...
...
Next Story

Brahmamudi March 12 Episode: పబ్‌లో ఇందు, రాజు.. స్వాతి మాట విని ఇరుక్కుపోయి.. వంట పని అని చెప్పి ఉద్యోగానికి..

Brahmamudi March 12 Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 12 ఎపిసోడ్ లో ఇందు, రాజు ఒకే పబ్ లో ఉంటారు. ఉద్యోగం అంటూ స్వాతి ఇచ్చిన ఆఫర్ తీసుకొని ఇందు ఇరుక్కుపోతుంది. ఇటు రేఖకు కూడా దొరికిపోయే పరిస్థితి కనిపిస్తుంది.

Published on: Mar 12, 2026, 07:00:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు పెద్ద ట్విస్టే ఇస్తుంది. శివరామ్ ఇంట్లో వంట పనికి అంగీకరిస్తుంది. దాని వెనుక ఉన్న కారణమేంటో నాన్నమ్మ అపర్ణకు చెబుతుంది. అయితే ఉద్యోగం మోజులో తెలియకుండానే స్వాతి ఇచ్చిన ఓ ఆఫర్ ఇందుని ప్రమాదంలో పడేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

అపర్ణకు షాకిచ్చిన ఇందు.. వంట పనికి రెడీ

Brahmamudi March 12 Episode: పబ్‌లో ఇందు, రాజు.. స్వాతి మాట విని ఇరుక్కుపోయి.. వంట పని అని చెప్పి ఉద్యోగానికి..
Brahmamudi March 12 Episode: పబ్‌లో ఇందు, రాజు.. స్వాతి మాట విని ఇరుక్కుపోయి.. వంట పని అని చెప్పి ఉద్యోగానికి..

బ్రహ్మముడి సీరియల్ గురువారం (మార్చి 12) ఎపిసోడ్ రేఖను అపర్ణ నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ఇందుని శివరామ్ ఇంట్లో వంట చేయడానికి పంపిస్తానని ఎలా చెబుతావ్.. దానికి ఎవరింట్లోనే పని చేయాల్సిన ఖర్మేంటి అని అడుగుతుంది. నువ్వు వంట చేయను అని రేఖ ముఖం మీదే చెప్పు అని ఇందుకి కూడా అపర్ణ చెబుతుంది. కానీ ఇందు మాత్రం షాకిస్తుంది.

తాను శివరామ్ ఇంట్లో వంట చేయడానికి వెళ్తానని అంటుంది. దీంతో అపర్ణను నోట మాట రాదు. రేఖ కూడా ఇందు అంత ఈజీగా ఒప్పుకోవడం చూసి షాక్ తింటుంది. దీని వెనుక ఏదైనా మతలబు ఉందా అని ఆలోచిస్తుంటే.. మనల్ని ఎదిరించి బతలేనన్న నిజం తెలుసుకొని ఉంటుందని భ్రమరాంబ అంటుంది.

పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఇందు.. శివరామ్ ముందే తెలుసని..

రేఖతో వాదిస్తున్న అపర్ణను ఇందు లోపలికి తీసుకెళ్తుంది. ఎందుకు ఒప్పుకున్నావంటూ అపర్ణ, స్వాతి ఆమెను నిలదీస్తారు. దీంతో వాళ్లకు దిమ్మతిరిగే షాకిస్తుంది ఇందు. శివరామ్ తనకు ఓ యాక్సిడెంట్ లో తెలుసని చెబుతుంది. అతడు కారు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు రావడం, ఇందు అతన్ని కాపాడటం చూపిస్తారు. తన ప్రాణమే కాదు తనపై ఆధారపడిన వందల కుటుంబాలను కాపాడావని, నీ రుణం ఎలా తీర్చుకోవాలని శివరామ్ ఆమెను అడుగుతాడు.

వంట ప్లాన్ తనదేనన్న ఇందు

ఇంటికి వచ్చే ముఖ్యమైన అతిథి ఆయనే అని ఇందుకి ఇంటి బయట శివరామ్ ను చూస్తే తెలుస్తుంది. అతడు ఇంట్లోకి రాకముందే ఇందుని కలుస్తాడు. నీ రుణం తీర్చుకోలేకపోయానని అతడు అంటే.. నన్ను మీ ఇంట్లో వంట మనిషిగా తీసుకెళ్తానని మాత్రం రేఖ ఆంటీకి చెప్పండి చాలు అని అడుగుతుంది. శివరామ్ కూడా అయోమయంలో సరే అంటాడు.

ఇందుకి స్వాతి ఉద్యోగం

శివరామ్ ఇంట్లో వంట పేరుతో తాను ఉద్యోగం చేయాలని అనుకుంటున్నట్లు ఇందు చెబుతుంది. అది విని అపర్ణ, స్వాతి సంతోషిస్తారు. కానీ నీ డిగ్రీ కూడా పూర్తి కాలేదు కదా.. మరి ఎలా ఉద్యోగం చేస్తావని స్వాతి అంటుంది. తన ఫ్రెండ్ అన్నయ్య ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, ఆమెను అడిగి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని స్వాతి అంటుంది. దీంతో ఇందులో సంతోషిస్తుంది.

తమ్ముడు వెంకీ వీక్‌నెస్ వాడుకున్న రాజు

మరోవైపు ల్యాప్‌టాప్ అమ్మిన రూ.50 వేలతో రూ.10 లక్షలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ పబ్ లో ఫ్రెండ్ తో కలిసి కూర్చొంటాడు రాజు. అక్కడ కూడా బిల్లు కట్టకుండా తాగుదామని ప్లాన్ చేస్తాడు. అలా అయితే మీ తమ్ముడు వెంకీతో బిల్లు కట్టిద్దామని, అతని వీక్ నెస్ తనకు తెలుసని రాజు ఫ్రెండ్ అంటాడు.

వెంటనే వెంకీకి ఫోన్ చేసి నీ గర్ల్‌ఫ్రెండ్ పబ్ లో ఉంది వెంటనే వచ్చెయ్ అనడంతో అతడు ఎగురుకుంటూ వచ్చేస్తాడు. అక్కడ రాజు కూడా ఉండటం చూసి షాక్ తింటాడు. వెంకీతో పబ్ లోనే సెల్ఫీ దిగిన రాజు.. నీ పర్స్ ఇవ్వకపోతే నాన్నకు ఈ ఫొటో పంపిస్తానని బెదిరిస్తాడు. దీంతో వెంకీ తన పర్సు ఇచ్చి వెళ్లిపోతాడు.

రాజు ఉన్న పబ్‌లోకే ఇందు

అటు ఇందు కూడా రాజు ఉన్న పబ్ లోకే వస్తుంది. స్వాతి ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య చెప్పిన ఉద్యోగం కోసమే ఆమె అక్కడికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆమెను చూపిస్తూ ఓ వ్యక్తి ఆ అమ్మాయే తాను చెప్పింది అని అంటాడు. నువ్వు అన్న కొత్త పిట్ట ఇదేనా అని మరో వ్యక్తి అంటాడు. అదంతా చూస్తుంటే ఇందు ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాజు ఉన్న పబ్ కావడంతో సీరియల్లో మరో ట్విస్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe