బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్‌ను గన్‌తో షూట్ చేస్తాడు రాజ్. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్ తలపై కర్రతో కొడుతుంది. నీ ప్లాన్ సరిగా అమలు చేయలేదని రుద్రాణితో సారీ చెప్పి చనిపోతాడు రాహుల్. దాంతో కోపంగా అదే కర్ర తీసుకుని రాజ్ తలపై పదే పదే కొడుతుంది. నా వారసుడిని చంపావ్ కదా. నీ వారసుడుని చంపేస్తాను అని గన్ పట్టుకుంటుంది రుద్రాణి.
మన ప్రేమ ప్రమాదంలో ఉంది

కళావతి మన పిల్లలను కాపాడలేకపోయాను. నువ్వే కాపాడాలి కావ్య అని చేయి పట్టుకుని రాజ్ అంటాడు. కాపాడు కళావతి. మన ప్రేమ ప్రమాదంలో ఉంది. ఆ ప్రేమను కాపాడు. లే కళావతి వెళ్లి కాపాడు అని రాజ్ అంటాడు. పిల్లలను ఏం చేయకు అని రుద్రాణిని బతిమిలాడుతుంటుంది అపర్ణ. రాజ్ గట్టిగా అరవడంతో కావ్య చేయి లేచి కర్ర పట్టుకుని విసిరేస్తుంది.
దాంతో రుద్రాణి చేతిలో ఉన్న గన్ కింద పడుతుంది. కావ్య లేచి కూర్చొంటుంది. రుద్రాణి, రేఖ షాక్ అవుతారు. పిల్లలను కాపాడుతానండి అని రాజ్‌కు చెబుతుంది కావ్య. ఏంటే నా కొడుకుని చంపిన నీ కుటుంబాన్ని, నీ పాపను చంపేస్తాను అని రుద్రాణి అంటుంది. మీరేమైనా దాన ధర్మాలు చేశారా. మిమ్మల్ని అపురూపంగా చూసుకున్నారే. నీ కొడుకుకు మంచి గతే పట్టింది. ఇక మిగిలింది నువ్వే అని కావ్య అంటుంది.
త్రిశూలంతో చంపిన కావ్య
నిన్ను అంటూ కావ్య మెడ పట్టుకుంటుంది రుద్రాణి. రాయిపైకి తోసేస్తుంది రుద్రాణి. నీ కళ్ల ముందే నీ కూతురుని చంపేస్తాను. గుండెలు పగిలేలా ఏడు అని రుద్రాణి వెళ్తుంది. పక్కన ఉన్న అమ్మోరు త్రిశూలం తీసుకుని రుద్రాణినిపొడుస్తుంది కావ్య. అమ్మోరులా కావ్యను చూపిస్తారు. త్రిశూలం తీసి మళ్లీ పొడుస్తుంది కావ్య. అది చూసి అమ్మ అని రేఖ షాక్ అవుతుంది.
రుద్రాణి చనిపోతుంది. అత్తయ్య నా కూతురు బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నాను. నా చావు నాకు కనిపిస్తుంది. మీ కొడుకుతోనే నా చావు. ఏం జరిగిన సరే నా కూతురుతోనే ఉండాలి. తన భవిష్యత్తును తను ఆశపడినట్లుగా తీర్చి దిద్దండి. దుగ్గిరాల ఇంటి పేరును నా కూతురుకు అందివ్వండి. అలా చేస్తానని మాటివ్వండి అని కావ్య అడుగుతుంది. అపర్ణ కావ్యకు మాటిస్తుంది.
మరో ఫ్యామిలీకి స్వరాజ్
{{/usCountry}}రుద్రాణి చనిపోతుంది. అత్తయ్య నా కూతురు బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నాను. నా చావు నాకు కనిపిస్తుంది. మీ కొడుకుతోనే నా చావు. ఏం జరిగిన సరే నా కూతురుతోనే ఉండాలి. తన భవిష్యత్తును తను ఆశపడినట్లుగా తీర్చి దిద్దండి. దుగ్గిరాల ఇంటి పేరును నా కూతురుకు అందివ్వండి. అలా చేస్తానని మాటివ్వండి అని కావ్య అడుగుతుంది. అపర్ణ కావ్యకు మాటిస్తుంది.
మరో ఫ్యామిలీకి స్వరాజ్
{{/usCountry}}దాంతో కావ్య కుప్పకూలిపోతుంది. మరోవైపు దూరంగా పడిన స్వరాజ్ లేస్తాడు. అమ్మా అంటూ లేస్తాడు. మరోవైపు నుంచి ఒక ఫ్యామిలీ కారులో వస్తారు. మల్లీకార్జున స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు. అదే కారు ఎదుట స్వరాజ్ పడి ఉంటాడు. కారు ఆపిన ఆ కుటుంబం స్వరాజ్‌ను లేపుతాడు. ఏదో యాక్సిడెంట్ అయినట్లు ఉంది. ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉందని కారు డ్రైవర్ అంటాడు.
నీకేం సమస్య రాదు. దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లు మేము ట్రీట్‌మెంట్ ఇస్తామని వాళ్లు అంటారు. దాంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మరోవైపు హాస్పిటల్‌లో అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. అందరిని కోల్పోయాను, నా భర్త జీవచ్ఛవంలా ఐసీయూలో ఉన్నారు. ఇదంతా కల అయితే బాగుండు. ఇంత బారాన్ని మోయలేక నాకు పిచ్చి పట్టేలా ఉందని ఏడుస్తుంటుంది అపర్ణ.
రేఖ గుప్పిట్లో ఆస్తి, అధికారం
డాక్టర్ వచ్చి పిల్లలు బాగానే ఉన్నారు. బాగానే ఊపిరి పీల్చుకున్నారు అని డాక్టర్ అంటాడు. తన పొత్తిల్లలో పెట్టుకుని కూతురుని కాపాడుకుంది ఆ తల్లి అని అపర్ణ అంటుంది. తర్వాత సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్‌కు ట్రీట్‌మెంట్ జరుగుతుంది.
సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్ వెన్నుముకకు బాగా దెబ్బ తగిలిందని, ఇక నడవలేరని చెబుతాడు. కట్ చేస్తే దుగ్గిరాల కుటుంబం అంతా చనిపోతుంది. అపర్ణ, సుభాష్ బతికి ఉంటారు. ఆస్తి, అధికారం అంతా రేఖ తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. రేఖ దగ్గర కావ్య, అప్పు కూతుళ్లతో అపర్ణ మగ్గిపోతూ బతుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.