Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణ, రాజు తింటుంటారు. అపర్ణపై రాజు ప్రేమ చూపిస్తుంటే అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో స్వాతి వచ్చి నువ్వు ఎంత చెప్పిన ఐశ్వర్య బయటకు వెళ్లింది. లక్కీ బైక్ ఎక్కి వెళ్లింది అని అంటుంది.
నా మీద కోపంతో

నీ ఫ్రెండ్ ఐశ్వర్యను తీసుకెళ్లడం ఏంటని రాజుపై కోప్పడుతుంది ఇందు. లిఫ్ట్ అడిగితే సాయం చేసినట్లున్నాడు. నువ్వు అనాల్సింది ఐశ్వర్యను అని రాజు అంటాడు. రాజు చెప్పింది కరెక్ట్ అని, రేఖ పెంపకంలో అది తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని అపర్ణ అంటుంది. నా తాపత్రయం అదే. నా మీద కోపంతో అది పొగరుతో ఎక్కడ సమస్యల్లో పడుతుందనే నా భయమంతా అని ఇందు అంటుంది.
రాజు నవ్వుతాడు. నువ్వు తనను మార్చాలంటే నవ్వోస్తుంది. అది జరగదు. తన గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని రాజు అంటాడు. ఏం తెలుసు చెప్పు అంటే.. వీళ్లకు నిజం చెబితే ఏమైపోతారో అని మనసులో అనుకుని ఏం లేదని రాజు పైకి అంటాడు. మరోవైపు శశి దగ్గరికి ఐశ్వర్య వెళ్లి హగ్ ఇస్తుంది. అది చూసి లక్కీ తెగ షాక్ అవుతాడు.
బేబీ అని ఐషును శశి అంటే.. నేను తనను తీసుకొచ్చింది వీడికి హగ్గు ఇచ్చేందుకా అని ఫీల్ అవుతాడు లక్కీ. నీకు డబ్బులు ఇవ్వాలా అని శశి అంటే.. హలో నేను ఐశ్వర్య ఫ్యామిలీ ఫ్రెండ్‌ని అని లక్కీ అంటాడు. అంటే బాడీగార్డా అని జోకులు వేస్తాడు శశి. తర్వాత సారీ చెబుతాడు. అంత అవసరం లేదురా, మధ్యలో బీర్ తీసుకు వస్తాడని తీసుకొచ్చానని ఐశ్వర్య అవమానిస్తుంది.
తాగి ఐశ్వర్య గొడవ
రేయ్ లక్కీ ఇది మన ప్లేస్ కాదు సైలెంట్‌గా ఉండరా అని మనసులో అనుకుంటాడు లక్కీ. లక్కీ ముందే ఐశ్వర్య అందాన్ని పొగుడుతాడు శశి. ఐశ్వర్య లోపలికి వెళ్దామంటుంది. లక్కీని కూడా రమ్మంటుంది. కట్ చేస్తే ఐశ్వర్య బాగా తాగి ఇంట్లోకి గొడవ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది. ఒసేయ్ ఇందు రావే అని రచ్చ చేస్తుంది. అంతా వస్తారు.
{{/usCountry}}రేయ్ లక్కీ ఇది మన ప్లేస్ కాదు సైలెంట్‌గా ఉండరా అని మనసులో అనుకుంటాడు లక్కీ. లక్కీ ముందే ఐశ్వర్య అందాన్ని పొగుడుతాడు శశి. ఐశ్వర్య లోపలికి వెళ్దామంటుంది. లక్కీని కూడా రమ్మంటుంది. కట్ చేస్తే ఐశ్వర్య బాగా తాగి ఇంట్లోకి గొడవ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది. ఒసేయ్ ఇందు రావే అని రచ్చ చేస్తుంది. అంతా వస్తారు.
{{/usCountry}}అసలు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావే అని ఇందును అంటుంది ఐశ్వర్య. నీ వల్ల పరువు పోతుందని అపర్ణ అంటుంది. తాగొద్దని చెప్పానుగా అని ఇందు అంటే అందుకే ఎక్కువ తాగా, ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ, నానమ్మ పెగ్గు, తాతయ్య పెగ్గు, ఈ రాజు పెగ్గు అంటూ చాలా తాగేసా. ఎక్కువైందని. అయితే ఇప్పుడేంటీ. నన్ను తాగొద్దని చెప్పడానికి నువ్వెవరే, నా మీద నీ పెత్తనం ఏంటే అని ఐశ్వర్య అంటుంది.
మీరు చెప్పినట్లు గంగిరెద్దిలా తల ఆడించడానికి రేఖ ఆంటీని కాదు అని ఐశ్వర్య అంటే.. ఐషు అని కోప్పడుతుంది రేఖ. హా.. వచ్చిందమ్మా వయ్యారీ.. అసలు ఇదో పెద్ద తింగరబుచ్చి, ఇంట్లో కళ్లముందే ఏం జరుగుతుందో తెలుసుకోలోని అమాయకపు చక్రవర్తి అని రేఖపై సెటైర్లు వేస్తుంది ఐశ్వర్య. భ్రమరాంబ కలగజేసుకుంటే.. నీకంటే తక్కువే వాగుతున్నా బావురుకప్ప భ్రమరాంబ అని ఐశ్వర్య అంటుంది.
రేఖపై ఐశ్వర్య సెటైర్లు
బావురుకప్ప కాకపోతే గాండ్రుకప్పు. నువ్వు అరవడం తప్పా దాంట్లో అర్థముండదు, పాడుండదు. ఏమైనా అంటే శేషు అంటావ్. వాడేమో మూసా మూసా అంటాడు అని ఐశ్వర్య అంటుంది. నన్ను వాడు అంటావా అని శేషు కోప్పడితే ఆమాత్రం రెస్పెక్ట్ ఇచ్చా సంతోషిచ్చా అని నోరు మూయిస్తుంది ఐశ్వర్య. ఐషు చాలా ఓవర్ చేస్తున్నావ్ రూమ్‌లోకి వెళ్లు అని రేఖ అంటుంది.
ఎహే ఆపు అని చేయి తీసేస్తుంది ఐశ్వర్య. నీకే ఏం తెలియదు. వీళ్లు బార్యాభర్తలు కాదని వీడియో చూపిస్తే అది ఏఐ వీడియో అని చెప్పగానే నమ్ముతావా. స్లీవ్‌లెస్ జాకెట్ వేసి, ట్రాన్స్‌పరెంట్ చీర కట్టుకుని ఓ తెగ తిప్పుకుంటూ తిరుగుతావ్ కదా అని ఐశ్వర్య నానా మాటలు అంటుంది. ఆ మాటలు ఏంటని భూషణ్ అంటే.. ఆగు మావయ్య నీ మాటలు నీ పెళ్లామే వినదు, మేము వినాలా అని ఐశ్వర్య అంటుంది.
మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాం కదా అని రాజు అంటే.. చూపించావ్‌లే. అది ఎవరు తీసుకొచ్చారు. ఆ బుడ్డమిరపకాయ్ నందునే కదా అని ఐశ్వర్య అంటుంది. అంత మాట అంటావా అని స్వాతి అంటే.. కాకపోతే. అది పెద్ద హైట్ ఉందా. నువ్వొక మెసెంజర్‌లా అటు విషయాలు ఇటు ఇటు విషయాలు అటు చెబుతావ్ అని ఐశ్వర్య అంటుంది.
రేఖ నుంచి నందు దాకా విరుచుకుపడిన ఐషు
రేఖ నుంచి నందు, స్వాతి దాకా ఒక్కొక్కరిని మాటలతో ఐశ్వర్య ఆడుకుంటుంది. రాజు కిడ్నాప్ నుంచి పెళ్లి దాకా అంతా చెప్పి నీ ఆటలు ఏంటో, నీ ప్లాన్ ఏంట్రా అని రాజు కాలర్ పట్టుకుని కూలిపోతుంది. మత్తులో పడిపోతుంది. ఇందు పట్టుకుంటుంది. లక్కీ పట్టుకునాని పోతే రాజు ఆపి ఓవరాక్షన్ చేయకని చెబుతాడు. దీని సంగతి రేపు పొద్దున చెబుతానని భ్రమరాంబ అంటుంది.
తాగితే నిజాలు బయటకొస్తాయంటారు. అయితే, ఐషు చెప్పింది నిజమేనా అని భ్రమరాంబ డౌట్ పడుతుంది. రా నిజమేంటో కనుక్కుందామని భ్రమరాంబ అంటుంది. రేఖ ఏంటీ కళ్లలోకి చూస్తేనే ఊరుకునేది కాదు, ఇప్పుడు ఎవరు ఏమన్నా సైలెంట్‌గా ఉంటోంది ఏంటని భూషణ్ డౌట్ పడతాడు. భ్రమరాంబ వచ్చి మేము నిజమేంటో పసిగట్టేశాం అంటుంది.
లక్కీ నా కొడుకు అనే నిజం తెలిసిపోయిందా అని మనసులో భయపడిన రేఖ వదినా మీరు ఏమనుకుంటున్నారో అది అబద్ధం అని అంటుంది. అసలు మేము ఏం అనుకుంటున్నామో నీకెలా తెలుసు అని రివర్స్‌లో అడుగుతుంది భ్రమరాంబ. రేఖ కంగారుపడుతుంది. అది అంతా గమనిస్తారు. ఆ ఐషు మాటలు విన్నాకా మాకు అనుమానంగా ఉంది. ఇందుకు రాజు అద్దె మొగుడుగా నటిస్తున్నాడనిపిస్తుందని భ్రమరాంబ అంటుంది.
సాక్ష్యాలు సంపాదిస్తానన్న భ్రమరం
ఐషు చెప్పినట్లు ఆ ఇందు నిన్ను మాయ చేస్తుందేమో అనిపిస్తుందని భ్రమరాంబ అంటుంది. అనుమానంగా ఉంటే సరిపోదు ఆధారాలు కావాలని భూషణ్ అంటాడు. ఈ విషయం లైట్ తీసుకోండి. అంత టైమ్ వేస్ట్ అని రేఖ అంటుంది. నా అనుమానం తీరేదాకా నేను పట్టానా ఉండలేను. సాక్ష్యాలు సంపాదిస్తాను అని భ్రమరాంబ అంటుంది.
ఇకనుంచి ఇందు, రాజులను పిన్ టు పిన్ గమనిస్తాను. సాక్ష్యం లేకుండా రేఖకు చెబితే ఇది పట్టించుకోదని భ్రమరాంబ మనసులో అనుకుంటుంది. మరోవైపు ఐషు వాగిన వాగుడుకు ఎవరికైనా డౌట్ వచ్చిందంటావా అని రాజు అంటాడు. దాని గురించి ఆలోచించట్లే. తనకు మంచి చేయాలని చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటుంది. రోజురోజుకీ తన ప్రవర్తన దిగజారిపోతుందని ఇందు అంటుంది.
ఈరోజు ఇంట్లో వాళ్లందరిమీద విరుచుకుపడిందని ఇందు బాధపడుతుంది. బావ నాకు మాకు అక్క కావాలి అని రాజును అడుగుతుంది. తర్వాత రాజు బెడ్‌పై, ఇందు నేలపై పడుకోవడం అపర్ణ చూసి షాక్ అవుతుంది. అదే విషయం సుభాష్‌కు చెబితే వారిద్దరితో సత్యనారాయణ వ్రతం చేయిద్దాం. నిజంగా భార్యాభర్తలయితే చేస్తారని అంటాడు.
సత్యనారాయణ వ్రతానికి ఒప్పుకోను రాజు
సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నామని, గుడిలో ఏర్పాట్లు చేయిస్తున్నామని ఇందుతో అపర్ణ అంటుంది. అదే విషయం రాజుతో ఇందు కంగారుగా చెబుతుంది. సత్య నారాయణ వ్రతానికి రాజు ఒప్పుకోడు. ఇందు ఎక్స్‌ట్రా డబ్బులు ఇస్తానంటుంది. దేవుడు ముందు నటించలేను, సత్య నారాయణ వ్రతానికి రాను అని రాజు తెగేసి చెబుతాడు. దాంతో ఇందు చిక్కుల్లో పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.