Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ఇందు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అటు నందు వెంకీకి అండగా నిలవడంలాంటి సీన్లతో ఎమోషనల్ గా సాగిపోయింది. అయితే రాజుపై రేఖ ప్రతీకారం తీర్చుకోవడానికి తల్లిదండ్రులను పావులుగా వాడుకునే ప్రయత్నానికి తెరలేపింది.
ఇంట్లో పని మనుషులుగా రేఖ, భ్రమరాంబ

రాజు ఇచ్చిన షాక్ తో రేఖ, భ్రమరాంబ ఆవేశంతో రగిలిపోయే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జూన్ 30) ఎపిసోడ్ ప్రారంభమైంది. రాజుని ఇలాగే వదిలేస్తే ఇంట్లో మీరు పనిమనుషులుగా మారడం ఖాయమని, అది ఊహించుకోండని శేషు అంటాడు. ఇద్దరూ ఇమాజినేషన్ లోకి వెళ్లిపోతారు.
అపర్ణ, సుభాష్ కాలు మీద కాలేసుకొని ఆర్డర్ వేస్తుంటే రేఖ కాఫీ తెచ్చివ్వడం, భ్రమరాంబ ఇల్లు తుడవడంలాంటి సీన్లు కనిపిస్తాయి. ఆ ఊహకే వాళ్లు భయపడిపోతారు.
రాజుపై ప్రతీకారంతో రగిలిపోయిన రేఖ
దీంతో రాజుపై రేఖ ప్రతీకారంతో రగిలిపోతుంది. శేషుని తిట్టి పంపించేస్తుంది. అతన్ని తిట్టి లాభం లేదని, ఇందుని నువ్వు సీఈవోని చేస్తే.. రాజు పెత్తనం చెలాయిస్తున్నాడని, ఈరోజు నీ అవసరం లేకుండా డీల్ కుదుర్చుకున్నారని, ఇక వాడి కన్ను ఇంటి మీద పడుతుందేమో అని భూషణ్, భ్రమరాంబ అంటారు. కానీ రేఖ మాత్రం ఓడిపోతే ఏడుస్తూ కూర్చునే రకం తాను కాదని, వాడు తనకు ఇచ్చిన గిఫ్ట్ కు పదింతల గిఫ్ట్ ఇస్తానని శపథం చేస్తుంది.
జాబ్ గురించి వెంకీని నిజం చెప్పేయమన్న నందు
మరోవైపు డెలివరీ చేస్తున్న తనను తల్లిదండ్రులు చూసేశారేమో అని వెంకీ టెన్షన్ పడుతుంటాడు. అతన్ని నందు ఓదారుస్తుంది. ఎప్పటికైనా నిజం తెలియక తప్పుదు.. అందుకే నువ్వే అసలు నిజం చెప్పెయ్ అని అంటుంది. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఇప్పుడీ పని చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేరని వెంకీ అంటాడు. తనకోసం ఇంట్లో వాళ్లు చేసిన త్యాగాల గురించి చెబుతాడు.
{{/usCountry}}మరోవైపు డెలివరీ చేస్తున్న తనను తల్లిదండ్రులు చూసేశారేమో అని వెంకీ టెన్షన్ పడుతుంటాడు. అతన్ని నందు ఓదారుస్తుంది. ఎప్పటికైనా నిజం తెలియక తప్పుదు.. అందుకే నువ్వే అసలు నిజం చెప్పెయ్ అని అంటుంది. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఇప్పుడీ పని చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేరని వెంకీ అంటాడు. తనకోసం ఇంట్లో వాళ్లు చేసిన త్యాగాల గురించి చెబుతాడు.
{{/usCountry}}తన అన్న రాజు తనను బాగా చూసుకున్నాడని అంటాడు. తను గవర్నమెంట్ స్కూలుకు వెళ్లి నన్ను మాత్రం ప్రైవేట్ స్కూలుకు పంపించాడు.. అతడు మామూలు బట్టలు వేసుకొని నాకు బ్రాండెడ్ బట్టలు తీసుకునేవాడు అని చెబుతూ ఎమోషనల్ అవుతాడు. ఎక్కువగా ఆలోచించకు.. ఏమీ కాదు.. రేపు మరొకరి ద్వారా నిజం తెలిస్తే బాగుండదు.. అందుకే నువ్వే నిజం చెప్పు అని నందు ధైర్యం చెబుతుంది.
రాజుని ప్రశంసలతో ముంచెత్తిన అపర్ణ.. సుభాష్ వార్నింగ్
ఇటు ఇంట్లో రాజు, ఇందు సాధించిన విజయంతో అపర్ణ, సుభాష్ చాలా సంతోషిస్తారు. రాజు వచ్చిన తర్వాతే ఇందులో ధైర్యం పెరిగిందని అతని ప్రశంసలతో ముంచెత్తుతుంది అపర్ణ. అయితే సుభాష్ మాత్రం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలని, గాయపడ్డ వాళ్లు ప్రతీకారం కోసం మరింత దూకుడుగా వస్తారని అంటాడు. భయం లేదని, తాను చూసుకుంటానని రాజు అంటాడు.
వెంకీని నిలదీసిన చలపతి, లక్ష్మీ
మరోవైపు ఇంటికి రాగానే వెంకీని చలపతి, లక్ష్మీ నిలదీస్తారు. నువ్వు డెలివరీ జాబ్ చేయడమేంటని అడగటంతో వెంకీ షాక్ తింటాడు. ముందే చెబితే నేనే ఏదైనా చేసేవాడిని కదా.. డెలివరీ జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి అని చలపతి ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ జాబ్ మానేయమని డిమాండ్ చేస్తాడు.
వెంకీకి అండగా నిలబడిన నందు
కానీ అప్పుడే అక్కడికి వచ్చిన నందు.. అతనికి అండగా నిలుస్తుంది. వెంకీ తప్పేమీ చేయడం లేదని, ఇప్పుడిప్పుడే లోకం తీరు ఏంటో అతనికి అర్థమవుతోందని అంటుంది. కానీ డెలివరీ జాబ్ చేస్తే చూసే వాళ్లు ఏమనుకుంటారు.. మా పరువు పోతుందని చలపతి అంటాడు. వెంకీ తప్పుడు పనేమీ చేయడం లేదని, బాధ్యతగా ఉంటున్నాడని, ఏదో ఒక రోజు చాలా ఎత్తుకు ఎదుగుతాడని నందు చెప్పడంతో సరే అని వాళ్లు వెంకీ ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తారు. దీంతో నందుకు థ్యాంక్స్ చెబుతాడు వెంకీ.
రాజు, ఇందు పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పిన రేఖ
ఇటు రాజు దగ్గరికి ప్రేమగా వెళ్లిన ఇందు తనకు ఎప్పుడూ అండగా ఉండాలని అడుగుతుంది. అలాగే అంటూ ఇందుకు ప్రామిస్ చేస్తాడు రాజు. అయితే ఇదంతా చూసిన ఐశ్వర్య.. వాళ్ల పెళ్లిలో ఏదో మతలబు ఉందని, అందుకే తల్లిదండ్రులను దాస్తున్నాడని రేఖతో చెబుతుంది. దీంతో రేఖ తన మనషులను రాజు ఇంటికి పంపించి మీ కొడుకు దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడు.. ఇందుని పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో వాళ్లు కంగారు పడతారు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.