బ్రహ్మముడి జూన్ 6 ఎపిసోడ్: ఐశ్వర్యకు తన ప్లాన్ చెప్పిన ఇందు- ఇందును కాపాడిన సైకిల్ నారాయణ- ప్లేట్ మార్చేసిన పరంధామయ్య

Brahmamudi Serial June 6th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 6వ ఎపిసోడ్‌‌లో ఇందును కారులో తీసుకెళ్తుండగా రోడ్డు మీద ఐశ్వర్యతో సైకిల్ నారాయణ గొడవ పడతాడు. ఇందును కిడ్నాప్ చేసి ఫోన్ లాక్కుంటుంది ఐశ్వర్య. మరోవైపు రాజును బోర్డ్ మెంబర్స్‌కు రేఖ పరిచయం చేస్తుంది. ఇందు గురించి పరంధామయ్య అడుగుతాడు.

Published on: Jun 6, 2026, 09:24:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కారులో ఇందు టెన్షన్ పడుతుంటే ఐశ్వర్య సంతోషిస్తుంది. సిటీ నుంచి చాలా దూరం వచ్చాం. రాకేష్ ఎక్కడ ఉన్నాడని ఇందు అడుగుతుంది. నాకేం తెలుసు అన్న ఐశ్వర్య.. లొకేషన్ పెట్టాడు. అలానే వెళ్తున్నా అని అంటుంది.

బ్రహ్మముడి సీరియల్ జూన్ 6 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 6 ఎపిసోడ్

ఐశ్వర్యతో గొడవ

మరోవైపు సైకిల్‌పై రేడియో పెట్టుకుని ఒకతను రోడ్డుపై వెళ్తుంటాడు. ఐశ్వర్య హారన్ కొడుతుంది. దాంతో అతను ఆపి రోడ్డు అడ్డంగా సైకిల్ పెట్టి ఐశ్వర్యతో గొడవ పడతాడు. హారన్ కొడుతుంటే పక్కకు జరగలాని బుద్ధి లేదా అని ఐశ్వర్య అంటే.. అతను వెటకారంగా మాట్లాడుతాడు.

ఇందు గొడవ వద్దని అంటుంది. సైకిల్ నెమ్మదిగా వెళ్తుంది, మెల్లిగా వెళ్లాలని నీకు తెలియదా అని నారాయణ అంటాడు. వెళ్లి సైకిల్ తీయమని ఐశ్వర్య అంటే.. నా ఇగో హర్ట్ అయిందని నారాయణ అంటాడు. రోడ్డుపై అలాగే సైకిల్‌తో వెళ్తాడు నారాయణ. ఓ మూల మలుపు దగ్గర ర్యాష్‌గా సైకిల్ ఓవర్ టేక్ చేసి ఐశ్వర్య వెళ్తుంది. అమ్మా ఇంగ్లీష్ దొరసాని నాకే టోకర ఇస్తావా. నిన్ను అస్సలు వదలను. నీ వెనుకే వస్తున్నా అని ఫాలో అవుతాడు సైకిల్ నారాయణ.

నా స్పీడ్ చూపిస్తానంటూ కారు వెనుకే ఫాలో అవుతాడు సైకిల్ నారాయణ. రౌడీలు ఉన్న ఓ ఇంటి దగ్గర కారు ఆపుతుంది ఐశ్వర్య. నారాయణకు ఐశ్వర్య మిస్ అవుతుంది. ఈరోజు వదిలేదే లేదనుకుంటాడు నారాయణ. రాకేష్ ఎక్కడ అని ఇందు అడిగితే.. ఐశ్వర్య నవ్వుతుంది. నిన్ను కిడ్నాప్ చేశాను. నువ్వు సీఈఓ అవడం నాకు ఇష్టం లేదు. రేఖ ఆంటీనే సీఈఓగా ఉండాలని ఐశ్వర్య అంటుంది.

రాజును పరిచయం చేసిన రేఖ

రాజుకు చెప్పాలని మొబైల్‌లో టైప్ చేస్తే ఐశ్వర్య లాగేసుకుంటుంది. ఆఫీస్‌కు వెళ్లాలని ఇందు అంటే.. నోరు మూసుకుని సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. సాయంత్రం నేనే తీసుకెళ్తాను అని ఐశ్వర్య అంటుంది. ఇందును బలవంతంగా రౌడీలు లాక్కెళ్తారు. మరోవైపు ఆఫీస్‌కు రేఖ, భూషణ్, రాజు వెళ్తారు. రాజు ముందుగా వెళ్లి ఫాలో అవ్వమంటాడు.

బోర్డ్ మీటింగ్‌లో సెంటర్ సీట్‌లో రేఖ కూర్చుంటే.. ఇంకో కుర్చీ తెచ్చుకుని రాజు కూర్చుంటాడు. ఈరోజు సీఈఓ పోటీలో నాకు పోటీగా నిలబడేది రాజునే అని రేఖ అంటుంది. రాజును అంతా వింతగాచూస్తే.. తను ఇందు భర్త అని రేఖ చెబుతుంది. బోర్డ్ మెంబర్స్‌ను రాజుకు పరిచయం చేస్తుంది రేఖ. వాళ్లతో ఇప్పుడే ఏది ఉన్న మాట్లాడు. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే సీఈఓ అవుతారు అని చెప్పి రేఖ వెళ్లిపోతుంది.

రేఖకు సపోర్ట్ చేసే ఇద్దరు మెంబర్స్ కూడా వెళ్లిపోతారు. పరంధామయ్య గారు చెప్పినట్లుగా మేము మీకే సపోర్ట్ చేస్తామని రాజు సైడ్ వాళ్లు కూడా వెళ్లిపోతారు. ఇందు ఎక్కడ అని రాజును పరంధామయ్య అడుగుతాడు. వచ్చేస్తుందని రాజు అంటాడు. ఇంత నెగ్లెక్ట్‌గా ఉండటం ఏంటీ. 12 గంటల్లోపు ఇక్కడ ఉండాలి. అలా అయితేనే మీరు అనుకుంది జరుగుతుందని పరంధామయ్య అంటాడు.

ప్లేట్ మార్చిన పరంధామయ్య

సరే నేను కనుక్కుంటా అని రాజు బయటకు వెళ్లి ఇందుకు రాజు కాల్ చేస్తాడు. ఇందుకు కాల్ వస్తుందని చెప్పి సైలెంట్‌గా ఉండమని బెదిరిస్తుంది ఐశ్వర్య. రాజు కాల్ లిఫ్ట్ చేసి ఈ సబ్‌స్క్రైబర్ బిజీగా ఉన్నారు. సాయంత్రం వరకు అందుబాటులోకి రారు అని ఐశ్వర్య చెబుతుంది. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టేస్తుంది. అది తెలిసి రాజు షాక్ అవుతాడు.

తర్వాత మనకు ఎలాగు ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పరంధామయ్య గారిని మనవైపు తిప్పుకుంటే మనమే సీఈఓ అయిపోవచ్చు. అప్పుడు పేమెంట్ కాదు చెక్కుల మీద సంతకాలు పెట్టి లక్షలు గుంజేయొచ్చు. హాస్పిటల్ డబ్బు పూర్తిగా కట్టేయొచ్చు అని రాజు అనుకుంటాడు. పరంధామయ్య వచ్చి అడిగితే.. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని చెబుతాడు రాజు.

దాంతో రాజును తిడతాడు పరంధామయ్య. ఇందు రాకపోతే నాకు సపోర్ట్ చేస్తారా. నేను సీఈఓ అవుతాను అని రాజు అడుగుతాడు. నీ వెకిలి చేష్టలు చూస్తుంటే నాకు తేడాగా ఉంది. కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లే అని పరంధామయ్య అంటాడు. ఇంతలో శ్రుతి వచ్చి మేడమ్ బోర్డ్ మీటింగ్‌కు రమ్మంటున్నారని చెబుతుంది. ఇదేంటీ పరంధామయ్య ప్లేట్ తిప్పేసాడని రాజు అనుకుంటాడు.

ఇందును కాపాడిన సైకిల్ నారాయణ

మరోవైపు ఐశ్వర్య కారును చూసిన సైకిల్ నారాయణ ఇంట్లోకి వెళ్తాడు. ఇందును ఐశ్వర్య కట్టేసింది నారాయణ చూస్తాడు. ఇందాక కలిసే వచ్చారు. ఇలా కట్టేసింది. వీళ్ల సంగతి ఏంటో చూద్దామని కిటికీలోనుంచి వాళ్ల మాటలు వింటాడు నారాయణ. నా అక్కవై ఉండి మోసం చేసి ఇలా తీసుకొస్తావా. ఇప్పుడు నేను బోర్డ్ మీటింగ్‌కు వెళ్లకుంటే మనల్ని నమ్ముకున్న వాళ్ల లైఫ్ స్పాయిల్ అవుతుందని ఇందు అంటుంది.

నేను వెళ్లకుంటే రేఖ సీఈఓ అవుతుంది. అప్పుడు కంపెనీ ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది. నీ అప్పులు కూడా తీర్చాలనుకుంటున్నా. మనందరి కోసం సీఈఓ అవ్వాలనుకుంటున్నా అని ఇందు తన ప్లాన్ చెబుతుంది. చాలా బాగా యాక్ట్ చేస్తున్నావ్. నిన్ను నా నుంచి ఎవరు కాపాడుతారు అని ఐశ్వర్య అంటే.. నేను వచ్చానుగా అని సైకిల్ నారాయణ ఎంట్రీ ఇస్తాడు.

రేఖకు ఇద్దరు సపోర్ట్ చేస్తారు. రాజుకు పరంధామయ్య సపోర్ట్ చేయడు. త్వరగా ఆఫీస్‌కు తీసుకెళ్లమని ఇందు అంటే.. నేను ఫాస్ట్‌గా తీసుకెళ్తాను అని ఇందును ఐశ్వర్య నుంచి కాపాడి బైక్‌పై తీసుకెళ్తాడు సైకిల్ నారాయణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More