...
...
Next Story

బ్రహ్మముడి జూన్ 18 ఎపిసోడ్: లక్కీ నమ్మకద్రోహం- ఇందు పార్టీకి రాజు తల్లిదండ్రులు- నిజం తెలిసిపోయిందా అని అడిగిన లక్ష్మీ

Brahmamudi Serial June 18th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 18వ ఎపిసోడ్‌‌లో రాజుకు తాగించి నిజం కక్కిస్తాడు లక్కీ. అదంతా ఐశ్వర్య వీడియో తీస్తుంది. వెంకీ చాలా డెలివరీలు చేసి లంచ్ కూడా చేయలేక పస్తులుంటాడు. కంపెనీ పార్టీకి రాజు తల్లిదండ్రులు వస్తారు. రాజుకు నిజం తెలిసిపోయిందేమోనని లక్ష్మీ భయపడుతుంది

Published on: Jun 18, 2026, 08:36:36 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ కాళ్లకు తల్లి లక్ష్మీ మందు రాస్తుంది. ఈ కష్టాలు ఇంకొన్ని రోజులే. త్వరలోనే మంచి జాబ్ సంపాదిస్తాను అని వెంకీ అంటాడు. అదేంట్రా ఇది మంచి జాబే కదా అని చలపతి అంటే.. ఇప్పుడు ఏఐ ట్రైనింగ్ తీసుకుంటున్నా కదా. అప్పుడు ఇంకా మంచి జాబ్ వస్తుందని వెంకీ అంటాడు.

నీ పెళ్లి పెద్దా మిరాకిల్

బ్రహ్మముడి సీరియల్ జూన్ 18 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 18 ఎపిసోడ్

మరోవైపు రాజుతో లక్కీ మందు సిట్టింగ్ వేస్తాడు. ఐశ్వర్య సీక్రెట్‌గా చూస్తుంది. రాజును మాటలో పెట్టి నీ లైఫ్‌లో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. నీ పెళ్లి పెద్ద మిరాకిల్ కదా అని లక్కీ అంటాడు. అసలు ఇందుతో పెళ్లి ఎలా జరిగింది. తను నిన్ను ఎలా పెళ్లి చేసుకుందని లక్కీ అడుగుతాడు.

అసలు మా పెళ్లే జరగలేదు. మా పెళ్లి అనేది అబద్ధం అని రాజు చెబుతాడు. అదంతా ఐశ్వర్య లక్కీకి కూడా తెలియకుండా వీడియో తీస్తుంది. అదేంట్రా ఆ ఇంట్లో భార్యాభర్తలుగానే ఉంటున్నారుగా. నేను కూడా పెళ్లి చేసుకున్నారనే అనుకుంటున్నా అని లక్కీ అంటాడు. అలా అనుకోవాలనే నటిస్తున్నాం. అవసరాల కోసం నటిస్తున్నాం. అందులో నేను వేస్తున్న పాత్ర పేరు అద్దె మొగుడు అని రాజు అంటాడు.

ఈ పాత్రకు పేమెంట్ ఎక్కువగా వస్తుందిగా. నేను డబ్బులు తీసుకుని అద్దె మొగుడుగా చేస్తున్నా అని రాజు చెబుతాడు. డబ్బుల కోసం చేస్తున్నావా. మరి తనెందుకు ఇలా చేస్తుందని లక్కీ అడుగుతాడు. ఆ ఇంటికి తన ఇంట్లోవాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తుంటే నాతో ఇలా నాటకం వేయించింది. ఇప్పుడు అంత క్లియర్ అయినట్లేనా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ మామ అని రాజు అంటాడు.

లక్కీ నమ్మకద్రోహం

వెంకీకి బాస్ కాల్ చేసి త్వరగా రమ్మని, చాలా డెలివరీలు ఉన్నాయని అంటాడు. సరేనని వెంకీ అంటాడు. తల్లిదండ్రులు టిఫిన్ చేయమంటే వెళ్తానని లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తాడు వెంకీ. వాడిలో చాలా మార్పు కనిపిస్తుందని చలపతి, లక్ష్మీ డౌట్ పడతారు. వీడు ఇలా కష్టపడుతుంటే పెద్దోడు అస్సలు పట్టించుకోవట్లేదు అంటాడు చలపతి.

మరోవైపు పార్టీకి ఇంత రిచ్‌గా రెడీ అవడం అవసరమా అని ఇందును అడుగుతాడు రాజు. దాంతో ఇందు షాక్ అవుతుంది. ఇంతలో రాజుకు చలపతి కాల్ చేస్తాడు. తండ్రి కాల్ రాజు కట్ చేస్తాడు. మళ్లీ కాల్ చేస్తే రాజు కట్ చేస్తాడు. మీ నాన్న కంగారుపడతారు. లిఫ్ట్ చేసి మాట్లాడమని ఇందు అంటుంది. ఆయన డబ్బు కోసమే చేసి ఉంటారు అని రాజు అంటాడు.

పస్తులున్న వెంకీ

మీ అమ్మనాన్న అలాంటి వాళ్లు కాదు అని ఇందు అంటుంది. నాకు మా నాన్న చిన్నప్పటినుంచి తెలుసు. చిన్నప్పటినుంచి నన్ను సాధిస్తూనే ఉన్నాడు అని రాజు అంటాడు. మరోవైపు వెంకీ డెలివరీలు చేస్తుంటాడు. ఒకతను 10 రూపాయల టిప్ ఇస్తాడు. ఓ చోట కూర్చుని లంచ్ తినడం మొదలుపెట్టగానే బాస్ కాల్ చేసి వెంకీని త్వరగా రమ్మంటాడు.

తర్వాత కాసేపటికి ఈరోజు అన్ని డెలివరీలు చేసేశాను. అమ్మ పెట్టిన లంచ్ తినేసి కోచింగ్‌కు వెళ్దామని అనుకుంటాడు వెంకీ. లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే అది వాసన వస్తుంది. అన్నం పాడవుతుంది. అన్నం పక్కన పడేసి ఆకలేస్తుందని, నీళ్లతో కడుపు నింపుకుంటాడు వెంకీ. అది నందు చూస్తుంది. అన్నం తినే టైమ్ కూడా దొరకలేదా అని నందు అడుగుతుంది.

జరిగింది చెబుతాడు వెంకీ. అలా వెంకీ పస్తులు ఉంటాడు. మరోవైపు స్వరాజ్ కంపెనీ క్లైంట్స్‌కు ఇందువాళ్లు పార్టీ ఇస్తారు. ఆ పార్టీకి రాజు తల్లిదండ్రులు చలపతి, లక్ష్మీ వస్తారు. అపర్ణను కలిసి రాజు గురించి అడుగుతారు.

పార్టీలోకి రాజు తల్లిదండ్రులు

పంపిస్తానని రాజు దగ్గరికి వెళ్లి అపర్ణ చెబుతుంది. రాజు వెళ్లి మాట్లాడుతాడు. నీకు నిజం తెలిసిపోయిందా అని లక్ష్మీ కంగారుగా అడుగుతుంది. భయపడుతుంది దాంతో రాజు షాక్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks