...
...
Next Story

బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: కావ్య డిజైన్లతో ఇందు ప్లాన్.. రాజుకి పేమెంట్.. భార్యను మోటివేట్ చేసిన అద్దె మొగుడు

Brahmamudi June 26 Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 26 ఎపిసోడ్ లో తన తల్లి కావ్య వేసిన ప్లాన్స్ ను ఇందు బయటకు తీస్తుంది. వాటిని హర్ష వద్దని అనడంతో ఇక లాభం లేదనుకొని మనమే డిజైన్లు వేద్దామని భార్యను మోటివేట్ చేస్తాడు రాజు.

Published on: Jun 26, 2026, 08:10:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఇందు, రేఖ ఎత్తుకుపైఎత్తులతో సాగిపోయింది. హర్ష అడిగిన డిజైన్ల డెడ్ లైన్ దగ్గర పడినకొద్దీ ఉత్కంఠ పెరిగేలా ఈ ఎపిసోడ్ నడిచింది. తన తల్లి కావ్య డిజైన్లతో ఇందు వేసిన ప్లాన్ వర్కౌట్ కాదు. దీంతో అద్దె మొగుడు రాజు మోటివేట్ చేసి ఇందునే స్వయంగా రంగంలోకి దింపుతాడు.

రాజుకు పేమెంట్ ఇచ్చిన ఇందు

బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: కావ్య డిజైన్లతో ఇందు ప్లాన్.. రాజుకి పేమెంట్.. భార్యను మోటివేట్ చేసిన అద్దె మొగుడు
బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: కావ్య డిజైన్లతో ఇందు ప్లాన్.. రాజుకి పేమెంట్.. భార్యను మోటివేట్ చేసిన అద్దె మొగుడు

హర్ష ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం అందరికీ పంచి పెట్టేయడంతో ఇందుపై రాజు మండిపడే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జూన్ 26) మొదలవుతుంది. అయితే నీకోసం ముందే డబ్బు తీసి ఉంచానంటూ అతని పేమెంట్ క్లియర్ చేస్తుంది ఇందు.

దీంతో రాజు ఖుష్ అవుతాడు. అయితే ఆమె చూడకుండా కాస్త నొక్కి తక్కువ ఉన్నాయని చెబుదామని ప్లాన్ వస్తాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో సరిగానే ఉన్నాయని చెప్పి లోపల పెట్టుకుంటాడు. ఇక నుంచి హర్ష ప్రాజెక్ట్ డెలివరీపై దృష్టి పెడదామని అంటాడు.

రేఖకు భ్రమరాంబ, భూషణ్ క్లాస్

మరోవైపు ఇందు ఇచ్చిన షాక్ తో భ్రమరాంబ, భూషణ్ లలో టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో అనుకుంటే చివరికి రూ.5 లక్షలు మిగిలాయని భ్రమరాంబ నిట్టూరిస్తుంది. ఇందుని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదంలో పడతామని అంటుంది. సీఈవోను చేయగానే నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదని రేఖని రెచ్చగొడుతుంది. అటు భూషణ్ కూడా అదే అంటాడు. ఇప్పటికీ ఉద్యోగులను తనవైపుకు తిప్పుకుంది.. రేపు మన అవసరం లేదని వాళ్లకు అనిపిస్తే కంపెనీలో ఎవరూ మనల్ని పట్టించుకోడు అని అంటాడు.

రేఖ కొత్త ప్లాన్.. ఇందుకి బుద్ధి చెబుతానంటూ..

అటు ఆఫీసుకు వెళ్లిన ఇందు, రాజు.. శృతిని డిజైన్ల గురించి అడుగుతారు. అప్పటికే ఆమె కొన్ని డిజైన్లు వేస్తుంది. కానీ అవి ఇందుకి నచ్చవు. గుడిలో అమ్మవారికి నగలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.. దూరం నుంచి చూసిన భక్తులకు కూడా బాగా కనిపించేలా ఉండాలి.. అభిషేకాలు చేసినా పాడవకుండా దృఢంగా ఉండాలంటూ చెబుతూ వెళ్తుంది.

అవన్నీ విన్న శృతి.. మిమ్మల్ని చూస్తే మీ అమ్మగారు కావ్యనే గుర్తుకు వస్తుందని అంటుంది. ఆమె వేసిన డిజైన్లు ఉన్నాయా అని ఇందు అడిగితే.. మీ ల్యాప్‌టాప్ లో ఉంటాయని చెబుతుంది. ఇదంతా దూరంగా ఉండి వింటుంది రేఖ. ఇందు దూకుడు చూస్తుంటే పని పూర్తి చేసేలానే ఉందని భూషణ్ అంటే.. దానికి అంత సీన్ లేదు.. కావ్యకు ఉన్న తెలివి దీనికి లేదు అని కొట్టిపారేస్తుంది.

కావ్య డిజైన్లను పంపిన ఇందు.. వద్దన్న హర్ష

తర్వాత తన క్యాబిన్లోకి వెళ్లిన ఇందు.. తన ల్యాప్‌టాప్ లో ఉన్న కావ్య డిజైన్లను చూస్తుంది. రాజుకి చూపిస్తుంది. వీటినే హర్షకు పంపిద్దామా అని అంటే.. మరోసారి ఆలోచించమని రాజు అంటాడు. ఏం కాదులే అంటూ కొన్ని డిజైన్లను సెలెక్ట్ చేసి హర్షకు పంపిస్తుంది ఇందు.

వాటిని చూడగానే ఇవి కావ్య వేసిన డిజైన్లు కదా అనుకొని ఇందుకి ఫోన్ చేస్తాడు హర్ష. ఇవి మీ అమ్మగారు వేసిన డిజైన్లు కదా.. గతంలో ఆమె డిజైన్లు కొన్నింటిని కొన్ని ఆలయాల్లో వాడాము.. అవే వద్దు.. కొత్తగా ప్రయత్నించండి అని హర్ష చెప్పడంతో ఇందు ఉసూరుమంటుంది. ఇక లాభం లేదనుకొని మనమే డిజైన్లు వేద్దామని రాజు చెప్పినా ఇందు పట్టించుకోదు.

లక్ష కావాలన్న ఐశ్వర్య.. క్లాస్ పీకిన రేఖ

మరోవైపు రేఖ టెన్షన్ లో ఉండగా తనకు ఓ రూ.లక్ష కావాలని వస్తుంది ఐశ్వర్య. దీంతో రేఖకు ఒళ్లు మండిపోతుంది. ఆమెకు క్లాస్ పీకుతుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెబుతుంది. అసలు డబ్బు ఏం చేస్తున్నావ్.. రూ.10 లక్షలు ఏం చేశావని నిలదీయడంతో ఐశ్వర్య చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. తర్వాత ఇందు గడువులోపు ఆ డిజైన్లు తయారు చేయకుండా ఏం చేయాలా అని రేఖ మళ్లీ ఆలోచనలో పడుతుంది.

శృతి డిజైన్లకు ఇందు నో.. సొంతంగా వేద్దామన్న రాజు

అటు ఇందుకి మరిన్ని డిజైన్లను శృతి పంపిస్తుంది. కానీ వాటిని కూడా వద్దని అంటుంది ఇందు. మీరు మరింత బాగా చేయగలరని ఎంకరేజ్ చేస్తుంది. ఆమె సరే ప్రయత్నిస్తానని ఫోన్ పెట్టేస్తుంది. దీంతో రాజు రంగంలోకి దిగి ఇందుని మోటివేట్ చేస్తాడు.

మనమే డిజైన్లు ట్రై చేద్దాం.. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు.. బాగుంటే డీల్ పూర్తవుతుంది.. లేదంటే మన ప్రయత్నం చేయలేదన్న గిల్టీ ఫీలింగ్ ఉండదు అని ఇందుకి చెబుతుంది. దీంతో ఆమె సరే అంటుంది. ఇద్దరూ కలిసి డిజైన్లు గీసే పని మొదలుపెడతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe