బ్రహ్మముడి జనవరి 14 ఎపిసోడ్: రాజ్‌కు సంకెళ్లు వేసి అరెస్ట్ చేసిన అప్పు-కల్యాణ్ నేరం- దొంగ బంగారం కేసులో కోర్టుకు స్వరాజ్
బ్రహ్మముడి సీరియల్ జనవరి 14 ఎపిసోడ్‌లో కావ్యకు పాప పుట్టడంతో దుగ్గిరాల ఇంటి కుటుంబం అంతా సంతోషిస్తుంది. మరోవైపు మంత్రి భార్య తులసికి కూడా బిడ్డ పుడుతుంది. రాజ్‌కు సంకెళ్లు వేసి అప్పు అరెస్ట్ చేస్తుంది. దొంగ బంగారం కేసులో రాజ్‌ను కోర్టుకు పంపిస్తారు. కల్యాణ్ నేరం చేశాడని అప్పు అంటుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి అన్న రాజ్‌ను కల్యాణ్ తప్పిస్తాడు. దాంతో రాజ్ హాస్పిటల్‌కు వస్తాడు. అక్కడ ఎస్సై ఆర్డర్‌తో రాజ్‌ను అడ్డుకుంటుంది అప్పు. అడ్డుపడిన దుగ్గిరాల ఇంటి సభ్యులు రాజ్‌ను కావ్య దగ్గరికి పంపిస్తారు.

ప్రేమగా రాజ్ కావ్య
కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ ప్రేమగా మాట్లాడుతాడు. మీరే కదండి నా ధైర్యం, ఆత్మ విశ్వాసం అంటూ సంతోషిస్తుంది కావ్య. ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకుంటారు. మీరు వచ్చారుగా. ఇక నాకు ఏం కాదు. ఆపరేషన్ చేయించుకుంటాను అని కావ్య చెబుతుంది. దాంతో రాజ్ సంతోషిస్తాడు.
ఇంతలో డాక్టర్ వస్తుంది. రాజ్‌పై మండిపడుతుంది డాక్టర్. నేను ఏం చెప్పాను. మీరు ఏం చేశారు. నేను కావ్యకు భర్తగా, దుగ్గిరాల ఇంటి కొడుకుగా ఇక్కడికి రమ్మన్నాను. కానీ, ఇలా క్రిమినల్‌గా హాస్పిటల్‌కు రమ్మనలేదు అని డాక్టర్ అంటుంది. తప్పు చేసి తప్పించుకుని వచ్చిన ఓ క్రిమినల్ ఆపరేషన్ థియేటర్‌లో ఉంటే మా హాస్పిటల్‌కు, నాకు చెడ్డ పేరు వస్తుంది అని డాక్టర్ కోప్పడుతుంది.
చట్టం గురించి చూస్తే
దయచేసి బయటకు వెళ్లండి అని రాజ్‌పై అరుస్తుంది డాక్టర్. కానీ, డాక్టర్ నాకు ఇంకో దారి తెలియలేదు. నా భార్య పరిస్థితి చూసి అక్కడే ఉండలేకపోయాను. బెయిల్ రావాలంటే రెండు రోజులు పడుతుంది. న్యాయం, చట్టం అని చూస్తే నా భార్యను, బిడ్డను కోల్పోతాను. అందుకే నాకు ఇష్టం లేకున్నా ఇలా చేయాల్సి వచ్చింది అని రాజ్ సంజాయిషీ ఇచ్చుకుంటాడు.
అయినా డాక్టర్ వినదు. ఏది ఏమైనా మీరు చేసింది తప్పు అంటుంది డాక్టర్. ప్లీజ్ డాక్టర్ అర్థం చేసుకోండి. ఆపరేషన్ చేసి నా భార్య, బిడ్డను కాపాడండి. నేను కూడా ఆపరేషన్ థియేటర్‌లో ఉంటాను అని రాజ్ అంటాడు. అందుకు డాక్టర్ ఒప్పుకోదు. దాంతో కావ్య మాట్లాడుతుంది.
మా బాధ్యతను నిర్వర్తించలేం
నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే నేను తట్టుకోలేను డాక్టర్ అని కావ్య అంటుంది. కానీ, ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే మా బాధ్యతను కూడా నిర్వర్తించలేము అని డాక్టర్ అంటుంది. ప్లీజ్ డాక్టర్ మీకు దండం పెడతాను. కాస్తా కనికరించండి అని రాజ్ వేడుకుంటాడు.
కావ్య కూడా రాజ్ లేకుండా ఆపరేషన్ చేయించుకోనని చెబుతుంది. దాంతో డాక్టర్ ఏం చేయలేక రాజ్‌ను ఆపరేషన్ థియేటర్‌లో ఉండేందుకు ఒప్పుకుంటుంది. కావ్యను ఆపరేషన్‌కు రెడీ చేసి తీసుకెళ్తారు. ఆపరేషన్ చేసి కావ్యకు డెలివరి చేస్తారు. కావ్యకు పాప పుట్టిందని దుగ్గిరాల ఇంటివారికి నర్స్ చెబుతుంది.
మంత్రి భార్యకు బిడ్డ
దాంతో అంతా సంతోషిస్తారు. దేవుడా ఎంత పరీక్ష పెట్టావు అని ఇందిరాదేవి అనుకుంటుంది. మరోవైపు మంత్రి ధర్మేంద్ర భార్య తులసి కూడా బిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన పాపను సంతోషంగా ముద్దు పెట్టుకుంటుంది కావ్య. రాజ్ చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతాడు. కావ్య, రాజ్ ఇద్దరు సంతోషంగా ఉంటారు.
ఏవండి. నేను ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వారసురాలిని ఇచ్చాను అని కావ్య అంటుంది. అవును అన్నట్లుగా రాజ్ తల ఊపుతాడు. తర్వాత రాజ్‌కు సంకెళ్లు వేసి అప్పు అరెస్ట్ చేస్తుంది. తిరిగి పోలీస్ స్టేషన్‌కు పంపిస్తుంది అప్పు.
సహాయం చేసినందుకు
రాజ్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడం సహాయం చేసినందుకు కల్యాణ్ కూడా నేరం చేశాడని, అందుకు శిక్ష పడుతుందని అప్పు అంటుంది. తర్వాత దొంగ బంగారం కేసులో స్వరాజ్‌ను కోర్టుకు పంపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


