...
...
Next Story

బ్రహ్మముడి జూన్ 12 ఎపిసోడ్: దొంగ బంగారం డీల్ ఆపిన రాజు- సర్పంచ్ భర్త కథ చెప్పి, ఇకనుంచి తన అనుమతి- ఐ లవ్యూ చెప్పిన ఇందు

Brahmamudi Serial June 12th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 12వ ఎపిసోడ్‌‌లో ఇందుతో దొంగబంగారం డీల్‌పై వేలిముద్రలు వేసేందుకు రేఖ ట్రై చేస్తుంది. తాగి ఉన్న రాజు ఎంట్రీ ఇచ్చి డ్యాన్సులతో గోల చేస్తాడు. సర్పంచ్ భర్త కథను ఉదాహరణగా చెప్పి పేపర్స్ ముక్కలు చేసిన రాజుకు ఐ లవ్యూ చెబుతుంది ఇందు.

Published on: Jun 12, 2026, 08:37:13 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు చిరాకులో ఉన్నానంటే నీ చిరాకు నాకు తెలుసు, నీ బాధ మర్చిపోడానికి మందు తీసుకొచ్చానని శేషు అంటాడు. నువ్వు సూపర్ మామ. ఇక్కడ అర్థం చేసుకునేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని శేషును తెగ పొగుడుతాడు రాజు.

రాజు, శేషు డ్రింకింగ్

బ్రహ్మముడి సీరియల్ జూన్ 12 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 12 ఎపిసోడ్

ఇది చూడగానే ఇప్పటివరకు పడిన బాధ హుష్ కాకిలా పోయిందని రాజు అంటాడు. రాజు, శేషు ఇద్దరు మందు తాగుతారు. ఇందు భోజనం రెడీ చేస్తుంది. ముందు ఈ పేపర్స్ మీద నువ్వు వేలిముద్రలు వేస్తే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని సింగపూర్ దొంగ బంగారం డీల్‌కు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తుంది రేఖ.

అదేం డీల్ అయింటుందని అపర్ణ అనుకుంటుంది. సరేనన్న ఇందు పేపర్స్ తీసి చదువుతుంది. నువ్వు చదువుకున్నట్లు వేరే చోట పోజు ఇవ్వే అని భ్రమరాంబ అంటుంది. అవును కదా చదువుతున్నానేంటీ. హమ్మయ్య పిన్ని కాపాడిందని ఇందు మనసులో అనుకుంటుంది. ఇందును చదవనివ్వు భ్రమరం అని తప్పతాగిన శేషు ఎంట్రీ ఇస్తాడు.

చదువు రాకపోయిన చదువుతున్నట్లు నటించని, సీఈఓ కదా చదువుతున్నట్లు పేపర్స్ అటు ఇటు తిప్పుతూ ప్రాక్టీస్ చేయమని శేషు అంటాడు. దానికి భ్రమరాంబ, రేఖ నవ్వుతారు. ఒక్కో పేపర్‌ను క్షుణ్ణంగా చదువుతున్నట్లు ప్రాక్టీస్ చేయమని శేషు అంటాడు. ఆ డీల్ చూసి ఇందు షాక్ అవుతుంది. ఈ డీల్ చేస్తే కంపెనీ పరువుపోతుంది. చాలా నష్టమొస్తుంది. రేఖ ఆంటీ కావాలనే సంతకం చేయిస్తుందని ఇందు అనుకుంటుంది.

తప్పతాగి రాజు ఎంట్రీ

ఇందు వేలిముద్రలు వేస్తుండగా.. తాగిన రాజు వన్ సెకన్ అని ఎంట్రీ ఇస్తాడు. అల్లుడు నీ ఎంట్రీ అదిరిపోయిందని శేషు అంటాడు. గబ్బర్ సింగ్ పాటపై రాజు డ్యాన్స్ చేస్తూ అందరి దగ్గరికి వెళ్తాడు. మరదలు స్వాతితో డ్యాన్స్ చేస్తాడు. ఐశ్వర్య చిరాకు వస్తుందని, వాసన వస్తున్నట్లుగా చూస్తుంది. నీ గురించి ఇక్కడ చెబితే రోజులు గడుస్తాయని కౌంటర్ ఇస్తాడు రాజు.

నేను లేకుండా ఇందుతో సంతకం ఎలా చేయిస్తారని రాజు అంటాడు. నీకేం సీఈఓ గురించి తెలుసని భ్రమరాంబ అంటే.. నా భార్య దగ్గర నేర్చుకుంటానని రాజు అంటాడు. తర్వాత బలపం పట్టి భామ ఒళ్లో పాటకు డ్యాన్స్ రాజు, ఇందు డ్యాన్స్ చేస్తారు. రేఖ ఆపమని అరుస్తుంది. నువ్వేంటేనే డీల్‌పై సంతకం పెట్టాలా. అసలు నీకేం తెలుసని, అది తెలుసుకుని లక్షలు సంపాదిస్తావా అని కోపంగా అరుస్తాడు భూషణ్.

సర్పంచ్ ఉదాహరణ

నా ఇగో హర్ట్ అయింది సాంగ్ పెట్టమని రాజు అంటే.. నాకు బామ్మర్ది అవుతాడు పెట్టలేను అని శేషు అంటాడు. రాజు గట్టిగా అరవడంతో నీ ఇగో కంటే నా బామ్మర్ది ఎక్కువ కాదని పైసా వసూల్ సాంగ్ పెడతాడు శేషు. భూషణ్ చుట్టూ చేరి రాజు, స్వాతి, శేషు డ్యాన్స్ చేస్తారు. చిల్లర వాడిలా చేస్తున్నావేంటీ అని రేఖ అంటే.. నోరు జారకని బాబాయ్‌కి వార్నింగ్ ఇస్తాడు రాజు.

నా భార్య సీఈఓ అయితే నేను కూడా సీఈఓ అయినట్లేగా. ఊరిలో భార్య సర్పంచ్ అయితే భర్తే కదా చూసుకుంటాడు. ఇక్కడ కూడా అలాగే అని పేపర్స్ చెక్ చేస్తానంటాడు రాజు. రాజు పేపర్స్ తీసుకుంటే రేఖ ఇవ్వమని లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది. నా హ్యాండ్ పవర్ ఎలా ఉంటుందో పిన్నికి చెబుతావా అని భ్రమరాంబతో అంటాడు రాజు.

అమ్మో వద్దని భ్రమరాంబ అంటుంది. ఆ డాక్యుమెంట్ పేపర్స్ చదివిన రాజు అమ్మో అంటూ షాక్ అవుతాడు. వామ్మో ఏంటిది. ఇన్ని తప్పులు ఉన్నాయేంటీ. పిన్ని.. ఈ డీల్ చేసి కంపెనీ పరువు పోగొట్టి కంపెనీకి నష్టాలు తెప్పిద్దామనుకుంటున్నారా అని ఆ పేపర్స్ ముక్కలు చేస్తాడు రాజు. ఇకనుంచి ఏ డీల్ చేయాలన్న నా పర్మిషన్ కావాలి. నా భార్యను సీఈఓగా నేను ముందుకు తీసుకెళ్తాను అని రాజు అంటాడు.

రాజుకు ఐ లవ్యూ

దాంతో రేఖ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. తర్వాత గదిలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి ఐ లవ్యూ చెప్పి హగ్ చేసుకుంటుంది. దాంతో రాజు తెగ సంబరపడిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks