...
...
Next Story

Brahmamudi August 4 Episode: బ్రహ్మముడి- ఐశ్వర్య రింగ్ ప్లాన్ ఫెయిల్- ఇందు మెడలో రాజుతో నల్లపూసల తాళి- రేఖకు టార్చర్

Brahmamudi Serial August 4th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 4వ ఎపిసోడ్‌‌లో గుడికెళ్లిన రాజు ఇందుతో శేషు, భ్రమరాంబకు డౌట్ వచ్చిందని చెబుతాడు. ఐశ్వర్యకు శశి ఫోన్ చేసి పార్టీకి రావట్లేదని, బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతాడు. వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందని ఐషు అనుకుంటుంది.

Published on: Aug 4, 2026, 09:05:22 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు గుడిలోకి వస్తాడు. అపర్ణ ఎమోషనల్ అవుతుంది. డౌట్ వస్తుందని ఇందు ఆపుతుంది. ఇప్పుడు మీరు ఇంటికెళ్లిపోండి, మీ అనురాగం, ఆప్యాయత తర్వాత చూసుకోండని ఇందు పంపిస్తుంది.

పంతులుతో అబద్ధం చెప్పమని

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 4వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 4వ ఎపిసోడ్

గుడు వెనక నుంచి వెళ్లిపోతారు సుభాష్, అపర్ణ. అమ్మమ్మ, తాతయ్య ఎక్కడ అని రాజు అడిగితే.. నువ్వు రాను అన్నాక వెళ్లిపోయారని ఇందు చెబుతుంది. నువ్వెంటీ పంచెలో వచ్చావని, మనం వ్రతం చేసుకుందామా అని ఇందు అంటుంది. శేషు మావయ్యకు, భ్రమరాంబ అత్తకు డౌట్ వచ్చింది. వాళ్లు ఇక్కడికి చెక్ చేయడానికి వస్తున్నారు. అందుకే నేను వచ్చానని రాజు అంటాడు.

ఇప్పుడు వ్రతం జరిపించలే కదా అని ఇందు అంటుంది. పంతులును చూసి రాజు వెళ్లి మాట్లాడుతాడు. నాకోసం చిన్న అబద్ధం చెప్పమని వేడుకుంటాడు రాజు. పంతులు అబద్థం చెప్పలేనంటాడు. ఇందాక సత్యనారాయణ వ్రతం చేయించుకున్నావాళ్లు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగితే.. ఒక జంటను చూపిస్తాడు పంతులు.

ఇంతలో శేషు, భ్రమరాంబ వస్తారు. చాలా లేట్ అయిందని, అసలు వాళ్లు వ్రతం చేయించుకున్నారో లేదో ఎలా తెలుసుకోవడం అని భ్రమరాంబ అంటుంది. అది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. పంతులును అడిగితే చెబుతాడని శేషు అంటాడు. వెళ్లి పంతులును అడుగుతారు ఇద్దరు. ఇంతలో రాజు, ఇందు వెళ్లి వ్రతం జరిపించుకున్న జంట దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు.

శేషు, భ్రమరాంబను ఏమార్చిన రాజు

ఇద్దరు వెళ్లిపోతారు. అలా భ్రమరాంబ, శేషులను ఏమారుస్తాడు రాజు. వాళ్లను ఎలా మ్యానేజ్ చేశానో చూశావా అని ఇందుతో అంటాడు రాజు. నన్ను మాత్రం చాలా తిట్టారు. నీ వల్ల మాటలు పడ్డాను. వాళ్లు చాలా కోపంగా ఉన్నారు. ఛీ నీ వల్లే ఇవన్నీ అని కోపంగా వెళ్లిపోతుంది ఇందు. ఇప్పుడు వాళ్లను, దీన్ని మ్యానేజ్ చేయాలని రాజు అనుకుంటాడు.

మరోవైపు ఐశ్వర్యకు శశి కాల్ చేస్తాడు. ఈరోజు పార్టీకి రావట్లేదని, అర్జంట్‌గా ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందని, చాలా ఇంపార్టెంట్, లేకుంటే కోట్లల్లో నష్టం వస్తుందని శశి అంటాడు. వీడు బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ముందు ముందు వీడే అన్నీ చూసుకుంటాడన్నమాట, వీడిని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుందని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది.

నా బర్త్ డేకి నీకు సర్‌ప్రైజ్

సరే పార్టీది ఏముంది తర్వాత చేసుకోవచ్చు. బిజినెస్ ముఖ్యమని ఐశ్వర్య అంటుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. రెండు రోజుల తర్వాత వస్తాను. అప్పుడు నా బర్త్ డే. ఆరోజు నీకు మంచి సర్‌ప్రైజ్ ఇస్తాను. నువ్వు ఆశ్చర్యపోతావ్ అని శశి చెప్పి కాల్ కట్ చేస్తాడు. వీడు ఇంతలా అంటున్నాడంటే కచ్చితంగా నాకు లవ్ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. వీడి లవ్ యాక్సెప్ట్ చేసి పెళ్లి వరకు తీసుకెళ్లాలి. అలా జరగాలంటే ముందు వీడికి స్పెషల్ రింగ్ అవ్వాలి అని ఐశ్వర్య అనుకుంటుంది.

ఆ రింగ్‌కి 2 లక్షలు అయినా పెట్టి తీసుకోవాలి. అంత డబ్బు ఎలా వస్తుంది. రేఖ ఆంటీని అడుగుదాం అని ఐశ్వర్య అనుకుంటుంది. మరోవైపు లక్కీ తన కొడుకు ఉన్న విషయం రాజు ఇంకెవరికి చెప్పాడు. వాడి ప్లాన్ ఏంటీ. దీని నుంచి ఎలా బయటపడాలి అని రేఖ ఆలోచిస్తుంది. అప్పుడే రేఖ తెలిసిపోయిందని భ్రమరాంబ అంటుంది.

ఇలా సడెన్‌గా వచ్చి తెలిసిపోయిందంటే టెన్షన్‌గా ఉంది. అదేంటో క్లియర్‌గా చెప్పండని రేఖ అంటుంది. నువ్వు పరధ్యానంలో ఉండి చూడట్లేదనుకున్నాం. కానీ, అన్ని చూస్తున్నావ్. నువ్వు చెప్పింది నిజమే. ఆరోజు ఐశ్వర్య ప్లే చేసింది అంతా ఫేక్. ఇందు మీద కోపంతోనే ఐశ్వర్య చేసింది. ఇందు, రాజుకు నిజంగానే పెళ్లి అయింది. వాళ్లు ఇవాళ గుడిలో వ్రతం చేసుకున్నారు అని భ్రమరాంబ అంటుంది.

ఐశ్వర్య ప్లాన్ ఫెయిల్

ఐషుకు కోపం తప్పా బుర్రలేదుగా. తనకోసం ఏమైనా చేస్తుంది. ఎన్ని అబద్ధాలైన చెబుతుందని రేఖ అంటుంది. అప్పుడే ఐశ్వర్య వచ్చి రెండు లక్షలు అడుగుతుంది. చిన్న పని ఉందని చెబుతుంది. నేను తింగరబుచ్చిని కదా, నన్నెందుకు అడుగుతున్నావ్ అని రేఖ అంటుంది. ఏదో కోపంతో అన్నానని సారీ చెబుతుంది ఐశ్వర్య.

నోర్మూయ్.. నీకు అడిగినంత డబ్బు ఇస్తే అందరిముందు నా పరువు తీస్తావా. ఇక నువ్వు చెప్పింది, తిరిగింది చాలని రేఖ అంటుంది. రెండు లక్షలు కాదు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని రేఖ చాలా కోపంగా చెబుతుంది. ఐశ్వర్య 2 లక్షల రింగ్ ప్లాన్ ఫెయిల్ అయి వెళ్లిపోతుంది. మరోవైపు రాజు గురించి ఆలోచిస్తుంటారు అపర్ణ, సుభాష్. ఇందు వచ్చి మీ మనవడు వస్తున్నాడు, మీరు చాలా కోపంగా ఉన్నానని చెప్పాను, చూసుకోండని వెళ్లిపోతుంది ఇందు.

రాజు వస్తే అపర్ణ, సుభాష్ ఎమోషనల్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనపై ప్రేమ చూపించకూడదు. కోపం నటించాలని చెప్పి ఇందు వెళ్లిపోతుంది. అమ్మమ్మా అంటూ రాజు వస్తాడు. ఆఫీస్ వర్క్ గురించి చెబుతాడు రాజు. మా మాటను ఎందుకు లెక్కచేస్తారు అని అపర్ణ అంటుంది. అక్కడ ఉద్యోగులు కూడా ముఖ్యమేగా. డీల్ ముఖ్యం, మీ ఆనందం కోసం ఏమైనా చేస్తామని అపర్ణ చేతులు పట్టుకుని అంటాడు రాజు.

కంట్రోల్ తప్పిన అపర్ణ

ఏమైనా చేస్తావా. నువ్వు చేస్తావురా. నువ్వు అసాధ్యుడివి. మృత్యుంజయడువి అని అపర్ణ ఏడుస్తూ కంట్రోల్ తప్పుతుంది. సుభాష్ వారిస్తాడు. నీ మీద మాకు నమ్మకం లేదురా అని కోపం నటిస్తూ అపర్ణ వెళ్లిపోతారు. నేను మరి అంత బాధపెట్టానా. వెంటనే కూల్ చేయాలని రాజు అనుకుంటాడు. తర్వాత వంట గదిలో ఇందు ఉంటే రాజు కూల్ చేసేందుకు ట్రై చేస్తాడు.

ఇందు మాత్రం చాలా కోపంగా నటిస్తుంది. చాలా హాట్‌గా అని రాజు అంటూ.. చాలా వేడిగా ఉందంటాడు. వ్రతం గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. నాకు వచ్చే కోపానికి.. దూరం వెళ్లు అని ఇందు అంటుంది. నేను మాట్లాడతాను అని రాజు అంటే.. చేతిలో ఉన్న పిండి ముద్ద తీసి రాజును కొడుతుంది ఇందు.

రాజు తప్పించుకుంటాడు. ఇందు అలిగి వెళ్లిపోతుంది. తర్వాత మా అమ్మ గురించి కనిపెడతారా అని రేఖతో లక్కీ అడుగుతూ ఎమోషనల్ అవుతాడు. రేఖ పిన్ని కనిపెడుతుందిరా, నువ్వెళ్లు అని లక్కీని పంపిస్తాడు రాజు. నన్నెందుకు టార్చర్ పెడుతున్నావని రాజుతో అంటుంది రేఖ. అందరిముందు లక్కీ నీ కొడుకు అని నీచేత్తో చెప్పించే బాధ్యత నాదని రాజు అంటాడు.

ఇందు మెడలో నల్లపూసల తాళి

తర్వాత రాజును మేము చెప్పింది చేస్తావా అని, ఇందు మెడలో నల్లపూసల తాళి వేయమంటారు అపర్ణ, సుభాష్. దానికి రాజు షాక్ అవుతాడు. వాళ్ల కోపం పోయేలా చేసేందుకు రాజు ఒప్పుకుంటాడని తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe