బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, కావ్య రేవతి ఇంట్లో ఉండటంపై నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. కల్యాణ్, అప్పును కిడ్నాప్ చేసిందని అపర్ణతో గొడవ పడుతుంది. నానా మాటలు అంటుంది. దాంతో తను నీ అక్క, చూసి మాట్లాడమని సుభాష్ ఫైర్ అవుతాడు.
అన్నయ్యపై ప్రకాశం రివర్స్

పిల్లలు దూరమైన బాధలో ఉంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి. నోరు తెరవడం పాపమంటే ఎలా. పెద్దవాడివి నువ్వేందుకు ధాన్యంపై అరుస్తున్నావ్ అని సుభాష్‌పై రివర్స్ అవుతాడు ప్రకాశం. పిల్లలు మనసు తెలుసుకుని మాట్లాడమంటున్నాను. ఇంటికి మూల స్తంభాలైన రాజ్, కావ్య గురించి తెలిసి అనడం గురించి అంటున్నాను అని సుభాష్ కౌంటర్ ఇస్తాడు.
మరోవైపు రుద్రాణి, రాహుల్, రేఖ మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. తాము అనుకుంది జరిగిందని సంతోషిస్తారు. నేను ఆ మినిస్టర్‌ను అడ్డు పెట్టుకుని ఇంట్లోంకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా. దానికి మీరు ఇంట్లో అందరిని మీవైపు తిప్పుకోండని ఓ ప్లాన్ చెబుతుంది రుద్రాణి. ఇక నువ్వే చూస్తావుగా అని రాహుల్, రేఖ అంటారు.
మరోవైపు స్వప్న కూతురుకు జ్వరం తగ్గకపోవడంతో కంగారుపడుతుంది. డాక్టర్ కాల్ చేసి చెప్పడంతో వెంటనే హాస్పిటల్‌కు రమ్మంటుంది. దాంతో రాహుల్‌కు కాల్ చేసి అదే విషయం చెబుతుంది స్వప్న. ఆఫీస్‌లో అర్జంట్ మీటింగ్ ఉంది, వెంటనే రాలేను, ఇంట్లో ఎవరినైనా తోడు తీసుకెళ్లి నేను వర్క్ ఫినిష్ చేసుకుని వస్తానని రాహుల్ అంటాడు. సరేనని స్వప్న అంటుంది.
నాలుగు రోజుల్లో
నాలుగు రోజులు ఆగు. మన ప్లాన్ సక్సెస్ అయితే ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు, తల వంచాల్సిన అవసరం లేదని రుద్రాణి అంటుంది. మరోవైపు కిడ్నాప్ అయినట్లు వీడియో వచ్చిన ఫోన్ నెంబర్‌ను ఎస్సైకి పంపిస్తాడు రాజ్. మరోవైపు కావ్యకు కాల్ చేసి పాప ఫీవర్ గురించి చెబుతుంది. దాంతో కావ్య వెళ్తానంటుంది. అదే విషయం రాజ్‌కు చెబుతుంది.
{{/usCountry}}నాలుగు రోజులు ఆగు. మన ప్లాన్ సక్సెస్ అయితే ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు, తల వంచాల్సిన అవసరం లేదని రుద్రాణి అంటుంది. మరోవైపు కిడ్నాప్ అయినట్లు వీడియో వచ్చిన ఫోన్ నెంబర్‌ను ఎస్సైకి పంపిస్తాడు రాజ్. మరోవైపు కావ్యకు కాల్ చేసి పాప ఫీవర్ గురించి చెబుతుంది. దాంతో కావ్య వెళ్తానంటుంది. అదే విషయం రాజ్‌కు చెబుతుంది.
{{/usCountry}}రాజ్, కావ్య హాస్పిటల్‌కు వెళ్తామనుకుంటారు. స్వప్న హాస్పిటల్‌కు బయలుదేరుతుంటే సుభాష్ ఎదురై తాను వస్తానంటాడు. ఇద్దరు హాస్పిటల్‌కు వెళ్తారు. రాజ్, కావ్య కూడా వస్తారు. టెస్ట్‌లు చేయాలని డాక్టర్ పాపను తీసుకెళ్తుంది. స్వప్న చాలా కంగారుపడుతుంటే కావ్య ఓదారుస్తుంది. అప్పు కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటారు.
నిందను 24 గంటల్లో చెరిపేసుకుంటామని కావ్య చెబుతుంది. రాజ్‌తో సుభాష్ రేవతి ఇంట్లో ఉండాల్సింది కాదురా, అది కూడా మీ పిన్ని తప్పు పడుతుందని అంటాడు. పిన్ని ఎలా అనుకున్న చేసేదేం లేదు. నిజాలు బయటపడ్డాక అన్ని తెలుస్తాయి. బాధలో అలా అంటుందని, పోలీసులకు చెప్పాం. డిపార్ట్‌మెంట్ అంతా ట్రై చేస్తుందని రాజ్ అంటాడు.
దొరికిన లొకేషన్
డాక్టర్ వచ్చి పాప కండిషన్ బాగుంది. జ్వరం తగ్గేదాక అబ్జర్వేషన్‌లో ఉంచాలని డాక్టర్ చెబుతుంది. మరుసటి ఉదయం స్వప్న అలాగే నిద్రపోతే కావ్య వచ్చి లేపుతుంది. డాక్టర్ వచ్చి పాపను చూస్తుంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని చెబుతుంది డాక్టర్. కావ్య వాళ్లు రాత్రంతా ఇబ్బంది పడ్డారని థ్యాంక్స్ చెబుతుంది స్వప్న. ఇంతలో రాజ్‌కు ఎస్సై కాల్ చేసి అప్పు వాళ్ల లొకేషన్ ట్రేస్ చేశామని చెబుతాడు.
అదే విషయం కావ్యకు చెప్పి తీసుకెళ్తాడు రాజ్. సుభాష్, స్వప్న వెళ్లిపోతారు. లొకేషన్ వెతుక్కంటూ కావ్య, రాజ్ వెళ్తారు. ఓ చోట ఆగి ఇదేనా లొకేషన్, ఎవరు లేరేంటీ అని రాజ్ డౌట్ పడతాడు. ఎస్సై కూడా వస్తాడు. ఫోన్ సిగ్నల్ ఇక్కడే కట్ అయినట్లుంది. ఇక్కడే దగ్గర్లో పెట్టి ఉంటారని ఎస్సై అంటాడు. పాడు బడ్డ ఇల్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్తారు.
ఆ ఇంట్లో ఎవరు ఉండరు. బయటకెళ్లి చూస్తే ఓ ఫోన్ దొరుకుతుంది. ఈ ఫోన్ కిడ్నాప్ వీడియో తీసినవాడిది అయి ఉంటుంది. వీడియో తీసింది కిడ్నాపర్ వ్యక్తి కాదు. వాడు కిడ్నాపర్స్‌కు దొరికిపోయి ఉంటాడు. వాడి ఫోన్ ఇక్కడ పడి ఉంటుంది. అప్పు, కల్యాణ్‌ల ప్లేస్ మార్చి ఉంటారని ఎస్సై అంటాడు.
ఇలాగే పట్టుకోలేరు
మరోవైపు రుద్రాణి నవ్వుతుంది. ఇలాగే మీరు వెళ్లిన ప్రతిచోట క్లూ దొరుకుతుంది, కానీ వాళ్లను పట్టుకోలేరు, తను కావాలే క్లూలు వదిలినానని సంతోషిస్తుంది. ఎస్సై వెళ్లిపోతాడు. కిడ్నాప్ వీడియో గుర్తు చేసుకున్న కావ్య లోపలికి వెళ్లి మళ్లీ చూద్దామంటుంది. వీడియోను చూపించమంటుంది కావ్య.
మరోవైపు అప్పు, కల్యాణ్ తప్పించుకుంటారు. అదే విషయం రుద్రాణికి చెబుతారు. వాళ్లు తప్పించుకుంటే నేను బయటపడతాను. వాళ్లను చంపేయమని రుద్రాణి అంటుంది. అప్పును రౌడీ కత్తితో పొడిచినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.