Cheating: ఒక్కసారి మోసం చేస్తే ఎప్పటికీ మోసగాడే- వాదించుకున్న ఇద్దరు హీరోయిన్లు సారా, రకుల్- లవర్‌ను గుర్తు చేసిన హీరో!
Sara Ali Khan Rakul Preet Singh Argument On Cheating: రిలేషన్‌షిప్‌లో మోసం అనే అంశంపై బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ వాదించుకున్నారు. మధ్యలో దూరిన హీరో ఆయుష్మాన్ సారా లవర్‌ను గుర్తు చేయడం వైరల్ అవుతోంది. ఒక్కసారి తప్పు చేసిన వారికి ఆ ముద్ర ఎప్పటికీ పోదని సారా చెప్పుకొచ్చింది.
Sara Ali Khan Rakul Preet Singh Argument On Cheating: ప్రేమ, పెళ్లి, బంధాలలో నమ్మకద్రోహం లేదా మోసం అనే అంశంపై ఎప్పుడూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల కాజోల్, ట్వింకిల్ ఖన్నా తమ టాక్ షోలో ఎమోషనల్ అండ్ ఫిజికల్ చీటింగ్‌పై మాట్లాడి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు ఇదే ప్రశ్న 'పతి పత్నీ ఔర్ వో దో' చిత్ర బృందానికి ఎదురవగా.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. "ఒక్కసారి మోసం చేసినాసరే వాడు.. ఎప్పటికీ మోసగాడే" అంటూ సారా అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెడ్ ఫ్లాగ్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ అవుతారా?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్, ఆమె తోటి నటీనటులు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంపై భిన్నంగా స్పందించారు. ఆయుష్మాన్ మాట్లాడుతూ.. మనుషులు మారతారని, ఎవరూ పుట్టడమే పర్‌ఫెక్ట్ గ్రీన్ ఫ్లాగ్‌లా పుట్టరని, రెడ్ ఫ్లాగ్ నుంచి గ్రీన్ ఫ్లాగ్‌గా మారే ప్రయాణం ఒకటుంటుందని వాదించారు. కానీ, దానిని సారా అలీఖాన్ అస్సలు అంగీకరించలేదు.
"ఒక్కసారి మోసం చేశాడంటే అతను మోసగాడే. ఒక వ్యక్తి తప్పు చేశాక ఆ ట్యాగ్ మారిపోదు. ఆ తర్వాత అతను మళ్లీ మోసం చేయకపోవచ్చు.. కానీ మోసగాడనే ముద్రను మాత్రం చెరుపుకోలేడు. ఆ తప్పు చేసిన తర్వాత 'నేను మళ్లీ చేయను' అని చెప్పుకునే అర్హతను కోల్పోతారు" అని సారా అలీ ఖాన్ గట్టిగా సమాధానమిచ్చారు.
అయితే, రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఆయుష్మాన్ వైపే నిలిచి, ఒకసారి తప్పు చేసిన వారు ప్రతిసారీ అలాగే తప్పు చేస్తారని లేదని చెప్పింది. కానీ, సారా మాత్రం తన పంతం వీడలేదు. అలా మోసంపై ఇద్దరు హీరోయిన్స్ సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ వాదించుకున్నారు.
సారా పాత లవ్ స్టోరీలను లాగిన ఆయుష్మాన్!
సారా అంత గట్టిగా వాదించడంతో ఆయుష్మాన్ ఖురానా ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ సరదాగా కామెంట్స్ చేశారు. "సారా ఆ విషయాన్ని అస్సలు వదిలేలా లేదు. ప్లీజ్.. అతడిని వదిలేయ్, మర్చిపో, క్షమించేయ్. అతను నిన్ను నిజంగా ప్రేమిస్తే మళ్లీ మోసం చేయడు" అంటూ ఆయుష్మాన్ నవ్వించేశారు.
గతంలో సారా అలీ ఖాన్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడిపినట్లుగా టాక్ వినిపించగా.. గతేడాది అర్జున్ ప్రతాప్ బజ్వాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయుష్మాన్ వ్యాఖ్యలు ఆ పాత బంధాల గురించేనంటూ నెటిజన్లు ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు సారా, రకుల్ వాదించుకోగా.. లవర్‌ను గుర్తు చేసి నవ్వించాడు హీరో ఆయుష్మాన్.
థియేటర్లలో 'పతి పత్ని ఔర్ వో దో'
ఈ నటీనటులు నటించిన 'పతి పత్ని ఔర్ వో దో' చిత్రం మే 15న థియేటర్లలో విడుదలైంది. అజీజ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వామికా గబ్బి కూడా కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ప్రస్తుతం మిశ్రమ స్పందన (Mixed Reviews) లభిస్తోంది.
ఇది 2019లో వచ్చిన 'పతి పత్నీ ఔర్ వో' (కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి పెడ్నేకర్) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. సినిమాలో భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థల చుట్టూ కథ తిరుగుతుండటంతో, ప్రమోషన్లలో కూడా రిలేషన్‌షిప్ అంశాలే హైలైట్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


