కవల పిల్లలు పుట్టిన 3 నెలల్లో 25 కేజీలు తగ్గిన సీరియల్ నటి- ప్రతి తల్లి పాటించాల్సిన హోమ్ డైట్ సీక్రెట్ చెప్పిన ఐశ్వర్య!

Aishwarya Salimath Weight Loss: సీరియల్ నటి ఐశ్వర్య కవల పిల్లలకు జన్మనిచ్చిన కేవలం మూడు నెలల్లోనే 25 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. 90 కేజీల నుంచి 65 కేజీలకు తగ్గేందుకు తను పాటించిన సింపుల్ హోమ్‌మేడ్ డైట్ సీక్రెట్లను ఐశ్వర్య పంచుకున్నారు. దీంతో ఐశ్వర్య డైట్ సీక్రెట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 3, 2026, 13:18:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Actress Weight Loss Journey: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్య సాలిమత్. 'అగ్నిసాక్షి', 'రామాచారి', 'సేవంతి', 'సరయు' వంటి అనేక పాపులర్ కన్నడ సీరియళ్ల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కన్నడ డబ్బింగ్ ధారావాహికల ద్వారా ఈమె బాగా చిరపరిచితమే.

కవల పిల్లలు పుట్టిన 3 నెలల్లో 25 కేజీలు తగ్గిన సీరియల్ నటి- ప్రతి తల్లి పాటించాల్సిన హోమ్ డైట్ సీక్రెట్ చెప్పిన ఐశ్వర్య!
కవల పిల్లలు పుట్టిన 3 నెలల్లో 25 కేజీలు తగ్గిన సీరియల్ నటి- ప్రతి తల్లి పాటించాల్సిన హోమ్ డైట్ సీక్రెట్ చెప్పిన ఐశ్వర్య!

ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్

ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఐశ్వర్య, ప్రస్తుతం నటనకు కాస్త విరామం ఇచ్చి పిల్లల సంరక్షణలో మునిగిపోయారు. అయితే, ప్రసవం తర్వాత తను సాధించిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

90 కేజీల నుంచి 65 కేజీలకు..

గతేడాది డిసెంబర్‌లో ఐశ్వర్య, నటుడు వినయ్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఆ ముద్దుల పిల్లలకు 'వజ్ర', 'వైడూర్య' అని పేర్లు పెట్టుకున్నారు. ప్రసవానంతరం బాలింతగా ఇంట్లోనే ఉంటున్న ఐశ్వర్య సలిమత్ పిల్లల సంరక్షణతో పాటు తన ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు.

కవల పిల్లలు పుట్టిన మూడు నెలల్లోనే!

కవలలు పుట్టిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఐశ్వర్య సలిమత్ ఏకంగా 25 కేజీల బరువు తగ్గడం విశేషం. ఒకానొక దశలో 90 కేజీలకు చేరుకున్న తన బరువును, ఇప్పుడు 65 కేజీలకు తగ్గించుకున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు.

కఠినమైన జిమ్ వర్కౌట్లు కావు..

చాలామంది ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి కఠినమైన క్రాష్ డైట్లు లేదా కష్టమైన వర్కౌట్లు చేస్తుంటారు. కానీ, ఐశ్వర్య మాత్రం కేవలం తన ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడం, ప్రతిరోజూ వాకింగ్ చేయడం ద్వారానే ఈ ఘనత సాధించారు.

ఇంట్లో వండుకునే తిండే!

"గతంలో చపాతీ, అన్నం, పప్పు వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేదాన్ని. కానీ, ఇప్పుడు నా డైట్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకుంటున్నాను. కఠినమైన డైటింగ్ కన్నా ఇంట్లో వండిన పౌష్టికాహారానికే ప్రాధాన్యమిచ్చాను" అని ఐశ్వర్య తన డైట్ సీక్రెట్లను వెల్లడించారు.

ఐశ్వర్య రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, గుడ్లు, పన్నీర్, మొలకెత్తిన విత్తనాలు, రాగి ముద్ద, పుట్టగొడుగులు (మష్రూమ్స్), బ్రోకలీ, బాదం, సూప్‌లు చేర్చుకున్నారు. వీటితో పాటు లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడిందని చెప్పారు.

పిల్లల ఆరోగ్యం కోసమే సరైన తిండి

కేవలం బరువు తగ్గడమే తన లక్ష్యం కాదని, పాలు ఇచ్చే తల్లిగా పిల్లల ఆరోగ్యం కోసం తాను పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని ఐశ్వర్య స్పష్టం చేశారు. సరైన ఆహారం, నిత్యం నడక వల్ల తన మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుందని, ప్రసవం తర్వాత వచ్చే 'మూడ్ స్వింగ్స్' సమస్య ఇప్పుడు తనకు లేదని ఆమె సంతోషంగా పంచుకున్నారు.

షూటింగ్ సెట్‌లో మొదలైన ప్రేమాయణం

ఐశ్వర్య, వినయ్‌ల ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 'మహాసతి' సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వేర్వేరు సీరియళ్లలో నటించినప్పటికీ వారి స్నేహం కొనసాగింది.

కాలక్రమేణా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో, రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2022లో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఈ దంపతులు తమ కవల పిల్లలకు నిరాడంబరంగా చెవులు కుట్టించే వేడుకను పూర్తి చేసి, ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More