Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ వాళ్ల ముందు స్వాతి చేసిన పర్ఫామెన్స్ గురించి ఇందు, స్వాతి నవ్వుకుంటారు. మాములు యాక్టింగ్ కాదంటూ స్వాతిని మెచ్చుకుంటుంది ఇందు. వెళ్లిన ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడిగితే.. ఇదివరకు డబ్బులు గుంజుదామని చూసినవాడి వల్ల చివరిలో మిస్ అయిందని ఇందు చెబుతుంది.
మూడు కంపెనీల్లో జాబ్స్

ఇప్పుడేం చేస్తావని స్వాతి అడిగితే.. నీ ల్యాప్‌ట్యాప్ ఇస్తే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూస్ ఏ కంపెనీలో ఉన్నాయో చూసి అప్లై చేద్దాం. అవసరం ఉన్న వాళ్లు కాల్ చేస్తారుగా అని ఇందు అంటుంది. దాంతో ల్యాప్‌ట్యాప్ తీసుకొచ్చిన స్వాతి మూడు కంపెనీల్లో జాబ్స్ ఉన్నాయని, అప్లై చేశానని చెబుతుంది స్వాతి.
మరుసటి రోజు ఉదయం ఇంట్లో బైక్ కనిపించట్లేదని రాజ్‌ను లేపి తిడతాడు తండ్రి. బైక్ ఏం చేశావని తిడతాడు. రోజు రోజు జైలర్‌లా తయారవుతున్నావ్ అని రాజ్ అంటాడు. ఇంతలో రాజ్ ఫ్రెండ్ వస్తాడు. రాజ్ తండ్రి తిట్లు చూసి అక్కడే ఆగిపోతాడు. రాజ్ తమ్ముడు వెంకీ నవ్వుతాడు. బైక్ గురించి నాకు కాదు వాడికి తెలుసు. వాడి ఫ్రెండ్‌కు కావాలని అడిగి ఇప్పించాడు అని ఫోన్ చూపిస్తూ రాజ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.
సెల్ఫీ చూపిస్తానని బెదిరించి బాగా ఇరికించాడని రాజ్ ఫ్రెండ్ అనుకుంటాడు. జరిగింది మొత్తం చెప్పేసేయ్‌రా, భయపడకు అని రాజ్ అంటాడు. వెంకీ కాదనలేక ఫ్రెండ్‌కు బైక్ ఇస్తే.. వాడు తాగి రోడ్డెక్కాడు. అది కాస్తా పోలీస్ స్టేషన్‌లో ఉందని రాజ్ అంటాడు. అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయకని తండ్రి అంటాడు.
తమ్ముడితో ఫైన్
నాన్నకు చిన్నోడు అంటేనే ప్రేమ నాలాంటి పెద్దోడి సంగతి అంతే అని డ్రామా చేస్తాడు రాజ్. దాంతో రాజ్ కోసం చేసిన పనులు చెబుతాడు తండ్రి. ఇంతలో ఫ్రెండ్ వచ్చి బైక్ త్వరగా తీసుకురావాలని అంటాడు. బైక్ ఫైన్ కట్టేందుకు వెయ్యి రూపాయలు ఇవ్వు అని తమ్ముడు వెంకీని అడుగుతాడు. దాంతో చేసేదిలేక వెయ్యి పంపుతాడు వెంకీ.
{{/usCountry}}నాన్నకు చిన్నోడు అంటేనే ప్రేమ నాలాంటి పెద్దోడి సంగతి అంతే అని డ్రామా చేస్తాడు రాజ్. దాంతో రాజ్ కోసం చేసిన పనులు చెబుతాడు తండ్రి. ఇంతలో ఫ్రెండ్ వచ్చి బైక్ త్వరగా తీసుకురావాలని అంటాడు. బైక్ ఫైన్ కట్టేందుకు వెయ్యి రూపాయలు ఇవ్వు అని తమ్ముడు వెంకీని అడుగుతాడు. దాంతో చేసేదిలేక వెయ్యి పంపుతాడు వెంకీ.
{{/usCountry}}డీల్ గురించి రాజ్ ఫ్రెండ్ చెప్పడంతో సరేనంటాడు. మరోవైపు కిచెన్‌లో ఇందు ఫోన్ రింగ్ అవుతుంది. కానీ, దొరకదు. ఇంతలో శేషు వచ్చి మొబైల్ రింగ్ అవుతుందని అంటాడు. అప్పుడే శేషు ఫోన్ రింగ్ కావడంతో మీదేనని ఇందు చెబుతుంది. శేషు వెళ్లిపోతాడు. అలా ఇందు ఎస్కేప్ అవుతుంది. తర్వాత ఇందు తన ఫోన్ తీసుకుని రిటర్న్ కాల్ చేస్తే జాబ్ కోసం ఇంటర్వ్యూ ఉందని చెబుతారు.
వస్తానని ఇందు చెబుతుంది. ఇంతలో ఇందు భుజంపై చేయి పడుతుంది. ఇందు దడుసుకుని తెగ వణికిపోతుంది. తీరా చూస్తే అది అపర్ణ. అపర్ణ దేవి తెగ భయపెట్టావ్ అన అంటుంది. ఏమైందని అపర్ణ అంటే.. ఆఫీస్‌లో ఇంటర్వ్యూ ఉందని ఇందు చెబుతుంది. మరోవైపు రాత్రి మరో పార్టీ గురించి ఫోన్‌లో ఐశ్వర్య మాట్లాడుతుంది. అది విన్న స్వాతి తిడుతుంది.
ఎదురు తిరిగిన ఇందు
రాత్రి చేసిన దాని గురించి చెబుతుంది స్వాతి. నీ హద్దుల్లో ఉండు అని ఐశ్వర్య అంటే.. నేను హద్దుల్లోనే ఉన్నా. నిన్న పోలీస్ స్టేషన్‌లో నీ బిహేవియర్ ఎంత చీప్‌గా ఉందో తెలుసా అని స్వాతి అంటుంది. దాంతో కోపంగా స్వాతిని ఐశ్వర్య కొట్టబోతుంటే ఇందు వచ్చి చేయి పట్టుకుని ఆపుతుంది. ఐశ్వర్యకు ఎదురుతిరుగుతుంది ఇందు. అది రేఖ చూస్తుంది.
రేఖను చూసి మళ్లీ ఆగిపోతుంది ఇందు. అది చిన్న పిల్ల దాన్ని కొడతావేంటీ అని ఇందు అంటే.. నీలాగే నీతులు చెబుతుందని ఐశ్వర్య అంటే.. దారి తప్పుతుంది నువ్వు. ఒక తల్లికి పుట్టకపోయిన మనం తోడబుట్టినవాళ్లం అని ఇందు అంటుంది. చాలు ఆపు మా నాన్నను, నానమ్మను మీ అమ్మనాన్నే చంపారు. నిన్ను చూసినప్పుడుల్లా అదే గుర్తుకు వస్తుంది. నువ్వు నేను సమానం కాదు. నేను ఇంటి మహారాణి నువ్వు పని మనిషివి అని ఐశ్వర్య అంటుంది.
దాంతో అపర్ణ వచ్చి తిడుతుంది. పొగరుగా మాట్లాడటం కరెక్ట్ కాదని అంటుంది. మర్యాదగా మాట్లాడను, ఏం చేస్తావ్ అని ఐశ్వర్య అంటుంది. నానమ్మతో గౌరవంగా మాట్లాడమని అంటుంది ఇందు. ఛీ కొట్టిన కలుపుకుపోదామని వస్తారేంటీ అని ఐశ్వర్య అంటే.. వాళ్లు అంతేనని భ్రమరాంబ అంటుంది. ఐశ్వర్యకు సపోర్ట్ చేస్తావేంటీ అని స్వాతి అంటుంది.
ఐశ్వర్యను మార్చలేవు
తన మాటలతో స్వాతిని పాడు చేసిందని ఐశ్వర్య అంటుంది. వీళ్లను ఇంట్లో పెట్టుకోవడం కూడా తప్పే అని ఐశ్వర్య అంటే.. కరెక్టుగా చెప్పావ్ అని రేఖ ఎంట్రీ ఇస్తుంది. బతకమని వదిలేసిన బుద్ధి మాత్రం రాలేదు. నేను మాట్లాడతను నువ్వు వెళ్లు అని రేఖ అనడంతో ఐశ్వర్య వెళ్లిపోతుంది. శివరాం ఇంటికి వంట చేయడానికి వెళ్లాలిగా అని ఇందుకు గుర్తు చేసి పంపిస్తుంది రేఖ.
దాని అక్కే దాన్ని తిడుతుంటే చూడలేకపోతున్నావా. ఐశ్వర్యను మార్చలేవు. దానిలో ఉంది మా అన్న రక్తం అని అపర్ణతో రేఖ అంటుంది. గదిలోకి వెళ్లిన అపర్ణ కావ్య, స్వప్న, అప్పు ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటుంది. ఏమైందని సుభాష్ అడిగితే అదే చెబుతుంది. వాళ్ల పిల్లలు మాత్రం ఇలా ఉన్నారని బాధపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.