...
...
Next Story

Brahmamudi August 8 Episode: బ్రహ్మముడి.. తల్లిగా లక్కీ పెళ్లి చేయనున్న రేఖ.. నందును ఓదార్చిన ఇందు.. శశితో ఐషూ పెళ్లి!

Brahmamudi Serial August 8 Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 8 ఎపిసోడ్ లో పెళ్లి చూపుల్లోనే మరోసారి రేఖను ఇరికిస్తాడు రాజు. ఐశ్వర్యతోనే పెళ్లి అనుకొని ఎక్స్‌ట్రాలు చేయబోయిన లక్కీని ఆమె గట్టిగా కొడుతుంది. మరోవైపు వెంకీ ప్రేమ కోసం ఏడుస్తున్న నందుని ఇందు ఓదారుస్తుంది.

Published on: Aug 8, 2026, 07:44:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లోనూ లక్కీ పెళ్లి చూపుల తంతే సాగింది. లక్కీ తల్లి గురించి రాజు చెప్పకుండా ఎపిసోడ్లు ఎపిసోడ్ల పాటు సాగదీస్తూనే ఉండటం ఆడియెన్స్ కు విసుగు తెప్పిస్తోందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ లోనూ రేఖను రాజు ఇరికించడం తప్ప కొత్తగా జరిగిందేమీ లేదు.

ఐశ్వర్య దగ్గరికెళ్లి సిగ్గు పడిన లక్కీ.. శశి గురించి అనుకున్న ఐషూ

Brahmamudi August 8 Episode: బ్రహ్మముడి.. తల్లిగా లక్కీ పెళ్లి చేయనున్న రేఖ.. నందును ఓదార్చిన ఇందు.. శశితో ఐషూ పెళ్లి!
Brahmamudi August 8 Episode: బ్రహ్మముడి.. తల్లిగా లక్కీ పెళ్లి చేయనున్న రేఖ.. నందును ఓదార్చిన ఇందు.. శశితో ఐషూ పెళ్లి!

తనకు పెళ్లి చూపులు అని తెలిసి ఐశ్వర్య దగ్గరికి వెళ్లి లక్కీ సిగ్గు పడే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 8) ఎపిసోడ్ మొదలైంది. అతన్ని చూసి ఐషూ షాక్ తింటుంది. వీడేంటి ఇలా చేస్తున్నాడని అనుకుంటుంది. ప్రేమ, పెళ్లి అని లక్కీ మాట్లాడటంతో తాను శశిగాడిని పెళ్లి చేసుకోవడం గురించి అని ఐశ్వర్య అనుకుంటుంది.

ఆ పెళ్లి ప్రేమతో కాదు ఆస్తి కోసం చేసుకుంటున్నానని లోలోపల అనుకుంటుంది. కానీ ఐశ్వర్యతోనే తన పెళ్లి చూపులు అని ఫిక్సయిపోయిన లక్కీ.. ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. అతని వింత ప్రవర్తన చూసిన ఐషూ.. తాను శశిని పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి పిచ్చోడైనట్లున్నాడని అనుకుంటుంది.

నందును ఓదార్చిన ఇందు

మరోవైపు వెంకీ కోసం బాధపడుతూ కూర్చొన్న నందును ఇందు చూస్తుంది. ఆమె కంటతడి పెట్టడంతో ఏమైందని అడుగుతుంది. నందు జరిగిన విషయం చెబుతుంది. వెంకీ తనను కావాలనే దూరం పెడుతున్నాడని, నోటికొచ్చినట్లు మాట్లాడాడని చెప్పి బాధపడుతుంది. వెంకీ అంటే తనకు చాలా ఇష్టమని, అతనికి కూడా తానంటే ఇష్టమే అయినా కావాలనే అలా మాట్లాడుతున్నాడని నందు అంటుంది.

ఇటు లక్కీ ఉదయాన్నే పెళ్లి చూపులకు కాకుండా ఏకంగా పెళ్లి కొడుకులానే తయారవుతాడు. ఐశ్వర్య అప్పుడే నిద్ర లేవడం చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలానే ఉన్నావేంటి.. నేను ఉదయం 4 గంటలకు లేచి రెడీ అయ్యాను.. నువ్వు రెడీ కాకపోతే ఎలా అని అంటాడు.

ఇవాళ మన పెళ్లి చూపులు కదా అని లక్కీ అనడంతో ఐశ్వర్య షాక్ తింటుంది. నీతో నాకు పెళ్లా అని అంటుంది. త్వరగా వెళ్లి రెడీ అవ్వు అని ఐషూతో లక్కీ అంటాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చి లక్కీని కొట్టి వెళ్లిపోతుంది. దీంతో లక్కీ షాక్ లో ఉండిపోతాడు.

తల్లెవరో తెలిసిన తర్వాతే పెళ్లన్న లక్కీ

ఇదంతా మరోవైపు నుంచి చూసిన రాజు, ఇందు వచ్చి లక్కీ తొందరపాటుకు తిడతారు. పెళ్లి చూపులనీ చెప్పాం కానీ.. ఐశ్వర్యతో అన్నామా అని రాజు అంటాడు.

ఇందు కూడా లక్కీని తిట్టి మరీ ఇంత ఓవర్ గా ఎందుకు తయారయ్యావ్.. వెళ్లి ఏవైనా మామూలు బట్టలు వేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది. తనకు పెళ్లి చూపులు, పెళ్లి వద్దని.. తన తల్లెవరో తెలిసిన తర్వాతే చేసుకుంటానని లక్కీ మొండికేస్తాడు.

కానీ రాజు మాత్రం ఈ పెళ్లి చూపులైతేనే నీ తల్లెవరో తెలుస్తుందని అంటాడు. దానికి దీనికి లింకేంటని లక్కీ అడిగినా.. నీకు మీ అమ్మ ఎవరో తెలియాలా వద్దా అంటూ మరోసారి సెంటిమెంట్ డైలాగ్ కొట్టి అతన్ని పంపిస్తాడు.

పెళ్లి చూపులకు డ్రామా ఆర్టిస్టులను రెడీ చేసిన రాజు

ఇటు పెళ్లి చూపుల కోసం రాజు, ఇందు కొందరు డ్రామా ఆర్టిస్టులను సెట్ చేస్తారు. వాళ్లు ఇంటికి వస్తారు. పెళ్లి కూతురికి ముసుగేసి తీసుకొస్తారు. ఆమెను ఎందుకిలా తీసుకొచ్చారని రాజు అడిగితే.. మీరు ఇచ్చిన పేమెంట్ కు ముసుగు ఎప్పుడు తీయాలో మేమే నిర్ణయిస్తామని వాళ్లు అంటారు. వాళ్ల ఓవరాక్షన్ చూసి రాజుకు చిర్రెత్తుకొస్తుంది. కానీ తప్పక వాళ్లను లోనికి తీసుకెళ్తాడు.

దుగ్గిరాల ఇంట్లో పెళ్లి చూపుల డ్రామా

దీంతో దుగ్గిరాల ఇంట్లో ఉత్తిత్తి పెళ్లి చూపుల డ్రామా మొదలవుతుంది. లక్కీకి పెళ్లి చూపులని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ దిక్కూదివాణం లేని వాడికి ఇక్కడ పెళ్లి చూపులేంటని బ్రమరాంభ చిరాకు పడితే.. రాజు ఆమెను సముదాయిస్తాడు. వాడికి మనం తప్ప ఎవరూ లేరు కదా అని రేఖను చూస్తూ అంటాడు.

ఇంట్లో వాళ్లందరినీ రాజు పరిచయం చేస్తాడు. అందరూ కూర్చొని ఉండగా లక్కీ వస్తాడు. అబ్బాయి ఇతనే అని రాజు వాళ్లకు చెబుతాడు. వాళ్లు లక్కీ పుట్టుపూర్వోత్తరాల గురించి అడుగుతారు. అతనికి తల్లిదండ్రులు లేరన్న విషయం తమకు ఎందుకు చెప్పలేదని వచ్చిన వాళ్లు నిలదీస్తారు.

మేమందరం ఉన్నాం కదా అని రాజు అంటాడు. రేఖ పిన్న వాడి తల్లి స్థానంలో కూర్చొంటుంది. తల్లి స్థానంలో ఏంటి రేఖ పిన్నే వాడి తల్లి కదా అని మరోసారి అందరి ముందు రేఖను రాజు ఇరికిస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks