Prema Diarylo Chivari Pageelu: హృదయాలను హత్తుకునేలా 'ప్రేమ డైరీలో చివరి పేజీలు'- ఎమోషనల్‌గా మెప్పించే హీరో అర్జున్ నటన
Prema Diarylo Chivari Pageelu Shooting Completed: తెలుగులో ప్రేక్షకుల గుండెను మెలిపెట్టే బ్యూటిఫుల్ లవ్ జర్నీగా వస్తున్న సినిమా ప్రేమ డైరీలో చివరి పేజీలు. అర్జున్ యాదవ్ హీరోగా, అదితి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు హరికృష్ణ పామంజి దర్శకత్వం వహించారు. విడుదలకు రెడీ అయిన ఈ మూవీ విశేషాలపై లుక్కేద్దాం.
Prema Diarylo Chivari Pageelu Shooting Completed: ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ స్క్రీన్‌పైకి ఓ బ్యూటిఫుల్ మూవీ రానుంది. పి.వి. అర్జున్ యాదవ్ - అదితి జంటగా నటించిన సినిమా 'ప్రేమ డైరీలో చివరి పేజీలు'.

హరికృష్ణ పామంజి దర్శకత్వం
శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మాణంలో, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ప్రేమ డైరీలో చివరి పేజీలు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది.
ఆకట్టుకునే క్యాచీ లిరిక్స్
ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇప్పటికే విడుదలైన ప్రేమ డైరీలో చివరి పేజీలు చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ సంగీత ప్రియులను అలరిస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. పాటలకు వస్తున్న ఈ అద్భుతమైన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
హీరో క్యారెక్టరైజేషన్
ఈ ప్రేమ డైరీలో చివరి పేజీలు సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా గ్రాండ్‌గా పరిచయం అవుతున్నారు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, ఆయన నటన ప్రేక్షకులను ఎమోషనల్ జర్నీకి గురిచేస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఎమోషనల్ సీన్స్‌లో జీవించేసి
లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ కథలో అర్జున్ యాదవ్ తన నటనతో, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నాడట. మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో పరిణతి ఉన్న నటుడిగా, ఒక వైపు లవర్ బాయ్‌గా.. మరోవైపు ఎమోషనల్ సీన్స్‌లో జీవించేసి చిత్రానికి మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలిచాడని అంటున్నారు.
హీరోగా అర్జున్ యాదవ్‌కు బ్రేక్
ఈ ప్రేమ డైరీలో చివరి పేజీలు సినిమాతో టాలీవుడ్‌లో అర్జున్ యాదవ్ హీరోగా మంచి బ్రేక్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ యాదవ్ సరసన హీరోయిన్‌గా అదితి నటించగా, వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని సమాచారం.
మరిచిపోలేని జ్ఞాపకాల సముహారంగా
మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన ప్రేమ డైరీలో చివరి పేజీలు లిరికల్ సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సినిమా ప్రమోషన్స్‌కు భారీ మైలేజ్ తెచ్చిపెట్టాయి. ప్రేమ, భావోద్వేగాలు, మరిచిపోలేని జ్ఞాపకాల సమాహారంగా దర్శకుడు హరికృష్ణ పామంజి ఈ చిత్రాన్ని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు.
కూర్చొబెట్టే క్లైమాక్స్
ప్రతి ఒక్కరినీ క్లైమాక్స్ వరకు కదలకుండా కూర్చోబెట్టేలా ఈ 'ప్రేమ డైరీలో చివరి పేజీలు' సాగుతాయని చిత్రయూనిట్ చెబుతోంది. తేజ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా, రిచ్‌గా చూపించనుంది.
హృదయాలను హత్తుకునే అందమైన ప్రేమ
హృదయాలను హత్తుకునే ఓ అందమైన ప్రేమ ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'ప్రేమ డైరీలో చివరి పేజీలు' సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


