Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజును ఇంటికి తీసుకురమ్మని ఇందుతో అంటుంది అపర్ణ. ఈ ఊబిలోకి రాజు ఎందుకు, మేమంటే అక్కాచెల్లెళ్లం కాబట్టి రేఖ ప్లాన్‌ను తిప్పి కొట్టాలి. కానీ, రాజుకు ఏం సంబంధం ఉందని ఇందు అంటుంది.
రాజును పిలవనన్న ఇందు

సంబంధం లేదంటవేంటీ. అతను నీకు తాళి కట్టిన భర్త. అతను నేను పిలిస్తే రాడు. నువ్వు పిలిస్తేనే వస్తాడని అపర్ణ అంటుంది. సారీ నానమ్మ నేను పిలవలేనని ఇందు వెళ్లిపోతుంది. రాజు నిజంగా అక్క భర్త అయితే పిలిచేది అద్దె మొగుడు కాబట్టే పిలవట్లేదని నందు మనసులో అనుకుంటుంది. దీని జీవితం ఎలా ఉంటుందో భయంగా ఉందని అపర్ణ అంటుంది.
ఎందుకు కంగారు నానమ్మా.. నేను వచ్చానుగా. అక్కను నేను కన్విన్స్ చేస్తాను అని నందు అంటుంది. మరోవైపు రేఖకు రాజు కాల్ చేసి ఎలా ఉంది పిన్ని మన సర్‌ప్రైజ్. బాగా థ్రిల్ అయినట్టున్నావ్. నీ ఆశలు కలలు అన్నీ గాల్లో కలిసిపోయినట్లున్నాయి అని అంటాడు. దాంతో రేఖ బ్యాచ్ అంతా అవాక్కవుతుంది.
నువ్వు మాములు కంత్రీదానివి కాదు పిన్నో. నాకు తెలియకుండానే నాతో ఆస్తి పేపర్స్‌పై సంతకం చేయించుకున్నావ్ అని రాజు అంటే.. నాకెందుకు అడ్డు వస్తున్నావ్ అని రేఖ అంటుంది. నేనెక్కడ వస్తున్నాను. నువ్వే వచ్చేలా చేసుకుంటున్నావ్. నేను ఇంట్లో లేకున్నా నీ ప్లాన్ ఎలా తిప్పికొట్టానో చూశావుగా అని రాజు అంటాడు.
ఆ ఇల్లు, కంపెనీ నాదే
నేను ఇంటికి దూరంగా ఉన్నా ఎప్పటికీ ఇందు నా భార్యే. ఆ ఇల్లు నాదే. ఆ కంపెనీ నాదే. ఆ ఇంటి మనుషులను కాపాడే బాధ్యత నాదే. వాళ్లపై ఈగ వాలిన నా నుంచి సెకన్లో రియాక్షన్ ఉంటుంది అని రాజు వార్నింగ్ ఇస్తాడు రాజు. నీ మొహం చూడాలని ఉంది కానీ నువు బుసలు కొడుతున్న ఊపిరి చెబుతోంది ఎలా ఉన్నావో అని రాజు సెటైర్లు వేసి కాల్ కట్ చేస్తాడు.
{{/usCountry}}నేను ఇంటికి దూరంగా ఉన్నా ఎప్పటికీ ఇందు నా భార్యే. ఆ ఇల్లు నాదే. ఆ కంపెనీ నాదే. ఆ ఇంటి మనుషులను కాపాడే బాధ్యత నాదే. వాళ్లపై ఈగ వాలిన నా నుంచి సెకన్లో రియాక్షన్ ఉంటుంది అని రాజు వార్నింగ్ ఇస్తాడు రాజు. నీ మొహం చూడాలని ఉంది కానీ నువు బుసలు కొడుతున్న ఊపిరి చెబుతోంది ఎలా ఉన్నావో అని రాజు సెటైర్లు వేసి కాల్ కట్ చేస్తాడు.
{{/usCountry}}రాజు.. రాజు.. అసలు ఎవర్రా నువ్వు అని రేఖ అనుకుంటుంది. తర్వాత బయట భ్రమరాంబ తలపై ముసుగేసుకుని కన్న కలలు, ఆస్తి చేజారడం గురించి బాధపడుతూ చెబుతుంది. లగేజ్ పట్టుకుని వచ్చిన శేషు మీరు అనుకుంది ఎప్పటికీ జరగదు. నాకు అనిపించింది చాలా సార్లు చెప్పాను. ఇన్నిరోజులు మీరు వినలేదు అని శేషు అంటాడు.
రాజు లేడనుకుంటే నందు వచ్చింది. ఇందు దగ్గర మనం ఏం చేసిన నడిచింది. నందు అలా కాదు. నాటు బాంబుతో పేలుస్తుంది. పైగా తను పోలీసులతో పని చేస్తుంది. ఆస్తి కాదు ముందు ప్రాణాలు ఉండాలి. మన ప్రాణాలు ఉండాలంటే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఏదో చెట్టు కింద తలదాచుకుందాం. పదా భ్రమరం. 20 ఏళ్ల పగ అంతా నందు తీర్చుకోడానికి రెడీగా ఉంది అని శేషు అంటాడు.
అనాథలా పెరుగుతున్నా
మనం అనుకున్న పని కేవలం వాయిదా పడింది. ఆస్తి నా సొంతం అయ్యే వరకు నేను ఊరుకోను. ఇప్పుడొచ్చిన నందుకు నేనేంటో చూపిస్తాను అని రేఖ అంటుంది. శేషు రేఖ చెబుతుందిగా లగేజ్ లోపల పెట్టు అని భ్రమరాంబ అంటుంది. అంతేనంటావా. ఏదోనా మీతోనే నేను అని లోపలికి వెళ్లిపోతాడు శేషు. మరోవైపు లక్కీతో మందు తాగుతాడు రాజు.
నేను చాలా హ్యాపీరా. నేను ఇందును కాపాడుకున్నానురా అని రాజు అంటాడు. అద్దె మొగుడు వేశానికి ఎందుకురా ఇంత చేస్తున్నావ్ అని లక్కీ అంటాడు. అదంతా నాకు తెలియదురా ఫస్ట్ టైమ్ మంచి పని చేసినట్లు అనిపిస్తుందని రాజు అంటాడు. కొన్ని జాతకాలు అర్థం కావురా. నీకు ఫ్యామిలీ, కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయి అందరు ఉన్నారు. అద్దె మొగుడిగానైనా బంధం ఏర్పడింది. నాకు మాత్రం ఎవరు లేరు ఏకాకిని అని లక్కీ అంటాడు.
నేనున్నానుగా అని రాజు అంటే.. ఇప్పుడు నువ్వు కూడా దూరమైపోయావు. నువ్వు దూరంగా ఉన్నప్పుడే అర్థమైంది నా బతుకు. అమ్మా నాన్న లేనివాడి బతుకు దారుణంరా. అది నా బతుకే అని లక్కీ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా తండ్రి, తల్లి ఎవరు తెలియదు. వాళ్లు ఎక్కడో ఉండే ఉంటారు కానీ అనాథలా పెరుగుతున్నాను అని లక్కీ అంటాడు.
ఏడిపించేసిన లక్కీ
కొన్నింట్లో అనాథ అని రాయాలంటే మనసు ఒప్పుకోవట్లేదురా. ఎందుకంటే నా అమ్మ బతికే ఉంది అని లక్కీ చెబితే.. ఎవరని రాజు అడుగుతాడు. నాకు తెలియదు. కానీ ఆ ఆంటోనికి తెలుసు. వాడు నా వీక్‌నెస్ పట్టుకుని బీరు, బిర్యానీ తెప్పించుకుంటున్నాడు. వాడు చెప్పడు. కానీ, వాడు ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడిని కొట్టాలనిపిస్తుంది. కానీ, ఏం చేయలేను. మా అమ్మ తెలిసిన ఒకే ఒక్కడు వాడు. నా బారం ఎవ్వరికి తెలియదు అని ఏడిపించేస్తాడు లక్కీ.
నా తల్లిని ఒక్కసారి కలవాలని ఉందిరా. నన్ను ఎందుకు కనిపడేశావని నిలదీయాలని ఉందిరా. తల్లి స్పర్శ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందిరా. ఆ దేవుడు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. మా అమ్మను చూడాలని అలాగే పడిపోతాడు లక్కీ. రాజు లేపుతాడు. మా అమ్మను చూడాలిరా 25 ఏళ్ల బాధరా, 25 ఏళ్ల అవమానంరా అన్ని పోతాయి అని లక్కీ అంటాడు.
నాకు నా తల్లి కావాలిరా. నాకు అమ్మ కావాలిరా అని కన్నీళ్లు పెట్టిస్తాడు లక్కీ. నీకు ఎక్కువైంది పదా అని లక్కీని తీసుకెళ్తాడు రాజు. మరోవైపు ఇందు దగ్గర చప్పట్లు కొడుతూ వావ్ సూపర్ నువ్వు. ఏసీ గదిలో పడుకోవాలని అనుకుంటున్నావా. చూశావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. రాజు గాడు ఇంటికి దూరం కావాలని గట్టిగా కోరుకున్నా. అందుకే వాడు వెళ్లిపోయాడు. వాడు లేనప్పుడు నీకెందుకే ఈ రూమ్ వెళ్లు అని ఐశ్వర్య అంటుంది.
నందు, ఐషు గొడవ
ఆ అవసరం మా అక్కకు లేదు ఎక్కడికి వెళ్లదు. తను ఇక్కడే ఉంటది. నేను కూడా ఉంటాను అని నందు అంటుంది. మూసుకొని వెళ్లవే అని ఐశ్వర్య అంటే.. పబ్ దగ్గర మిస్ అయ్యావు. ఇప్పుడు మిస్ అవ్వను అని ఐశ్వర్య అంటుంది. చూస్తావా అని నందు అంటే.. ఇందు ఆపుతుంది. ఐశ్వర్య మరింత రెచ్చగొడుతుంది. ఎందుకు దాన్ని రెచ్చగొడుతున్నావ్. ఐషు వెళ్లు నువ్వు అని ఇందు అంటుంది.
ఇందు చెబుతోంది కాబట్టి వెళ్తున్నాను అని ఐషు అంటే.. భయంతో వెళ్తున్నా అని చెప్పొచ్చుగా అని నందు అంటుంది. మళ్లీ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. ఇందు ఆపి ఐషును పంపిస్తుంది. అది కొద్దిలో మిస్ అయింది. నిన్ను ఏమైనా అంటే ఊరుకోను అని నందు అంటుంది. తర్వాత రాజు బైక్‌పై వెళ్తుంటే వ్యాన్‌తో గుద్దించి యాక్సిడెంట్ చేయిస్తుంది రేఖ.
చెట్టుకు రాజు తల గుద్దుకుని రక్తం కారుతుంది. అక్కడున్నవాళ్లు రాజును హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. చలపతి, లక్ష్మీ ఏడుస్తుంటారు. రాజును చూసేందుకు ఇందు వస్తే చలపతి వద్దని వారిస్తాడు. రాజు నీ మొగుడు అనే ఆ రేఖ ఇలా చేసింది. అదే ఆ దుగ్గిరాల వారసుడును అని తెలిస్తే వాడిని అసలు ప్రాణాలతో ఉండనివ్వదు అని చలపతి నిజం చెప్పేస్తాడు.
ఇందుకు నిజం చెప్పేసిన చలపతి
ఏంటీ అంకులు మాట్లాడేది అని ఇందు అంటుంది. అవును, వాడు దుగ్గిరాల వారసుడు అని యాక్సిడెంట్ తర్వాత తాము తెచ్చుకుని పెంచుకున్న విషయం ఇందుకు చలపతి నిజం చెప్పేస్తాడు. ఇందు షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.