Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో చాలా ట్విస్టులే ఉన్నాయి. రాజు చేతుల్లో రేఖ పూర్తిగా ఇరుక్కుపోగా.. ఇటు వెంకీ తన ప్రేమను దాచడం, అటు ఐశ్వర్య ఓ కోటీశ్వరుడి ప్రేమలో పడటంలాంటి సీన్లతో ఆసక్తికరంగా సాగిపోయింది.
మదన్ గదిలో లక్కీని ఉండమన్న రేఖ..

లక్కీ ఎక్కడ ఉండాలో తుది నిర్ణయం నీదే అని రేఖతో రాజు అనే సీన్ తో సీరియల్ శనివారం (జులై 25) ఎపిసోడ్ మొదలైంది. రాజు పూర్తిగా ఇరికించడంతో మరో దారి లేక.. మదన్ నువ్వే కొన్ని రోజులు అడ్జెస్ట్ చేసుకో.. తర్వాత నీకు వేరే రూమ్ ఇస్తానని రేఖ అంటుంది. అంటే ఈ లక్కీ గాడు నా రూమ్ లో ఉంటాడా అని మదన్ ఆవేశపడుతూ వెళ్లిపోతాడు. రేఖ వెళ్లిన తర్వాత అసలు ఈమెకు ఏమైంది.. రాజు చెప్పినట్లు ఎందుకు చేస్తోందని భూషణ్ లో మరింత అనుమానం మొదలవుతుంది.
నందు దుగ్గిరాల వారసురాలని తెలుసుకొని వెంకీ షాక్
అటు నందుకి తన ప్రేమను చెప్పాలని చూస్తున్న వెంకీకి పెద్ద షాకే తగులుతుంది. ఆమె తన ఇంటికి వెంకీని తీసుకెళ్తుంది. నా రూమ్ లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి.. అవి తీసుకొని వస్తాను వెళ్దామని అంటుంది. ఇది దుగ్గిరాల ఇల్లు కదా అని అంటే.. అవును ఇది నా ఇల్లే అని ఆమె అంటుంది.
మీ వదిన ఇందు ఎవరో కాదు.. నా సొంత అక్క.. నేను చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాను అని ఆమె చెబుతుంది. దీంతో వెంకీ షాకవుతాడు. దుగ్గిరాల ఇంటి అమ్మాయిని మాత్రం ప్రేమించను అని తండ్రికి ఇచ్చి మాట ప్రకారం ఆమెకు తన ప్రేమను చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే వచ్చేస్తానని నందు చెప్పినా వినడు. ఏదో చెప్పాలన్నావ్ కదా అని అడిగినా.. ఇప్పుడు కాదులే అని వెళ్లిపోతాడు.
నందుని నిలదీసిన ఇందు.. వెంకీని ప్రేమిస్తున్నట్లు చెప్పిన చెల్లి
{{/usCountry}}మీ వదిన ఇందు ఎవరో కాదు.. నా సొంత అక్క.. నేను చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాను అని ఆమె చెబుతుంది. దీంతో వెంకీ షాకవుతాడు. దుగ్గిరాల ఇంటి అమ్మాయిని మాత్రం ప్రేమించను అని తండ్రికి ఇచ్చి మాట ప్రకారం ఆమెకు తన ప్రేమను చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే వచ్చేస్తానని నందు చెప్పినా వినడు. ఏదో చెప్పాలన్నావ్ కదా అని అడిగినా.. ఇప్పుడు కాదులే అని వెళ్లిపోతాడు.
నందుని నిలదీసిన ఇందు.. వెంకీని ప్రేమిస్తున్నట్లు చెప్పిన చెల్లి
{{/usCountry}}నందు లోనికి రాగానే ఇందు ఆమెను నిలదీస్తుంది. ఎక్కడికెళ్లావని అడుగుతుంది. యాక్సిడెంట్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని తెలిస్తే తిడుతుందనుకొని వెంకీతో కలిసి సరదాగా బయటకు వెళ్లానని చెబుతుంది. వెంకీకి, నీకు మధ్య ఏదో ఉన్నట్లుంది అని ఇందు అంటే.. ఏం లేదు.. వాడు నా బెస్ట్ అని ఫ్రెండ్ మొదట చెప్పిన నందు.. తర్వాత వాడిని ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు చెబుతుంది.
కానీ మొదట వాడే ప్రపోజ్ చేయాలని, వాడు చేసిన తర్వాత కొన్నాళ్లు ఆలోచించి చెబుతానని వాడిని ఏడిపిస్తానని అంటుంది. కానీ తానే ప్రపోజ్ చేస్తే ఏమనుకుంటుందో అని వెంకీ భయపడుతుండొచ్చు కదా అని ఇందు అంటుంది. నువ్వే నీ ప్రేమను ముందు చెప్పు అని అనడంతో అప్పుడే మీ మరిదికి సపోర్ట్ చేస్తున్నావా అని నందు అంటుంది. అయినా రాజు నీ అద్దె మొగుడేగా అని నందు అనడంతో ఇందు అతడు మన బావ అని నిజం చెప్పలేకపోతుంది.
కోటీశ్వరుడు శశి ప్రేమలో ఐశ్వర్య
మరోవైపు ఇందు క్లాస్ పీకినప్పటి నుంచీ బాధలో ఉన్న ఐశ్వర్య.. ఫ్రెండ్ పార్టీలోనూ డల్లుగా ఉంటుంది. దీంతో ఆమె ఫ్రెండ్ ఐశ్వర్యకు ఓ సలహా ఇస్తుంది. దీనితో నీ కష్టాలన్నీ పోతాయి.. ఆ శశిగాడు చాలా రోజుల నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు.. వాడు పెద్ద కోటీశ్వరుడు.. నిన్ను మహారాణిలా చూసుకుంటాడు అని చెబుతుంది.
కానీ ఐశ్వర్య మాత్రం అతని ప్రేమను అంగీకరించడానికి తనకు ఇగో అడ్డొస్తుందని అంటుంది. ఈ ఇగోను పక్కన పెడితే అన్ని బాగుంటాయి.. నీ క్రెడిట్ కార్డు బిల్లు కూడా ఉందన్నావ్.. వాడి ప్రేమను ఒప్పుకుంటే చాలు.. నువ్వు పెద్ద కోటీశ్వరాలివి అయిపోతావ్ అని అనడంతో ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది.
బావ బావ అంటూ రాజును ఇబ్బంది పెట్టిన ఇందు..
ఇటు ఇందు, రాజు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే రేఖను ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు లక్కీ తన సొంత కొడుకు అన్న విషయం ఆమెనే చెబుతుంది అని రాజు అంటాడు. నీ ఐడియా సూపర్ బావ అని ఇందు అనడంతో అతడు చిరాకు పడతాడు. ఈ బావ అని మాత్రం పిలవకు అని అంటాడు. కానీ ఇందు మాత్రం పదే పదే బావ బావ అని పిలుస్తుంది. చివరికి నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పమని ఇందు అడుగుతుంది.
తనలాంటి పోలికలే చెబుతాడని ఆమె ఆశ పడుతుంది. కానీ రాజు మాత్రం హైట్ సుమారు తన అంత ఉండాలని, అమ్మాయి పెద్దగా చదువుకొని ఉండకూడదని, ఆమె బుగ్గలు బూరెల్లా ఉండొద్దని.. ఇలా ఇందుకి లేని లక్షణాలన్నీ చెబుతుంటాడు. దీంతో ఆమె ఉడుక్కుంటుంది. కానీ బావ మీద ప్రేమ మాత్రం మరింత పెంచుకుంటూ ఉంటుంది.
మదన్ చెంప పగలగొట్టిన రేఖ
మరోవైపు హాల్లో మదన్, లక్కీ టీవీ చూస్తుంటారు. రిమోట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. లక్కీ కాలర్ పట్టుకుంటాడు మదన్. దీంతో లక్కీ కూడా మదన్ కాలర్ పట్టుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. రేఖ పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆ లక్కీ గాడి చెంప పగలగొట్టు అని భ్రమరాంబ అంటుంటే.. రేఖ మాత్రం మదన్ చెంప పగలగొడుతుంది. దీంతో అందరూ షాకవుతారు. కచ్చితంగా రేఖ చాలా మారిపోయింది.. అసలు ఏం జరిగిందో తెలుసుకొని తీరాలని భ్రమరాంబ, శేషు అనుకుంటారు.