...
...
Next Story

Brahmamudi August 3 Episode: బ్రహ్మముడి- శేషు ట్రాప్‌లో రాజు- ఇందును కొట్టిన అపర్ణ- రాజు నీ కూతురు కొడుకంటూ నిజం చెప్పి!

Brahmamudi Serial August 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ ఎపిసోడ్‌‌లో గుడికి ఇందు ఒక్కతే వస్తుంది. రాజు నీ భర్తనా, లేకా అద్దె మొగుడా అని ఒట్టేసి చెప్పేమంటుంది అపర్ణ. దాంతో అద్దె మొగుడని ఇందు చెబుతుంది. ఇందును లాగిపెట్టి కొడుతుంది అపర్ణ. ఐశ్వర్య నీకంటే నయం కదే అని అంటుంది.

Published on: Aug 3, 2026, 09:05:37 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణ, సుభాష్ గుడికి వెళ్లినట్లు శేషు చెబుతాడు. అలా ఎలా పంపించావ్. ఇప్పుడు వాళ్లు ఏ గుడికి వెళ్లారో ఎలా తెలుసుకోవడం అని భ్రమరాంబ అంటుంది. నేను కనుక్కుంటా. అల్లుడిని అడుగుతానని శేషు అంటాడు.

శేషు ట్రాప్‌లో రాజు

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ ఎపిసోడ్

అప్పుడు రాజు, ఇందు జాగ్రత్త పడతారుగా అని భ్రమరాంబ అంటుంది. నా బుర్ర వాడి తెలుసుకుంటాగా అని రాజుకు శేషు కాల్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేస్తాడు. ఎక్కడున్నావ్ అని శేషు అడిగితే.. రాజు ఆఫీస్‌లో ఉన్నానంటాడు. అదేంటీ మీతో సత్యనారాయణ వ్రతం చేయించడానికి గుడికి వెళ్లారుగా. నువ్వు ఆఫీస్‌లో ఉంటే ఎలా అని శేషు అంటాడు.

వీళ్లకు అనుమానం రాకుండా మ్యానేజ్ చేయాలని రాజు అనుకుంటాడు. నేను ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాను. అర్జంట్‌గా ఫైల్ చేయాల్సి వచ్చిందని రాజు అంటాడు. సరే త్వరగా చేసుకుని వచ్చేయండి. శివాలయంలోనే కదా పూజ అని శేషు అంటాడు. అదేంటీ నాకు వెంకటేశ్వర స్వామి ఆలయం కదా అని రాజు అంటాడు.

అవునా, అయితే నేనే మర్చిపోయింటా అని శేషు కాల్ కట్ చేస్తాడు. అలా శేషు ట్రాప్‌లో పడిన రాజు గుడి నిజం చెబుతాడు. తన తెలివి గురించి భార్య దగ్గర గొప్పలు పోతాడు. సరే పదండి అని భ్రమరాంబ అంటుంది. శేషుతో బయలుదేరుతుంది.

డౌట్ వచ్చింటుంది

మావయ్య గుడి పేరు తెలుసుకునేందుకు ఫోన్ చేసి ఉంటాడు. వాళ్లు అక్కడికి వెళ్లాలనుకుంటున్నట్లున్నారు. అనవసరంగా గుడి పేరు చెప్పానే. మనమీద ఏమైనా అనుమానం వచ్చింది. అమ్మో అక్కడ నేను ఇందు పూజ చేయకుంటే వాళ్లకు అనుమానం వస్తుంది. అలా జరగొద్దు అని ఇందుకు రాజు కాల్ చేస్తాడు. కానీ, ఇందు అస్సలు కాల్ లిఫ్ట్ చేయదు, కాల్ కట్ చేస్తుంది.

ఆటో బుక్ చేస్తాడు శేషు. ఆటోలో భ్రమరాంబ, శేషు గుడికి వస్తుంటారు. మరోవైపు రాజు కూడా కారులో వస్తుంటాడు. గుడికి ఇందు వెళ్తుంది. రాజు ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. రాలేదని, వర్క్ ఉందన్నాడని ఇందు అంటుంది. మీ మధ్య ఉన్న బంధం ఏంటీ. రాలేకపోయాడా రాకూడదు కాబట్టి రాలేదా. నాకు ఈ రోజు నిజం తెలియాలి. ఐశ్వర్య కోపంతో అందనుకున్నా. కానీ, రాత్రి నువ్వు రాజు వేరుగా పడుకోవడం చూశా. అప్పుడే అనుమానం వచ్చిందని అపర్ణ అంటుంది.

ఒట్టేసి నిజం చెప్పు

అది క్లియర్ చేసుకునేందుకు ఈ పూజ ఏర్పాటు చేశామని సుభాష్ అంటాడు. నాకు అనుమానం ఇంకా బలపడింది. రాజు నీ భర్త అయితే ఎందుకు వేరు వేరుగా పడుకుంటున్నారు. రాజు నిజంగానే మొగుడా లేకుంటే అద్దె మొగుడా అని అపర్ణ నిలదీస్తుంది. తను నా భర్త అని ఇందు అంటే.. అదే మాట నా మీద ఒట్టు వేసి చెప్పు అని అపర్ణ అంటుంది.

మా ఇద్దరికి పెళ్లి జరగలేదు అని నిజం చెప్పేస్తుంది ఇందు. రాజును అద్దె మొగుడిగానే ఇంటికి తీసుకొచ్చానని ఇందు చెబుతుంది. ఎంత పని చేశావే అని ఇందును లాగి చెంపపగలగొడుతుంది అపర్ణ. దాంతో ఇందు షాక్ అవుతుంది. పెళ్లి గురించి గొప్పగా చెబుతుంది అపర్ణ. మా పరువు తీశావుకదే. నీకన్న ఐషు నయం కదే. తాగిన ఇలా చేయదు. మా పెంపకం తప్పుడు మార్గంలో నడిచిందంటేనే తల తీసేసినట్లవుతుందని అపర్ణ అంటుంది.

అసలు నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందని సుభాష్ అంటాడు. రేఖ ఆంటీ ఆస్తి కోసం మదన్‌తో చేసే పెళ్లి తప్పించుకునేందుకు ఇంతకన్నా దారి దొరకలేదు అని ఇందు అంటుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ఏంటీ పరిస్థితి. నీకు పెళ్లి ఎలా జరుగుతుందని అపర్ణ అంటుంది. దీనివల్ల మనకు మంచే జరిగిందని ఇందు అంటుంది.

రాజు నీ కూతురు కొడుకు

పరాయి వాడిని మొగుడని ఎలా చెప్పుకున్నావే అని అపర్ణ అంటుంది. తను పరాయివాడు కాదు దుగ్గిరాల వారసుడు అని ఇందు నిజం చెప్పేస్తుంది. దాంతో అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. రాజు నీ కూతురు కొడుకు, మన ఇంటి బిడ్డ, మన ఇంటి రక్తం అని చలపతి చెప్పింది మొత్తం చెబుతుంది ఇందు. చలపతి అంకుల్ మాట తీసుకున్నారని చెప్పలేదు. కానీ, ఇప్పుడు మాట తప్పక తప్పలేదు అని ఇందు అంటుంది.

రాజు మన మనవడా.. మన వారసుడు. మన మనవడు బతికే ఉన్నాడు అని అపర్ణ తెగ సంబరపడిపోతుంది. మనకోసం మన మనవడిని దేవుడు ఉంచాడని సుభాష్ అంటాడు. ఈ విషయం రాజుకు తెలియదు అని ఇందు అంటుంది. ఇక రేఖకు బయపడేదేముందు. రాజుకు నిజం చెప్పేసి ఆ రేఖను ఇంట్లోంచి గెంటేద్దామని అపర్ణ అంటుంది.

వద్దు. ఈ విషయం బావకు తెలిస్తే మనకు నష్టం జరుగుతుంది. రేఖ ఆంటీ అందరిని చంపేసిందని తెలిస్తే బావ ఊరుకుంటాడా. రేఖ ఆంటీతో గొడవ పడతాడు. ఆ గొడవలో వాళ్లను బావ చంపేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రేఖ ఆంటీ ఏదైనా ప్లాన్ చేస్తే బావకు ప్రమాదం. ఇంకొన్ని రోజులు ఈ రహస్యం దాచాలి. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని ఇందు అంటుంది.

అమ్మ డైరీ నిజం చెయాలి

మా అమ్మ డైరీలో రాసుకుంది. మా అక్క చెల్లెళ్లలాగే తమ పిల్లలు కలిసి ఉండాలని. మా అమ్మ ఆశించినట్లు చేయాలి. రేఖ ఆంటీ గుప్పిట్లో నుంచి ఐశ్వర్యను బయటకు తీసుకురావాలి. తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. మంచి జీవితాన్ని ఇవ్వాలి. నందును పోలీస్ ఆఫీస్ ఆఫీసర్‌ను చేయాలి, బావ మనసులో స్థానం సంపాదించుకోవాలి. కేవలం డబ్బుకోసమే వచ్చిన బావను ఇంట్లో ఉండేలా చేస్తా. అప్పుడే నిజం చెబుతా. మీ అందరి సమక్షంలో మూడు ముళ్లు వేయించుకుంటా అని ఇందు అంటుంది.

ఈ విషయం ఎవరికి చెప్పకండని, బావకు అనుమానం రాకుండా ఎప్పటిలాగే ఉండాలని ఇందు అంటుంది. సుభాష్, అపర్ణ సంతోషంగా ఉంటారు. ఇంతలో రాజు పంచెకట్టుకుని కంగారుగా వస్తాడు. చిన్నప్పుడు స్వరాజ్‌ను ముద్దు చేసింది గుర్తు చేసుకుంటుంది అపర్ణ. కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ. నువ్వు ఎమోషనల్ అయితే బావకు డౌట్ వస్తుందని ఇందు అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks