అక్క ఫ్రెండ్, తను ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు అని చెబుతుంది. దాంతో నందు రేణు అడ్రస్ పంపించుకుంటుంది. రేణు దగ్గరికి వెళ్తే పార్టీ ఎక్కడో తెలుస్తుందని నందు, ఇందు బయలుదేరుతారు. మరోవైపు ఐశ్వర్య కారులో నుంచి దిగుతుంది.

శశి వచ్చి ఐశ్వర్య కళ్లు మూసి ఇంట్లోకి తీసుకెళ్తాడు. శశి నువ్వేనా అని ఐషు అంటుంది. శశి చేతులు తీస్తాడు. బర్త్ డే విషెస్ చెబుతుంది ఐషు. ఐశ్వర్యపై ఎంతో ప్రేమ ఉన్నట్లు చెబుతాడు శశి. దాంతో లోలోపలే మురిసిపోతుంది ఐశ్వర్య. ఐశ్వర్య కొన్న రింగ్ శశికి బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్ అని చెప్పి ఇస్తుంది.

తననే తొడగమని శశి అంటాడు. శశికి ఐశ్వర్య రింగ్ తొడుగుతుంది. మొత్తానికి నా వలలో నువ్వు పడ్డావ్. ఈరోజు నీ అందం మొత్తం నా సొంతం చేసుకునే వరకు నిన్ను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు శశి. నీ గిఫ్ట్ కూడా నీలాగే అందంగా ఉందని శశి అంటాడు.

రేణు ద్వారా పార్టీ అడ్రస్

మరోవైపు ఐశ్వర్య ఫ్రెండ్ రేణును కొట్టి శశి గురించి నిజం తెలుసుకుంటారు నందు, ఇందు. రేణు ద్వారా ఐశ్వర్య అడ్రస్ తెలుసుకుంటారు నందు, ఇందు. ఐశ్వర్యను శశి అనుభవిచండం ఆపేందుకు కారులో బయలుదేరుతారు అక్కా చెల్లెళ్లు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe