Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో వెంకీకి నందు దూరమవడం, డిగ్రీ పాస్ కావడానికి ఐశ్వర్య పడే తంటాలు.. చివరికి వ్రతం పూర్తి చేయకుండానే ఇందుని వదిలి రాజు వెళ్లిపోవడం లాంటి సీన్లతో ఆసక్తికరంగా సాగింది. ఇందు విషయంలో ఐశ్వర్య చెప్పిందే నిజమని ఇంట్లో వాళ్లు నమ్మే పరిస్థితి వస్తుంది.
నందుకి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించిన వెంకీ

తనకు పోలీస్ ట్రైనింగ్ ఉందని, వరంగల్ వెళ్తున్నానని, తిరిగి రావడానికి పది నెలలు పట్టొచ్చని వెంకీకి, అతని ఫ్యామిలీకి నందు చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 26) ఎపిసోడ్ మొదలైంది. చలపతి అడిగిన ప్రశ్నలకు నందు ఏదోలా సమాధానాలు చెబుతుంది. దీంతో నీకు ఈరోజు ఏమైందమ్మా.. డల్లుగా ఉన్నావని అడుగుతాడు. ఇష్టమైన వాళ్లకు దూరమవుతున్నానన్న బాధ ఉంది అంకుల్ అని వెంకీని చూస్తూ అంటుంది నందు.
ఇక వెళ్తాను అని చెబుతూ.. ఏమైనా చెప్పేది ఉందా అని వెంకీని అడుగుతుంది. నందు అడుగుతుంది కదరా చెప్పు అని చలపతి అంటాడు. ఏమీ లేదు అని వెంకీ అంటాడు. ఏమైనా ఉంటే నీకు తప్ప వాడు ఇంకెవరికి చెబుతాడు.. తర్వాత ఫోన్ చేసిన చెబుతాడులే అని చెప్పి చలపతి వెళ్లిపోతాడు. వెంకీ మాత్రం ఆల్ ద బెస్ట్ చెప్పి ఊరుకోవడంతో నందు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
నందుకి మనసులో మాట చెప్పెయ్ అన్న లక్ష్మీ
నందు వెళ్లిపోయిన తర్వాత వెంకీ కూడా గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. దీంతో లక్ష్మీ అతనికి దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నందుకు నీ మనసులో మాట చెప్పెయ్ రా అని అంటుంది. ఆ దేవుడు నీకు ఇచ్చిన చివరి అవకాశం ఇదే కావచ్చు.. ఆ అమ్మాయి కూడా నీ నుంచి ఇదే ఆశిస్తూ ఉండొచ్చని చెబుతుంది. కానీ వెంకీ మాత్రం తాను చెప్పలేనని, నందు దూరంగా వెళ్లడమే తనకూ కావాలని అంటాడు.
ఐశ్వర్యకు చదువు తంటాలు.. ఎగతాళి చేసిన స్వాతి
ఇటు ఇందుకి తాను డిగ్రీ పాసవుతానని ఛాలెంజ్ చేసిన ఐశ్వర్య పుస్తకాలతో కుస్తీ పని మొదలు పెడుతుంది. కానీ తనకు అలవాటు లేని పని కావడంతో చదవడానికి నానా తంటాలు పడుతుంది. ఏ సబ్జెక్ట్ చదవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆమె ఉంటుంది. ఐశ్వర్యను చూసి స్వాతి ఆట పట్టిస్తుంది. ఎలా చదవాలో చెబుతుంది. కానీ ఐషూ మాత్రం వినదు. ఓసారి నిద్ర వచ్చేలా ఉండటంతో బాత్రూమ్ లోకి వెళ్లి ముఖం కడుక్కొని వస్తుంది.
{{/usCountry}}ఇటు ఇందుకి తాను డిగ్రీ పాసవుతానని ఛాలెంజ్ చేసిన ఐశ్వర్య పుస్తకాలతో కుస్తీ పని మొదలు పెడుతుంది. కానీ తనకు అలవాటు లేని పని కావడంతో చదవడానికి నానా తంటాలు పడుతుంది. ఏ సబ్జెక్ట్ చదవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆమె ఉంటుంది. ఐశ్వర్యను చూసి స్వాతి ఆట పట్టిస్తుంది. ఎలా చదవాలో చెబుతుంది. కానీ ఐషూ మాత్రం వినదు. ఓసారి నిద్ర వచ్చేలా ఉండటంతో బాత్రూమ్ లోకి వెళ్లి ముఖం కడుక్కొని వస్తుంది.
{{/usCountry}}తర్వాత ఫోన్ చూస్తే నిద్ర మత్తు పోతుందంటూ ఐదు నిమిషాలు చూస్తానని ఏకంగా గంటపాటు అదే పని చేస్తుంది. స్వాతి చెప్పడంతో మళ్లీ ఫోన్ పక్కన పడేసి బుక్కు పడుతుంది. కానీ నిద్రను ఆపుకోలేకపోతుంది. బెడ్ పై నుంచి లేచి స్వాతి టేబుల్ పై చదవడం మొదలు పెడుతుంది. కానీ అక్కడా చదవలేక చివరికి టేబుల్ పై కునుకు తీస్తుంది.
ఐశ్వర్యను చూసి ఇందు షాక్.. పెళ్లంటూ మరింత రెచ్చగొట్టి..
రాత్రంతా ఐశ్వర్య తెగ కష్టపడి చదివి ఉంటుందని ఆమె కోసం ఇందు కాఫీ తీసుకొని వస్తుంది. టేబుల్ పైనే పడుకోవడం చూసి చాలా కష్టపడినట్లు ఉందని అనుకుంటుంది. కానీ ఐషూ అస్సలు చదవలేదని స్వాతి చెబుతుంది. దీంతో ఇందు షాక్ తింటుంది. ఐషూని లేపుతుంది. రాత్రంతా చదవకుండా నిద్రపోయావా.. ఇలా అయితే డిగ్రీ ఎలా పాసవుతావు అని అంటుంది. తాను చదివానని ఐశ్వర్య చెబుతుంది. అయితే ఏదో ఒక సమాధానం చెప్పు అని అడిగితే.. నోరెళ్లబెడుతుంది.
ఇక లాభం లేదనుకొని ఈ చదువు, పాసవడాలు నీవల్ల కాదు కానీ.. నేను చెప్పిన పని చెయ్ అని ఇందు అంటుంది. ఐషూ అక్క మీద జాలితో పాస్ కాకపోయినా కంపెనీ పెట్టిస్తావా అని స్వాతి అడుగుతుంది. అదేం లేదు.. ఇంటి పని, వంట పని నేర్పిస్తాను.. అది నేర్చుకో.. ఆ తర్వాత మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపిస్తానని ఇందు అంటుంది. ఐషూని బాగా రెచ్చగొడుతుంది. అటు స్వాతి కూడా రెచ్చగొట్టడంతో ఐశ్వర్య వాళ్లపై మండిపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను డిగ్రీ పాసై చూపిస్తానని మళ్లీ ఛాలెంజ్ చేస్తుంది. నీ వల్ల కాదులే అని ఇందు వెళ్లిపోతుంది.
ఇందు తలపై అక్షింతలు వేయకుండానే వెళ్లిన రాజు
ఇటు ఇంట్లో అందరూ వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఇందుతో కలిసి రాజు కూడా కూర్చొంటాడు. అయితే భార్యలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తేనే వ్రతం పూర్తవుతుందని పంతులు చెబుతాడు. నీ భార్య తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించు అని రాజుతో అంటుంది ఐశ్వర్య. ఇందు అతని కాళ్లు మొక్కుతుండగా.. రాజుకు ఫోన్ వస్తుంది. హాస్పిటల్లో కోమాలో ఉన్న అతని గర్ల్‌ఫ్రెండ్ లో కదలిక వచ్చినట్లుగా చూపిస్తారు.
దీంతో చేతిలో అక్షింతలు ఇందు తలపై కాకుండా పక్కన పడేసి రాజు పరుగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. వాళ్లకు పెళ్లి జరగలేదని నేను చెబితే నమ్మలేదు కదా.. ఇప్పుడు చూశారా.. ప్రతిసారీ ఓ పూజా పూర్తవకుండా చేస్తున్నారు అని ఐశ్వర్య అంటుంది. దీంతో రేఖలో అనుమానం మరింత బలపడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.