బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నడుము అందాలతో రాహుల్‌ను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకొస్తుంది స్వప్న. ఇవాళ పెళ్లి రోజు కూడా కాదే అని స్వప్నను హగ్ చేసుకుని చెబుతాడు రాహుల్. మొగుడి కోసం రెడీ అవ్వడానికి కూడా అకేషన్ ఉండాల అని స్వప్న అంటుంది.
పబ్లిసిటీ చేయించాలి

ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. స్వప్నకు రాహుల్ ముద్దు పెట్టబోయి ఆగిపోతాడు. కాస్తా టెన్షన్‌గా ఉంది. డిజైన్స్ మ్యాన్యుఫాక్చర్ చేయించాం కానీ పబ్లిసిటీ చేయించాలి. రాజ్ లాగా కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీలను పెట్టలేను. ఏదైనా ఐడియా చెప్పమని చెప్పిన రాహుల్ కాసేపటికి నువ్వే మోడల్‌లా జ్యూవెలరీ యాడ్ చేయొచ్చుగా. నీకు ఎలాగు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందిగా అంటాడు.
ముందు వద్దని చెప్పిన స్వప్న తర్వాత ఒప్పుకుంటుంది. దాంతో రాహుల్ స్వప్నను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతాడు. ఇక ఆ డిజైన్స్ నావే అని నువ్ అఫిషియల్‌గా ఒప్పుకున్నట్లే. నేను గెలిచినట్లే అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు రెస్టారెంట్‌లో రాజ్ కావ్య సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్లు కారు దగ్గరికి రాగానే ముక్కుకు మత్తుమందు పెట్టి కిడ్నాప్ చేద్దామని మోటు చెప్పి రెడీగా ఉంటాడు.
ఇంతలో రాజ్ వాళ్ల దగ్గరికి తెలిసిన ఎస్సై వస్తాడు. వచ్చి మాట్లాడుతాడు. రాజ్ గదిలో క్లీన్ చేసిన వ్యక్తి ఆ పెన్‌డ్రైవ్ ఇవ్వడం మర్చిపోయాననుకుని వెయిటర్‌కు ఇచ్చి పంపిస్తాడు. అతను ఎస్సైకి పెన్‌డ్రైవ్ ఇచ్చి మీ రూమ్‌లో దొరికిందని చెబుతాడు. ఆ పెన్‌డ్రైవ్ తీసుకున్న ఎస్సై రూమా.. అంటే రాజ్ వాళ్ల గదిలో దొరికిందా. రాజ్ ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్తాడు.
రాజ్, కావ్య కిడ్నాప్
ఇంతలో రాజ్, కావ్యను చోటు మోటు కిడ్నాప్ చేస్తారు. అది చూసిన ఎస్సై ఫాలో అవుతు అరుస్తాడు. పోలీసులు వస్తున్నారంటూ త్వరగా వెళ్లిపోతారు చోటు మోటు. రాజ్, కావ్యలను ఈ సిటీలో పేరు మోసిన గూండా మురుగన్ మనుషులు కిడ్నాప్ చేశారు. నాకు వెంటనే ల్యాప్‌టాప్ కావాలని కానిస్టేబుల్స్‌కి ఎస్సై చెబుతాడు. మరోవైపు స్వప్నతో జ్యూవెలరీ మోడలింగ్ చేయిస్తాడు రాహుల్.
{{/usCountry}}ఇంతలో రాజ్, కావ్యను చోటు మోటు కిడ్నాప్ చేస్తారు. అది చూసిన ఎస్సై ఫాలో అవుతు అరుస్తాడు. పోలీసులు వస్తున్నారంటూ త్వరగా వెళ్లిపోతారు చోటు మోటు. రాజ్, కావ్యలను ఈ సిటీలో పేరు మోసిన గూండా మురుగన్ మనుషులు కిడ్నాప్ చేశారు. నాకు వెంటనే ల్యాప్‌టాప్ కావాలని కానిస్టేబుల్స్‌కి ఎస్సై చెబుతాడు. మరోవైపు స్వప్నతో జ్యూవెలరీ మోడలింగ్ చేయిస్తాడు రాహుల్.
{{/usCountry}}నీకు తెలియకుండానే రాజ్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి నాకు చేతిలో సమిధలా మారుతున్నావ్ అని రాహుల్ అనుకుంటాడు. ఫొటోలు బాగా వచ్చాయని కెమెరా మ్యాన్ చెబుతాడు. తర్వాత ఇంట్లోవాళ్లు ఏమనుకుంటారో అని స్వప్న అంటుంది. రాహుల్ సర్దిచెబుతాడు. మరోవైపు రాజ్, కావ్యలను తాళ్లతో కట్టేస్తారు చోటు మోటు. స్పృహలోకి వచ్చిన రాజ్ మమ్మల్ని ఎందుకురా కిడ్నాప్ చేశారంటాడు.
మేము అడిగినట్లు పెన్‌డ్రైవ్ ఇస్తే అయిపోయేదిగా అని మోటు అంటాడు. మాకు ఏ పెన్‌డ్రైవ్ తెలీదురా. మా వైఫ్‌కు ట్రీట్‌మెంట్ ఇప్పించాలిరా. వదిలేయండిరా అని రాజ్ అంటాడు. మీకు గంట టైమ్ ఇస్తున్నాం మా బాస్ వచ్చేలోపు చెప్పండి. లేకుంటే చస్తారు అని చోటు మోటు వెళ్లిపోతారు. ఇవాళే చివరి ట్రీట్‌మెంట్ ఎలాగైనా వెళ్లాలని రాజ్, కావ్య అనుకుంటారు.
రాహుల్‌తో రాజ్ క్లయింట్స్ అగ్రిమెంట్
మరోవైపు రాజ్ క్లయింట్స్‌తో రాహుల్ మాట్లాడుతాడు. రాజ్ ప్రాఫిట్స్ 20 శాతం తగ్గిపోయాయి. అడుగు దూరంలో మొదటి ప్లేస్ మిస్ అయిపోయింది. వాళ్ల డిజైన్స్ అవుట్ డేటెడ్ అయ్యాయి. మీరు నన్ను ఎందుకు నమ్మాలో చెబుతాను అని తన డిజైన్స్ చూపిస్తాడు రాహుల్. మీ డిజైన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్లతో పాతికేళ్లుగా చేస్తున్నాం అని అంటారు.
గెలుపు గుర్రంపైనే పందెం కట్టాలి. ఇప్పుడు వద్దనుకుంటే మళ్లీ రావాల్సిన అవసరం లేదు అని రాహుల్ అంటాడు. నాకు ఓకే అని రాజ్ క్లయింట్స్ అంతా చెబుతారు. వాళ్లందరితో రాహుల్ అగ్రిమెంట్ చేయించుకుంటాడు రాహుల్. మరోవైపు రేణుకతో అప్పు మాట్లాడుతుంది. మీ కూతురు బతికే ఉందని క్లూ దొరికిందని చెబుతుంది. దాంతో రేణుక సంతోషిస్తుంది.
మీకు మీ భర్తకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అప్పు అడుగుతుంది. ఆయన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. నన్ను, మా పాపను బాగా చూసుకునేవారు అని రేణుక చెబుతుంది. ఇంతలో అక్కడికి రేణుక భర్త వస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.