...
...
Next Story

Brahmamudi March 23rd Episode: బ్రహ్మముడి- రాజ్‌కు లక్కీ మోసం- రిచ్ అయ్యేందుకు కొత్త స్కెచ్- ఐశ్వర్యకు 10 లక్షల అప్పు!

Brahmamudi Serial March 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 23వ తేది ఎపిసోడ్‌లో అపర్ణ, సుభాష్ లేకుంటే తనకు చావుకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదని ఇందు అంటుంది. రాజ్ 5 లక్షల స్కామ్ ఫెయిల్ కావడంతో రిచ్ అయ్యేందుకు కొత్త స్కెచ్ వేస్తాడు. ఐశ్వర్య తనకు 10 లక్షల అప్పు ఇచ్చిన రాకేష్‌ను బతిమిలాడుతుంది.

Published on: Mar 23, 2026, 07:18:37 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మీరు లేనప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు అని ఇందు అంటుంది. నాకోసం అమ్మనాన్నలు చేసిన త్యాగాలు చాలు. మీకు ఏదైనా అయితే నేను జీవితాంతం మోయాలి. ఆ శిక్ష చావడం కంటే పెద్దది అని ఇందు అంటుంది.

5 లక్షల స్కామ్ ఫెయిల్

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 23వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 23వ ఎపిసోడ్

అలా అనకు, ఈ కుటుంబాన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్లందరికి నువ్వు భవిష్యత్తు కావాలి అని అపర్ణ అంటుంది. అలా కావాలంటే నువ్వు నాకు మాటివ్వాలి అని ఇందు అంటుంది. మరోవైపు తన రూ. 5 లక్షల స్కామ్ ఫెయిల్ అయిందని, ల్యాప్‌ట్యాప్స్ ఎందుకు పనికి రావని రాజ్ తిడతాడు. లక్కీ మాత్రం కవర్ చేసేందుకు మోటివేట్ చేస్తాడు.

దాంతో ఒక్కటి లాగిపెట్టి లక్కీ కొడతాడు. మనం మోసపోయామురా, కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కోల్పోయాం అని రాజ్ అంటాడు. రాజ్, లక్కీ గొడవ పడుతుండగా.. వాళ్ల ఫ్రెండ్ రాంబాబు రిచ్ కారులో దిగుతాడు. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. ఎంట్రీ సడెన్‌గా ఇంత మార్పు అని రాజ్ అడుగుతాడు. జస్ట్ పెళ్లి చేసుకున్నా అని అతను అంటాడు.

లైఫ్ అనేది చాలా సింపుల్‌రా, రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న, రిచ్ అయిపోయా అని తన భార్యను పిలుస్తాడు రాజ్ ఫ్రెండ్. ఆంటీలా ఉందని ఇద్దరు షాక్ అవుతారు. వయసుతో ఏముందిరా డబ్బు ముఖ్యం అని అతను అంటాడు. ఇక నేను కలవలేకపోవచ్చు. ఈ డబ్బు తీసుకుని నా మ్యారేజ్ పార్టీ అనుకుని ఎంజాయ్ చేయండి అని రాజ్‌కు డబ్బు ఫ్రెండ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

రిచ్ అమ్మాయిని చూసుకుందాం

ఇకనుంచి గుండె రాయి చేసుకుని మౌనంగా భరిస్తాను. కానీ, నువ్వు కూడా మాకు మాటివ్వు. మాకోసం ఆస్తి వదులోకాడనికి వీళ్లేదు. ఆ రేఖ చేతిలో ఓడిపోడానికి వీళ్లేదు. ఏం జరిగినా సరే మీ అమ్మనాన్నలు అనుకున్నది చేయాలి అని అపర్ణ మాటివ్వమంటుంది. అది నా చేతుల్లో లేదు. కాలమే సమాధానం చెప్పాలి అని దాటేసి వెళ్లిపోతుంది ఇందు.

అమ్మాయిల కోసం వెతుకుతుంటుంటే ఐశ్వర్య కారులో నుంచి దిగుతుంది. నన్ను రిచ్ చేయడానికి ఐశ్వర్య వచ్చిందని లక్కీ చెబుతాడు. నాకు కూడా తెలుసు కదా. నేను కూడా వస్తానని రాజ్ అంటే.. నువ్వు వస్తే నువ్వే మాట్లాడుతావ్. నేను చూస్తూ ఉండాలి. వద్దు. ప్రేమలో యుద్ధంలో ఏమైనా చేయొచ్చు అంటారు అని లక్కీ అంటాడు. కానీ, ఇలా మోసం చేయకూడదు అని రాజ్ అంటాడు.

ఐశ్వర్యకు 10 లక్షల అప్పు

మోసానికి కేరాఫ్ అడ్రస్‌రా మనం, ఇలాంటి డైలాగ్స్ వాడొద్దు. నేను వెళ్లి ట్రై చేసుకుంటా అని లక్కీ ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. ఐశ్వర్య రాకేష్ అనే వ్యక్తి దగ్గర కూర్చుంటుంది. నా దగ్గర రూ. 10 లక్షలు తీసుకుని వారంలో ఇస్తానని నెల గడిపేశావ్. నాకు ఎంత లాసో నీకు అర్థమవుతుందా అని రాకేష్ కోప్పడుతాడు. ఆ మాటలు చాటుగా లక్కీ వింటాడు.

ఐశ్వర్య ఏదో సమస్యలో ఉన్నట్లుంది అనుకుంటాడు. నేను బిజినెస్ మ్యాన్‌ని, నాకు డబ్బు ఇంపార్టెంట్. నీకు డబ్బు ఇచ్చింది మీ ఆంటీని చూసి. నేను వెళ్లి ఆమెను అడుగుతా అని రాకేష్ అంటాడు. దాంతో ఐశ్వర్య బతిమిలాడుతుంది. వీడు ఐశ్వర్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అని ఆలోచిస్తాడు లక్కీ. రెండు రోజుల టైమ్ ఇస్తున్నా. లేకుంటే మీ ఇంటి ముందు ఉంటాను అని రాకేష్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

దాంతో ఐశ్వర్య తల పట్టుకు కూర్చుంటుంది. బాగా టెన్షన్‌లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఓదారిస్తే సెట్ అవుతుందని వెళ్లి పలకరిస్తాడు లక్కీ. అసలు ఎవడ్రా నువ్వు అని అరుస్తుంది ఐశ్వర్య. బైక్‌పై డ్రాప్ చేసింది చెబుతాడు లక్కీ. నీ సమస్య ఏంటీ చెప్పు. నేను సాల్వ్ చేస్తాను అని లక్కీ అంటాడు. ఆ ముందు బిల్ కట్టు అని వెళ్లిపోతుంది ఐశ్వర్య.

ఇందుపై నిందలు

సరే అనుకున్న లక్కీ బిల్ 4 వేలు అని తెలిసి షాక్ అవుతాడు. తప్పదని కట్టేసి వెళ్లిపోతాడు. మరోవైపు అపర్ణ మన మాట వింటుందంటావా అని భ్రమరాంబ, రేఖ మాట్లాడుకుంటారు. ఇద్దరు కావాలని అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. తర్వాత వంట అస్సలు బాగాలేదని ఇందును నానా మాటలు అంటారు. నిందిస్తారు. అపర్ణ కోపంతో రగిలిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks