Serial Heroine: సీరియల్ హీరోయిన్ రెండో పెళ్లి- హల్దీ ఫొటోలు షేర్ చేసిన జెన్నిఫర్ వింగెట్- తెలుగులోనూ కనిపించిన బ్యూటీ
Serial Actress Jennifer Winget Haldi Photos: ఇటీవలే బ్రిటన్‌లో గ్రాండ్‌గా రెండో వివాహం చేసుకున్న బుల్లితెర బ్యూటీ జెన్నిఫర్ వింగెట్, తన హల్దీ వేడుకలకు సంబంధించిన సరికొత్త ఫొటోలను పంచుకున్నారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ హల్దీ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Serial Actress Jennifer Winget Haldi Photos: భారతీయ బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సీరియల్ హీరోయిన్ జెన్నిఫర్ వింగెట్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. యూకేలోని వెస్ట్ వేల్స్ వేదికగా వ్యాపారవేత్త విలియమ్ ఇష్మాయెల్‌ను ఆమె క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.

గ్రీన్ లెహంగాలో మెరిసిన జెన్నిఫర్.. పక్కన వైట్ షేర్వానీలో విలియమ్
పెళ్లి జరిగి కొన్ని వారాలు గడిచినా, ఆ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉన్నాయంటూ ఈ భామా తాజాగా తన హల్దీ వేడుకల ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫ్రెండ్‌షిప్ డే (ఆగస్ట్ 2)ను పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ అన్ సీన్ ఫొటోల్లో జెన్నిఫర్ ఆకుపచ్చ రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది.
ఆమె భర్త విలియమ్ ఇష్మాయెల్ తెలుపు రంగు షేర్వానీలో మెరిసిపోయారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో జెన్నిఫర్ స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ హల్దీ పూసుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
బుల్లితెర ప్రముఖులు కరణ్ వాహి, హర్లీన్ సేతీ, సెహబాన్ అజీమ్ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్సులు చేస్తూ హల్దీ జరుపుకున్న ఫొటోలను హర్లీన్ సేతీ సైతం 'యారీ దోస్తీ హల్దీ' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని"
హల్దీ ఫోటోలను పోస్ట్ చేస్తూ జెన్నిఫర్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాసుకొచ్చారు. "నా హల్దీ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అది ప్రేమతో నిండిపోయిన ఒక అద్భుతమైన క్షణం. ఈ ఫొటోలు చూసిన ప్రతీసారి నాకు ఏదో ఒక కొత్త సంతోషం కనిపిస్తుంది. మంచి స్నేహితులు దొరకడం అదృష్టం అని అందరూ అంటుంటారు. అలా అయితే నేనే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలిని" అని జెన్నిఫర్ వింగెట్ పేర్కొన్నారు.
తన జీవితంలో ఇంత మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి ఏదో మంచి పనిచేసి ఉంటానని, నవ్వులతో తన చెంపలు నొచ్చేంతగా సంతోషపెట్టిన అందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానని జెన్నిఫర్ వింగెట్ రాశారు.
బ్రిటన్‌లో డ్రీమీ వెడ్డింగ్
జులైలో వెస్ట్ వేల్స్‌లోని అద్భుతమైన లొకేషన్‌లో జెన్నిఫర్, విలియమ్ వివాహం జరిగింది. తెల్లటి వీల్, స్ట్రాప్‌లెస్ గౌనులో జెన్నిఫర్ దేవకన్యలా మెరిసిపోగా, నేవీ బ్లూ సూట్‌లో విలియమ్ ఎంతో హుందాగా కనిపించారు. "చివరకు మా స్టార్స్ ఒకటయ్యాయి" అంటూ జెన్నిఫర్ అప్పట్లో షేర్ చేసిన వెడ్డింగ్ వీడియో, ఫొటోలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి.
విలియమ్ ఇష్మాయెల్ ఎవరు?
జెన్నిఫర్‌ను వివాహం చేసుకున్న విలియమ్ ఇష్మాయెల్ సింగపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్‌లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం 'MHC డిజిటల్ గ్రూప్'లో బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రముఖ యుబిఎస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌తో పాటు ఆర్థిక రంగానికి చెందిన పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
గతంలో జెన్నిఫర్ వింగెట్ ప్రముఖ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను 2012లో వివాహం చేసుకోగా, మనస్పర్థల కారణంగా 2014లో వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరణ్ సింగ్ గ్రోవర్ హీరోయిన్ బిపాసా బసును వివాహం చేసుకున్నారు. ఇప్పుడు జెన్నిఫర్ కూడా విలియమ్‌ను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగులో హిందీ సీరియల్
కాగా, హిందీలో సూపర్ హిట్ సీరియల్స్‌లో జెన్నిఫర్ వింగెట్ హీరోయిన్‌గా చేసి మెప్పించారు. బేపన్నా, బేయాద్, బేయాద్ 2, సరస్వతి చంద్ర, దిల్ మిల్ గయే వంటి సీరియల్స్ చేశారు. ఇందులో బేయాద్ సీరియల్‌ను తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ అనే టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సీరియల్ తెలుగులో పర్వాలేదనిపించుకుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


