బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి రేణుక వెళ్తుంటే తన భర్త వస్తాడు. రేణుక భర్తతో మీ పాప బతికే ఉందని అప్పు చెబుతుంది. దాంతో రేణుక భర్త షాక్ అవుతాడు. మీరేంటీ షాక్ అవుతున్నారు. బతికే ఉందంటే ఒక చిన్న క్లూ దొరికింది. మీ ఆవిడ సూసైడ్ చేసుకుంటే మీరేంటీ తాపిగా వచ్చారు అని అప్పు అంటుంది.
పాప బాడీ రీ పోస్ట్‌మార్టమ్

దానికి మరింత కంగారుపడిపోతాడు రేణుక భర్త. పాప బాడీని రీ పోస్ట్‌మార్టమ్ చేయిస్తున్నామని, డీఎన్ఏ టెస్ట్‌లో కూడా ఎర్రర్ ఉండొచ్చని, అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయని అప్పు అంటుంది. దానికి కంగారుపడిన రేణుక భర్త అశోక్ అలా అయితే మంచిదేగా, వెళ్లొస్తాను అని వెళ్లిపోతాడు. అశోక్ డౌట్‌గా వెళ్లిపోతాడు.
మరోవైపు ఎలాగైనా తప్పించుకోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. రాజ్ వెనుక ఉన్న బీర్ సీసా తీసుకుని పగులగొట్టి తాళ్లు కోస్తాడు. ఇంతలో రౌడీలు వచ్చి పెన్‌డ్రైవ్ ఎక్కడ అని అడుగుతారు. ప్యాంట్ పాకెట్‌లో ఉందని, దగ్గరికి రమ్మని చెప్పిన రాజ్ రౌడీలను కొడతాడు. కట్లు విప్పేసుకున్న రాజ్ రౌడీలను చితకబాదుతాడు. కావ్య కట్లు విప్పుతాడు.
రాజ్, కావ్య పారిపోతుంటే గన్ పట్టుకుని రౌడీ గ్యాంగ్ బాస్ మురుగన్ ఎంట్రీ ఇస్తాడు. పెన్‌డ్రైవ్ గురించి అడిగితే మా దగ్గర ఏం లేదు, మా భార్యకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలి, చనిపోయిన వాడికి మాకు సంబంధం లేదు అని రాజ్ చెబుతాడు. కానీ, మురుగన్ వినడు. కాల్చి చంపేస్తానంటాడు. చంపేయమని చోటు, మోటు అంటారు. ఇంతలో ఎస్సై వచ్చి మురుగన్‌కు గన్ పెడతాడు.
రాజ్, కావ్యను కాపాడిన ఎస్సై
పెన్‌డ్రైవ్ ఇచ్చేస్తే మేము వెళ్లిపోతామని మురుగన్ అంటే.. ఎందుకు మేమే తీసుకెళ్లి చిప్పకూడు తినిపిస్తాం. నీ బాగోతం వైరల్ అవుతోంది అని ఎస్సై అంటాడు. రాజ్ మీరు వెళ్లండి, వీళ్లను కేరళ పోలీసులకు అప్పగించి మేము హైదరాబాద్ వస్తామని ఎస్సై అంటాడు. దాంతో రాజ్, కావ్య వెళ్లిపోతారు. మరోవైపు సుభాష్‌కు కాల్ చేసిన శ్రుతి జూబ్లీహిల్స్ క్లయింట్స్ అంతా మనతో బిజినెస్ క్యాన్సిల్ చేసుకున్నారని చెబుతాడు.
{{/usCountry}}పెన్‌డ్రైవ్ ఇచ్చేస్తే మేము వెళ్లిపోతామని మురుగన్ అంటే.. ఎందుకు మేమే తీసుకెళ్లి చిప్పకూడు తినిపిస్తాం. నీ బాగోతం వైరల్ అవుతోంది అని ఎస్సై అంటాడు. రాజ్ మీరు వెళ్లండి, వీళ్లను కేరళ పోలీసులకు అప్పగించి మేము హైదరాబాద్ వస్తామని ఎస్సై అంటాడు. దాంతో రాజ్, కావ్య వెళ్లిపోతారు. మరోవైపు సుభాష్‌కు కాల్ చేసిన శ్రుతి జూబ్లీహిల్స్ క్లయింట్స్ అంతా మనతో బిజినెస్ క్యాన్సిల్ చేసుకున్నారని చెబుతాడు.
{{/usCountry}}రాహుల్ మన క్లయింట్స్‌తో మాట్లాడి తనతో బిజినెస్ డీల్ చేసుకున్నారు. అంతేకాకుండా కావ్య వేసిన డిజైన్స్‌నే తన డిజైన్స్‌గా చూపించి అగ్రిమెంట్ చేయించుకున్నారు అని శ్రుతి చెబుతుంది. రాహుల్ అంత వెన్నుపోటు పొడుస్తాడని నేను అనుకోవట్లేదు. వాడికి అంత ధైర్యం లేదని సుభాష్ అంటాడు. మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎక్కువగా చెప్పట్లేదు. కావ్య మేడమ్ డిజైన్స్, రాహుల్ చూపించిన డిజైన్స్ మీకు పంపిస్తానని కాల్ కట్ చేస్తుంది శ్రుతి.
ఆ డిజైన్స్ చూసి సుభాష్ షాక్ అవుతాడు. రాహుల్ తప్పు చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. వీడిని అస్సలు విడిచిపెట్టకూడదు అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు కావ్యకు గురూజీ ట్రీట్‌మెంట్ చేస్తాడు. గురూజీ అయోమయంగా చూస్తాడు. మరోవైపు రాహుల్ తన డిజైన్స్‌ను, స్వప్న మోడలింగ్‌ను ఇంట్లోవాళ్లకు చూపిస్తాడు. అది చూసి అంతా మెచ్చుకుంటారు.
రాహుల్‌ను కొట్టిన సుభాష్
ఇంతలో సుభాష్ వచ్చి రాహుల్‌ను కొడతాడు. కోపంగా ఉంటాడు. నమ్మకద్రోహం చేశాడు. కావ్య వేసిన డిజైన్స్‌ను నీ డిజైన్స్ అని చూపించుకోడానికి సిగ్గులేదు అని రెండింటిని చూపిస్తాడు సుభాష్. కావ్య వేసిన డిజైన్స్ గురించి నాకు తెలియదు. నేను కష్టపడి వేయించాను అని రాహుల్ అంటే.. నిజమే అంకుల్. నేనే దగ్గరుండి చూశాను అని స్వప్న అంటుంది.
కావ్యకు వచ్చిన ఆలోచన రాహుల్ డిజైనర్‌కు వచ్చిందేమో అని రుద్రాణి అంటుంది. మమ్మీ ఆపు మావయ్య ఎక్కడో పొరపాటు పడి కంపెనీ పరువు పోతుందని చేయి చేసుకున్నారు. తండ్రి స్థానంలో ఉండి ఓ దెబ్బ కొట్టారనుకుంటాను. రెండు డిజైన్స్ ఒకేలా ఎలా ఉన్నాయో తెలియట్లేదు. నేను కష్టపడి వేయించాను. మీరు ఏ శిక్ష వేసిన అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వెళ్లిపోతాడు రాహుల్.
ఏం పర్ఫామెన్స్‌రా. అంతా నమ్మేశారు. ఇక నీకు తిరుగులేదు అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు కావ్యకు చేసిన వారం రోజుల చికిత్సకు 99 శాతం ఫలితం వచ్చినట్లే అని గురూజీ చెబుతాడు. దాంతో రాజ్ సంతోషిస్తాడు.
బయటపడిన కావ్య సమస్య
మరోవైపు కావ్య సమస్య గురించి ఇంట్లో బయటపడుతుంది. ఇంటికొచ్చిన రాహుల్, కావ్యను అపర్ణ వాళ్లు నిలదీస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.