Brahmamudi June 10th Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి వెయ్యి ఎపిసోడ్లు దాటినా ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ తో అభిమానుల్లో ఆసక్తి రేపుతూనే ఉంది. ఈరోజు ఎపిసోడ్ లో సీఈవోగా ఇంటికి తిరిగి వచ్చిన ఇందుని చూసి అపర్ణ, సుభాష్ మురిసిపోతారు. కానీ రేఖ మాత్రం ఆమె కేవలం ఓ వేలిముద్ర సీఈవో అని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రాజు ఆమెకు అండగా నిలుస్తాడు.
వెంకీకి డెలివరీ బాయ్ జాబ్ ఇప్పించిన నందు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జూన్ 10) ఎపిసోడ్ వెంకీకి నందు ఓ డెలివరీ బాయ్ ఉద్యోగం ఇప్పించే సీన్ తో మొదలవుతుంది. తెలిసిన వాళ్ల దగ్గర అతనికి ఉద్యోగం ఇప్పిస్తుంది. అతడు సాఫ్ట్ గా ఉన్నాడు.. డెలివరీలు చేయగలడా అని ఓనర్ సందేహపడినా.. వెంకీ అతనికి అభయమిస్తాడు. నెలకు పది వేల జీతం, ఒక్కో డెలివరీకి రూ.50 అదనంగా ఇస్తానని చెబుతాడు. జీతం విషయంలో అసంతృప్తి ఉన్నా.. చేయక తప్పని పరిస్థితుల్లో వెంకీ సరే అంటాడు. తర్వాత నందుకు థ్యాంక్స్ చెబుతాడు.
ఇందుని చూసి అపర్ణ, సుభాష్ ఫుల్ హ్యాపీ
ఇటు కంపెనీకి సీఈవో అయిన తర్వాత ఇంటికి వచ్చిన ఇందుని హారతి ఇచ్చి స్వాగతిస్తుంది అపర్ణ. అది చూసి రేఖ, భ్రమరాంబ కుళ్లుకుంటారు. ఇందుని నేనే సీఈవో చేశానని తెలియక తెగ మురిసిపోతోంది అని రేఖ అనుకుంటుంది. కంపెనీకి సీఈవో కావడం ఎంతో సంతోషంగా ఉంది.. ఇన్నాళ్లూ ఆ రేఖ కంపెనీని పూర్తిగా డౌన్ ఫాల్ చేసింది.. మళ్లీ నువ్వు పునర్‌వైభవం తీసుకురావాలి అని అపర్ణ చెబుతుంది. తాను పక్కన ఉండగా కచ్చితంగా ఇందుకి ఓటమే ఉండదని, అలాగే చేస్తుందని రాజు అంటాడు.
రేఖకు గట్టిగానే ఇచ్చిన రాజు
నువ్వే సీఈవో కావాలని గట్టిగా ప్రయత్నించావట కదా అని భ్రమరాంబ అంటుంది. అవును.. కానీ ఒక్క ఓటుతో ఓడిపోయాను.. అది కూడా రేఖ పిన్ని వల్లే.. కానీ ఓడిపోయినంత మాత్రాన నన్ను తక్కువ అంచనా వేయొద్దు అని రాజు అంటాడు. రేఖ పిన్ని చాలా తెలివైనదని, ఆమె అడుగు జాడల్లో నడుస్తానని చెబుతాడు.
{{/usCountry}}నువ్వే సీఈవో కావాలని గట్టిగా ప్రయత్నించావట కదా అని భ్రమరాంబ అంటుంది. అవును.. కానీ ఒక్క ఓటుతో ఓడిపోయాను.. అది కూడా రేఖ పిన్ని వల్లే.. కానీ ఓడిపోయినంత మాత్రాన నన్ను తక్కువ అంచనా వేయొద్దు అని రాజు అంటాడు. రేఖ పిన్ని చాలా తెలివైనదని, ఆమె అడుగు జాడల్లో నడుస్తానని చెబుతాడు.
{{/usCountry}}ఇందు సీఈవో అయిందని కొందరు కుళ్లుకుంటున్నారని రేఖ, భూషణ్, భ్రమరాంబలకు గట్టిగానే ఇచ్చుకుంటాడు. మిడిల్ క్లాస్ ఇంటి నుంచి రాజభవనానికి వచ్చాను.. ఇష్టపడిన ఇందును బలవంతంగా పెళ్లి చేసుకొని నా దారికి తెచ్చుకున్నాను.. నన్ను తక్కువ అంచనా వేయొద్దని మరోసారి గట్టిగానే చెబుతాడు.
సైన్ అంటూ దొరికిపోయిన ఇందు.. కవర్ చేసిన రాజు
అయితే ఇందు సీఈవో అయినా తన చెప్పు చేతల్లోనే ఉందని నిరూపించాలని చూసిన రేఖ.. తాను ఓ డాక్యుమెంట్ పంపిస్తాను సంతకం చేయమని అంటుంది. సరే పంపించండి సంతకం చేస్తానని ఇందు అనడంతో నీకు చదువు రాదు కదా సంతకం ఎలా చేస్తావని రేఖ, భ్రమరాంబ అడుగుతారు. అప్పుడే రాజు జోక్యం చేసుకొని ఆమె సంతకం అంటే వేలిముద్రే అని అంటాడు. మీరు ఎలా చెబితే అలాగే చేస్తానని ఇందు అంటుంది. ఎక్కడ వేలిముద్ర వేయమంటే అక్కడ వేస్తానని చెబుతుంది. అది విని అపర్ణ షాకవుతుంది.
ఇందుని నిలదీసిన అపర్ణ.. సపోర్ట్ చేసిన రాజు
లోనికి వెళ్లిన తర్వాత ఇందుని నిలదీస్తుంది అపర్ణ. ఇప్పటికీ దానికి భయపడుతున్నావా.. దీనికోసమేనా నిన్ను అంత కష్టపడి రేఖకు తెలియకుండా చదివించింది.. అది చెప్పినట్లు వింటే నువ్వు సీఈవో అయ్యి ఏం లాభం అని అపర్ణ అంటుంది. కానీ రాజు జోక్యం చేసుకొని ఇందుకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. మీ మనవరాలిని తక్కువ అంచనా వేయకండి.. చాలా డేంజర్.. ఆమె వేసే ప్లాన్స్ చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే అని అంటాడు. మీరేమీ భయపడకండి అంటూ అపర్ణ, సుభాష్ లకు అభయమిస్తాడు.
తప్పతాగి ప్లాన్ చెడగొట్టిన రాజు
మరుసటి రోజు ఇందును వేలి ముద్ర వేయాలంటూ ఓ డాక్యుమెంట్ ఇస్తుంది రేఖ. అది చదివి ఈ డీల్ జరిగితే కంపెనీకి తీవ్రంగా నష్టం కలుగుతుందని ఇందు ఆందోళన చెందుతుంది. అది చూసి నీకు చదువు రాదు కదా.. ఎందుకంత కంగారు పడుతున్నావని శేషు అంటాడు. అది విని షాక్ తిన్న ఇందు తప్పనిసరి పరిస్థితుల్లో వేలిముద్ర వేయబోతుంది. అప్పుడే తప్పతాగి రాజు ఎంట్రీ ఇస్తాడు. ఇందు వేలిముద్ర వేయకుండా అడ్డుకుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.