బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫేక్ డైరెక్టర్ మణి వర్మ యాడ్ షూట్ చేస్తూ హడావిడి చేస్తాడు. ఇంతలో కిచెన్‌లో నుంచి వాసన రావడంతో ఎవరో ఇక్కడ పరాటలు చెడగొడుతున్నారని కిచెన్‌లోకి వెళ్లిపోతాడు మణి వర్మ. పరాటలు ఎవరైనా ఇలా చేస్తారా, పిండి ఇలా కలుపుతారా అని పని మనిషిపై అరిచి తానే పరాటాలు చేస్తాడు.
పరాట మాస్టర్

ఇంతలో రాజ్ వచ్చి డైరెక్టర్ గురించి అడిగితే.. కిచెన్‌లో ఉన్నాడని చూపిస్తారు. మణి వర్మ పరాటలు చేస్తూ కనిపిస్తాడు. ఇంతకీ అతను డైరెక్టరేనా అని కావ్య అడిగితే.. కాదు పరాట మాస్టర్ అని ప్రకాశం అంటాడు. ఇప్పుడు నిరూపిస్తానని కిచెన్‌లోకి పరాట రేట్ అడుగుతాడు. మణి వర్మ చెబుతాడు. దాంతో మణి వర్మను లాక్కొచ్చి నేను చెప్పాను కదా అంటాడు ప్రకాశం.
మరి డైరెక్టర్‌గా ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఎవరు పంపించారని నిలదీస్తాడు రాజ్. రాహుల్ చెప్పొద్దని సైగ చేస్తాడు. మీ కో ఆర్డినేటర్ డైరెక్టర్ కోసం వెతుకుతుంటే డబ్బుకు కక్కుర్తి పడి ఆయనను నమ్మించి వచ్చాను. నన్ను క్షమించండి అని పారిపోతాడు మణి వర్మ. అంత అయిపోయింది. మిగిలిన ఒక్కరోజు కూడా పోయిందని బాధగా రాజ్ బయటకు వెళ్లిపోతాడు.
కావ్య వెళ్లి మాట్లాడుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అని రాజ్ అంటే మీ ఆలోచనల్లోనే తప్పుందని కావ్య అంటుంది. మీరే డైరెక్టర్ అవ్వొచ్చుగా అని కావ్య అంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ లేని నేను ఎలా తీయను అని రాజ్ అంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌ను పిలిచి అతను మీకు సహాయం చేస్తాడని కావ్య అంటాడు. నేను కొన్ని యాడ్ షూట్‌కు పనిచేశాను. మనసు పెట్టి చేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి అని అతను అంటాడు.
డైరెక్టర్‌గా రాజ్ యాడ్ షూట్
దానికి రాజ్ ఒప్పుకుంటాడు. ఇంట్లోకి ఈ యాడ్‌ను మా ఆయన షూట్ చేయబోతున్నాడని రాజ్ అంటాడు. అందరికి అక్కడ కాన్సెప్ట్ చెబుతాడు రాజ్. రాజ్ డైరెక్టర్ అయి ఇదంతా చేస్తాడా అని రుద్రాణి అంటే.. ఇది అంత ఈజీ కాదని రాహుల్ అంటాడు. తర్వాత యాడ్ షూట్లో రాజ్ కూడా ఉండాలని అంతా పట్టుబడితే ఒప్పుకుంటాడు. రాజ్ డైరెక్టర్‌గా మారి యాడ్ షూట్ పూర్తి చేస్తాడు.
{{/usCountry}}దానికి రాజ్ ఒప్పుకుంటాడు. ఇంట్లోకి ఈ యాడ్‌ను మా ఆయన షూట్ చేయబోతున్నాడని రాజ్ అంటాడు. అందరికి అక్కడ కాన్సెప్ట్ చెబుతాడు రాజ్. రాజ్ డైరెక్టర్ అయి ఇదంతా చేస్తాడా అని రుద్రాణి అంటే.. ఇది అంత ఈజీ కాదని రాహుల్ అంటాడు. తర్వాత యాడ్ షూట్లో రాజ్ కూడా ఉండాలని అంతా పట్టుబడితే ఒప్పుకుంటాడు. రాజ్ డైరెక్టర్‌గా మారి యాడ్ షూట్ పూర్తి చేస్తాడు.
{{/usCountry}}తర్వాత రాజ్ యాడ్ షూట్ పూర్తి చేశాడని రుద్రాణి టెన్షన్ పడుతుంది. రాజ్ చేసిన యాడ్ ఫెయిల్ అవుతుంది మమ్మీ. అది పూర్తి కాలేక తల బాదుకుంటాడు. ఇంతలో నా డిజైన్స్ మార్కెట్‌లో పెట్టేస్తాను. లాభాలు నాకు నష్టాలు రాజ్‌కు. అదంతా చూసిన తాతయ్య రాహుల్ స్వరాజ్ కంపెనీని కూడా నువ్వే చూసుకోవాలంటాడు అని రాహుల్ అంటాడు.
మరోవైపు షూట్ ఎలా వచ్చిందో అని రాజ్ టెన్షన్ పడుతుంటాడు. కావ్య వచ్చి సర్ది చెబుతుంది. మోటివేషన్ డైలాగ్స్ చెబుతుంది. యాడ్ సక్సెస్ అవుతుందని చెబుతుంది. మరుసటి రోజు ఉదయం ఒకావిడను ఇద్దరు రౌడీలు తరుముతుంటారు. అక్కడే ఉన్న అప్పు దగ్గరకు వెళ్తుంది. అప్పును చూసి రౌడీలు పారిపోతారు. ఆమె ద్వారా రేణుక పాప అంజలిని పట్టుకుంటుంది అప్పు.
అప్పుకు అత్త శిక్ష
మరోవైపు ఇంట్లో రాజ్ చేసి యాడ్ చాలా బాగా వచ్చిందని అంతా మెచ్చుకుంటారు. రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. ఇంతలో తన పాపను కాపాడింది అప్పు మేడమ్ అని మీడియా వాళ్లతో రేణుక చెప్పేది ఇంట్లోవాళ్లంతా చూస్తారు. అప్పు చేసిన తప్పుకు ధాన్యలక్ష్మీ శిక్ష వేస్తుంది. ఇక జీవితంలో పోలీస్‌గా అప్పు చేయకూడదని కండిషన్ పెడుతుంది ధాన్యం. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.