Child Artist: హీరోయిన్‌గా సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్‌తో క్రేజ్- ఇక్కడికి వచ్చింది అందుకేనంటూ!
Child Artist Mahima Makwana On OTT Series: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా ఎదిగిన మహిమా మక్వానా తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన సొంత గుర్తింపు కోసం పడుతున్న తపన, సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఆమె తాజాగా పంచుకుంది.
Child Artist Mahima Makwana On OTT Series: చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై అడుగుపెట్టి, ఇప్పుడు బాలీవుడ్ వెండితెరతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది నటి మహిమా మక్వానా. ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన 'ముసాఫిర్ కెఫె' (Musafir Cafe) వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఈ సందర్భంలో సినీ పరిశ్రమలోని అనిశ్చితి, తను ఎంచుకుంటున్న పాత్రల గురించి పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది మహిమా మక్వానా.
'బాలికా వధు' నుంచి సల్మాన్ ఖాన్ సినిమా వరకు
దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') వంటి సీరియల్స్‌తో చిన్నతనంలోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది మహిమ. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నిర్మించిన 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమానే తన కెరీర్‌కు మలుపు తిప్పిందని ఆమె పేర్కొంది.
"సల్మాన్ సర్, మహేష్ మంజ్రేకర్ సర్ నన్ను నమ్మి ఇచ్చిన అవకాశం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ద తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరడమే కాకుండా పరిశ్రమలో మరిన్ని అవకాశాలు రావడానికి 'అంతిమ్' దారులు పరిచింది" అని మహిమ మక్వానా వెల్లడించింది.
అనిశ్చితికి సమాధానం సహనం..
సినిమా పరిశ్రమలో ఏదీ మన చేతుల్లో ఉండదని, ఇక్కడ ఓర్పు, పట్టుదల చాలా అవసరమని, సినిమా రంగం పాఠాలు నేర్పించిందని మహిమా వ్యాఖ్యానించింది. మనకు వచ్చే అవకాశాల నుంచి ఎలాంటి పాత్రలను ఎంచుకుంటున్నామనేదే మన చేతుల్లో ఉండే ఏకైక విషయమని తెలిపింది.
"నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, నాకంటూ ఒక సొంత అభిమాన గణాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా ప్రయాణాన్ని నా సొంత మార్గంలోనే మలుచుకుంటున్నాను. నా వల్ల అయిందంటే ఎవరి వల్ల అయినా అవుతుంది" అని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
'ముసాఫిర్ కెఫె' లో ప్రేమ లోతులు
దివ్య ప్రకాష్ దూబే రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా 'ముసాఫిర్ కెఫె' ఓటీటీ సిరీస్‌ను దర్శకుడు రుచిర్ అరుణ్ తెరకెక్కించారు. ఇందులో ప్రీతి అనే సంక్లిష్టమైన పాత్రలో మహిమ కనిపించింది. విక్రాంత్ మాస్సీ, వేదిక పింటో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రస్తుత రోజుల్లో ప్రేమ కథలు రావడం తగ్గిపోయాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగానే వెంటనే ఒప్పుకున్నానని తెలిపింది మహిమ. ఈ సిరీస్‌లో విక్రాంత్ మాస్సీతో కలసి పనిచేయడంపై స్పందిస్తూ.. 'బాలికా వధు' రోజుల్లోనే అతన్ని మొదటిసారి చూశానని, టీవీ రంగానికి చెందిన ఒక నటుడు ఈ రోజు స్టార్‌గా ఎదగడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది.
భవిష్యత్తు ప్రాజెక్టులు
ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న మహిమా మక్వానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టైగర్ ష్రాఫ్ తో కలసి ఒక యాక్షన్ సినిమాలో నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనూ ఒక ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది. ఇంతియాజ్ అలీ, రాజ్ అండ్ డీకే వంటి ప్రముఖ దర్శకులతో పనిచేయడమే తన తదుపరి లక్ష్యమని మహిమా మక్వానా స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


