నిర్మాతగా మారిన మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి- పవన్ మహావీర్ హీరోగా అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి- అతిథులు కామెంట్స్
Amma Naaku Aa Abbayi Kaavali Teaser Release Event: మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మాతగా మారిన తెలుగు సినిమా అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి. ఈ సినిమాతో పవన్ మహావీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అతిథులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Amma Naaku Aa Abbayi Kaavali Teaser Release Event: జీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మాతగా మారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథ సినిమా ఇది.

సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర
శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లుగా చేస్తున్నారు. సీనియర్ హీరో సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి టీజర్ రిలీజ్ ఈవెంట్
ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ (జూన్ 11) అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి టీజర్ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది.
వేడుకలో పాల్గొన్న అతిథులు
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ వేడుకలో పాల్గొన్నారు.
నిర్మాణ రంగంలోనూ అసాధారణ విజయం
"తొలి చిత్రంతోనే అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకున్న శైలజ రెడ్డి సినిమా నిర్మాణ రంగంలోనూ అసాధారణ విజయం సాధించడం ఖాయమని" అతిథులు ఆకాంక్షించారు. "హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్‌ను చూస్తుంటే... ఇది అతని తొలి సినిమాలా అనిపించలేదని, అతనిలో అంత ఈజ్ ఉందని" అన్నారు. "లండన్ లో మెడిసిన్ చదువుతున్న పవన్ మహావీర్ టాలీవుడ్‌కు దొరికిన మరో మంచి హీరో" అని కొనియాడారు.
నిర్మాత శైలజ రెడ్డి కృతజ్ఞతలు
"అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" చిత్రం అత్యద్భుతంగా రూపొందడంలో సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, టీజర్ విడుదలకు అతిథులుగా విచ్చేసిన చిత్ర ప్రముఖులకు నిర్మాత శైలజ రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఉజ్వల భవిష్యత్తు ఉందన్న దర్శకుడు
నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని దర్శకుడు శివాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్స్ వర్షిక, సుహానా, సుజాత, చైల్డ్ ఆర్టిస్ట్ సుప్రీతి సంతోషం వ్యక్తం చేశారు.
సాయి కార్తీక్ సంగీతం
ఇదిలా ఉంటే, అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించగా.. మహేందర్ ఎం సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఎడిటర్‌గా నందమూరి హరి బాధ్యతలు నిర్వహించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


