Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందులకు పెద్ద షాకే ఇస్తుంది రేఖ. వీళ్ల దొంగ పెళ్లి గురించి చలపతి, లక్ష్మీలకు తెలియడంతో వాళ్లు నేరుగా దుగ్గిరాల ఇంటికే వస్తారు. అయితే ఆ తర్వాత జరిగిన డ్రామా ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచేలా సాగింది.
రాజుకు ప్రేమతో స్వీట్ తినిపించిన ఇందు

హర్ష కాంట్రాక్ట్ కుదరడం రాజు వల్లే అని భావించిన ఇందు అతనికి ప్రేమగా స్వీటు తినిపించడానికి వెళ్తుంది. కానీ రాజు మాత్రం ఇదంతా భ్రమ అని అనుకుంటాడు. ఆమె వెంట పడుతున్నా స్వీటు తినడు. చివరికి ఆమె అతన్ని గట్టిగా గిల్లడంతో అది నిజమని తెలుసుకుంటాడు. నీవల్లే ఈ కాంట్రాక్ట్ ఓకే అయిందని, అందుకే నోరు తీపి చేద్దామని స్వీటు పెడుతున్నట్లు చెబుతుంది. ఆ తర్వాత అతనికి స్వీటు పెట్టి అదే ఎంగిళిని తాను తినడంతో రాజు షాకవుతాడు.
ఇందు ఎమోషనల్.. నీవల్లే ఇలా ఉన్నానంటూ..
ఇందు బాగా ఎమోషనల్ అవుతుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇలా ఉన్నాను.. అంతకుముందు ఎండినపోయిన కట్టెలా ఉన్న నేను మళ్లీ చిగురించాను.. బయటకు వెళ్లాను.. కంపెనీకి సీఈవో అయ్యాను.. ఇప్పుడు కాంట్రాక్టు కూడా దక్కించుకున్నాను అని ఇందు ఎమోషనల్ అవుతుంది. జీవితాంతం ఇలాగే అండగా ఉంటావా అని అన్న ఇందు తర్వాత తేరుకొని తనకు ఎప్పుడూ ఇలాగే సాయం చేస్తావా అని అడుగుతుంది.
రేఖను రెచ్చగొట్టిన ఐశ్వర్య.. రాజు, ఇందులపై అనుమానం
అటు రేఖను రెచ్చగొట్టడానికి వెళ్తుంది ఐశ్వర్య. తాను అప్పుడే చెప్పినా వినలేదని, ఇందు, రాజు తోడు దొంగలని మరోసారి చెబుతుంది. నీ మాట విని పార్టీలో ఫూల్ అయ్యానని రేఖ అంటే.. ఒకవేళ వాళ్లు నిజంగా పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులను ఎందుకు ఇంటికి తీసుకురావడం లేదని ఐశ్వర్య నిలదీస్తుంది.
రాజు ఏదో దాస్తున్నాడని చెప్పడంతో రేఖలో అనుమానం మొదలవుతుంది. ఇన్నాళ్లూ రాజు వైపు ఎలాంటి వీక్నెస్ లేదనుకున్నాను.. ఇప్పుడు దొరికాడు.. ఇక వదలను అని రేఖ అనుకుంటుంది.
అండగా ఉంటానన్న రాజు.. రేఖ పని చూసుకుందామంటూ..
{{/usCountry}}రాజు ఏదో దాస్తున్నాడని చెప్పడంతో రేఖలో అనుమానం మొదలవుతుంది. ఇన్నాళ్లూ రాజు వైపు ఎలాంటి వీక్నెస్ లేదనుకున్నాను.. ఇప్పుడు దొరికాడు.. ఇక వదలను అని రేఖ అనుకుంటుంది.
అండగా ఉంటానన్న రాజు.. రేఖ పని చూసుకుందామంటూ..
{{/usCountry}}ఇటు రాజు ఇందుకు ప్రామిస్ చేస్తాడు. అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. తనకు డబ్బే ముఖ్యమని, నీకు అద్దె మొగుడిగా ఉంటూ నీ పని పూర్తయ్యే వరకూ అండగా ఉంటానని హామీ ఇస్తాడు. గాయపడ్డ రేఖ ఏం చేస్తుందో అని ఇందు ఆందోళన చెందితే.. ఆమెకు ఒకటే బ్రెయిన్, మనవి రెండు బ్రెయిన్స్.. ఆమె ఏం చేసినా చూసుకుందామంటూ ఇందుకు రాజు ధైర్యం చెబుతాడు.
రాజు తల్లిదండ్రులకు పెళ్లి గురించి చెప్పిన రేఖ మనిషి
రేఖ మరుసటి రోజే తన ప్లాన్ అమలు చేస్తుంది. చలపతికి అప్పు ఇచ్చిన వ్యక్తి తమ్ముడిని రంగంలోకి దింపుతుంది. తన పేరు రాకుండా రాజు దుగ్గిరాల ఇంటికి అల్లుడైన విషయం చెప్పాలని అతన్ని పంపిస్తుంది. అతడు వెళ్లి తన అన్న డబ్బు తిరిగి ఇవ్వాలని చలపతిని డిమాండ్ చేస్తాడు. తన చిన్న కొడుకు ఉద్యోగం పోయిందని, టైమ్ కావాలని అడిగితే.. మరి నీ పెద్ద కొడుకు గొప్పింటికి అల్లుడైన సంగతేంటని నిలదీస్తాడు.
వాళ్లు షాక్ లో ఉండగానే మీ పెద్ద కొడుకు దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడు.. ఇందుని పెళ్లి చేసుకున్నాడు.. అతన్ని అడిగి 24 గంటల్లో మా అన్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లి రేఖకు పని పూర్తయిందని చెబుతాడు. ఇప్పుడు ఆ రాజు ఎలా తప్పించుకుంటాడో చూస్తానని ఆమె అనుకుంటుంది.
దుగ్గిరాల ఇంటికి చలపతి, లక్ష్మీ
రాజు పెళ్లి విషయం తెలిసి చలపతి, లక్ష్మీ షాక్ తింటారు. అతడు ఇందుని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడు అబద్ధం చెప్పాడా? అయినా రాజు దుగ్గిరాల ఇంటికి అల్లుడిగా ఉండకూడదు అని చలపతి అంటాడు. వెంటనే ఆ ఇంటికి వెళ్దామని లక్ష్మీని సిద్దం చేస్తాడు.
ఇటు ఇంట్లో అందరి ముందే రాజు, ఇందు ఎంతో సంతోషంగా సరసాలుడుతూ ఉండగా చలపతి, లక్ష్మీ రావడం చూసి షాక్ తింటారు. ఇందును నిజంగానే పెళ్లి చేసుకున్నావా అని చలపతి అడిగితే.. అవునని రాజు అంటాడు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ రాజును చలపతి లాక్కెళ్తుంటాడు. ఇంతలో ఇందుకి ఇచ్చిన ప్రామిస్ గుర్తుకు వచ్చి తండ్రిని రాజు ఎదిరిస్తాడు. ఈ హైడ్రామా మధ్య బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.