...
...
Next Story

Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి.. రేఖకు క్లాస్ పీకిన భ్రమరాంబ.. అత్తారింట్లో ఇందు.. పంతం వీడని రాజు

Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 15 ఎపిసోడ్ లో ఇందు అత్తారింటికి వెళ్లడం, అక్కడ తన బావకు సేవలు చేయడం చూడొచ్చు. అయితే రాజు మాత్రం పంతం వీడడు. చివర్లో మాత్రం రేఖకు గట్టి వార్నింగ్ ఇస్తాడు.

Published on: Jul 15, 2026, 08:04:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి ఇంటికి వస్తాడు. అయితే దుగ్గిరాల ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెబుతాడు. దీంతో ఇందు కూడా అతని వెంటే అత్తారింటికి వస్తుంది. అటు రాజు ఇంటికి వచ్చిన రేఖ.. అతడు బాగానే ఉన్నాడని తెలుసుకొని షాక్ తింటుంది.

బావను పంపించండని చలపతి కాళ్లపై పడిన ఇందు

Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి.. రేఖకు క్లాస్ పీకిన భ్రమరాంబ.. అత్తారింట్లో ఇందు.. పంతం వీడని రాజు
Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి.. రేఖకు క్లాస్ పీకిన భ్రమరాంబ.. అత్తారింట్లో ఇందు.. పంతం వీడని రాజు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జులై 15) ఎపిసోడ్ తన బావను తనతో పంపించమని చలపతి కాళ్లపై ఇందు పడే సీన్ తో మొదలైంది. ఆమె అంతలా ప్రాధేయపడుతుండటంతో మరోదారి లేక చలపతి సరే అంటాడు.

మీ ఇంట్లో ఉంటేనే వాడు బాగుంటాడన్న ధైర్యంతోనే ఒప్పుకుంటున్నానని చెబుతాడు. అయితే రాజు దుగ్గిరాల వారసుడు అనే విషయం నీకు తప్ప ఇంట్లో వాళ్లెవరికీ తెలియకూడదని ఓ కండిషన్ పెడతాడు. ఇందు బాగా ఆలోచించి సరే అంటూ చలపతికి మాట ఇస్తుంది.

రాజు ముందు బావ అని నోరు జారిన ఇందు

ఆ తర్వాత రాజుకు స్పృహ రావడంతో బావ అంటూ పరుగెత్తుకుంటూ లోనికి వెళ్తుంది ఇందు. రాజుని చూసి చలపతి ఎమోషనల్ అవుతాడు. ఇక నుంచి నిన్నెప్పుడూ తిట్టును రా అని అంటాడు. అప్పుడే ఇందుకి అపర్ణ ఫోన్ చేస్తుంది. రాజుకు ఏమైంది అని కంగారు పడటంతో తాను అతని దగ్గరే ఉన్నానని, బాగానే ఉన్నాడని ఇందు చెబుతుంది.

రాజును తీసుకొనే ఇంటికి వస్తానని ఫోన్ పెట్టేస్తుంది. నీకు ఏమైందో అని నాన్నమ్మ కంగారు పడుతుంది బావ అంటూ ఇందు నోరు జారుతుంది. ఏంటీ అని రాజు అనడంతో మళ్లీ కవర్ చేసుకుంటుంది.

రాజును ఇందుతో వెళ్లమని చెప్పి చలపతి

ఇటు దుగ్గిరాల ఇంట్లో రేఖ హుషారుగా తెల్ల చీర కట్టుకొని తయారవుతూ ఉంటుంది. భ్రమరాంబ వచ్చి ఏమైందని అడుగుతుంది. ఆ రాజు గాడు చచ్చిపోయాడు.. వాడి ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించి వస్తానని అంటుంది. అది విని భ్రమరాంబ షాక్ తింటుంది. రాజుని తానే చంపించానని రేఖ చెబుతుంది. ఎందుకంత పని చేశావని అడిగితే.. లక్కీ విషయం చెప్పకుండా ఆస్తికి అడ్డు వచ్చాడు కదా అందుకే అని అంటుంది.

దీంతో రేఖకు భ్రమరాంబ క్లాస్ పీకుతుంది. ఏదీ ఆలోచించకుండా చేస్తావ్.. వాడి హత్య అటు తిరిగి ఇటు తిరిగి నీ మెడకే చుట్టుకుంటే ఏం చేస్తావ్.. ఆరోజు వాళ్ల అమ్మానాన్న మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన వల్లే వాడికి ముప్పు అని అన్నారు.. ఇప్పుడు మనమీదే అనుమానం వస్తుంది కదా అని అంటుంది. అందుకే అలా జరగకుండా అతని ఇంటికి వెళ్లి మనపై సానుభూతి కలిగేలా చేసుకుందామని వెళ్తున్నా అని చెప్పి భ్రమరాంబను తీసుకొని బయలుదేరుతుంది.

రాజు చనిపోలేదని తెలిసి రేఖ షాక్

కిందికి రాగానే అపర్ణ, స్వాతి నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి భ్రమరాంబ షాక్ తింటుంది. రాజుగాడు చనిపోయినా వీళ్లేంటీ సంతోషంగా ఉన్నారని రేఖను అడుగుతుంది. అసలు విషయం వాళ్లకు తెలియదని రేఖ చెబుతుంది. ఇందు ఎక్కడ అని అడుగుతుంది. ఇందు లేదు.. తన భర్త దగ్గరికి వెళ్లింది.. అతన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తానని చెప్పింది అని అపర్ణ అనడంతో రేఖ, భ్రమరాంబ షాక్ తింటారు. రాజు బతికే ఉన్నాడా అని ఇద్దరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటారు.

తన మనిషికి ఫోన్ చేసిన రేఖ

వెంటనే బయటకు వెళ్లి ఇందుకు ఫోన్ చేస్తుంది. ఫోన్ బిజీ వస్తుంది. దీంతో రాజుకు యాక్సిడెంట్ చేసిన తన మనిషికి ఫోన్ చేస్తుంది. రాజు నిజంగానే చచ్చిపోయాడా లేక డబ్బు కోసం నా దగ్గర నాటకాలు ఆడావా అని నిలదీస్తుంది. లేదు మేడమ్.. అతడు నిజంగానే చనిపోయాడు.. నేను చూశాను అని చెబుతాడు. దీంతో రేఖ అతని ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతుంది.

అత్తారింటికి వచ్చిన ఇందు.. రాజుని తీసుకెళ్లే ప్రయత్నం

ఇటు రాజు మాత్రం అత్తారింటికి వెళ్లకుండా తన ఇంటికే వస్తాడు. అతనితోపాటు ఇందు అత్తారింటికి వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్లనే వెళ్లనని రాజు స్పష్టం చేస్తాడు. తాను ఒప్పుకున్నాను కదా.. ఇంకేంటి అని చలపతి అంటే.. నేను ఒప్పుకోవాలి కదా అని రాజు అంటాడు. నేను ఒప్పిస్తానని ఇందు రంగంలోకి దిగుతుంది.

తాను రాను అని, అయినా మన మధ్య ఎలాంటి బంధం లేదని రాజు అంటాడు. దీంతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే అని, ఆమెతో కలిసి వెళ్లమని చలపతి, లక్ష్మీ అతనికి చెబుతారు. కానీ రాజు మాత్రం బెట్టు వీడడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe