Brahmamudi Promo: టైలర్‌కు కాల్ చేసిన రేఖ, అడ్డంగా దొరికిపోయిన ఇందు- ఎగ్జామ్ స్క్వాడ్‌కి బెదిరింపులు, ఐశ్వర్య డిబార్!

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఐశ్వర్య చీట్ చేసి ఎగ్జామ్ రాయడం చూసిన ఇన్విజిలేటర్ వారిస్తాడు. అయిన ఐశ్వర్య వినకపోవడంతో ఎగ్జామ్ స్క్వాడ్‌కు కంప్లైంట్ చేస్తాడు. మరోవైపు రోడ్డు మీద ఇందును చూసిన రేఖ ఇంట్లో నిలదీస్తుంది. టైలర్ ఫోన్ నెంబర్‌ను రేఖ అడగడంతో ఇందు భయంతో వణికిపోతుంది.

Mar 8, 2026, 05:40:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఇందుకు, ఐశ్వర్యకు ఒకే గదిలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇందు మాస్క్ పెట్టుకుని ఉంటే ఫొటో ఐడెంటిఫై చేయాలని ఇన్విజిలేటర్ అంటాడు. దాంతో కాసేపు తటాపటాయించిన తర్వాత ఐశ్వర్యకు కనిపించకుండా కేవలం ఇన్విజిలేటర్‌కు మాత్రమే కనిపించేలా తన ముఖాన్ని మాస్క్ తీసి చూపిస్తుంది ఇందు.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

స్లిప్స్‌తో ఎగ్జామ్

దాంతో ఇందును ఎగ్జామ్ రాయడానికి ఇన్విజిలేటర్ ఒప్పుకుంటాడు. తీసుకొచ్చిన స్లిప్స్ చూస్తూ ఐశ్వర్య పరీక్ష రాస్తుంటుంది. అది చూసిన ఇన్విజిలేటర్ ఐశ్వర్యను లేపి కొప్పడతాడు. నేను ముందే చెప్పాను స్లిప్స్ ఉంటే పడేయమని, ఈసారి స్క్వాడ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని అరుస్తాడు ఇన్విజిలేటర్.

ఎవరికీ చెప్పకండి సర్ అంటూ ముందుగా బతిమిలాడుతుంది ఐశ్వర్య. అయిన ఇన్విజిలేటర్ ఒప్పుకోకపోవడంతో రివర్స్ అవుతుంది ఐశ్వర్య. తన ఇంటి గొప్పతనం గురించి చెబుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రెచ్చగొడుతుంది ఐశ్వర్య. డిబార్ అయితేనే నీలాంటి స్టూడెంట్స్‌కు బుద్ధి వస్తుందని అనుకున్న ఇన్విజిలేటర్ వెళ్లి ఐశ్వర్య చీటింగ్ చేసిన విషయం ఎగ్జామ్ స్క్వాడ్‌కు చెబుతాడు.

స్క్వాడ్‌ను బెదిరించిన ఐశ్వర్య

ఐశ్వర్య కూడా స్క్వాడ్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా చీటింగ్ చేస్తూ పరీక్ష రాయడం తప్పు కదా. పైగా ఇన్విజిలేటర్‌నే తిడతావా, నువ్వు కచ్చితంగా డిబార్ అని ఐశ్వర్యను అంటాడు ఎగ్జామ్ స్క్వాడ్. దాంతో రుద్రాణి గురించి, తన కుటుంబం గురించి చెప్పి ఎగ్జామ్ స్క్వాడ్‌ను బెదిరిస్తుంది ఐశ్వర్య.

మరోవైపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందు కారు డ్రైవర్‌ను ఆపిన షామింగ్ మాల్ చోటుకు వెళ్తుంది. అప్పుడే అటువైపు వెళ్తున్న రేఖ రోడ్డు మీద ఇందును చూసి షాక్ అవుతుంది. అసలు దీన్ని ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టొద్దని చెప్పానుగా. అయినా నా మాటను లెక్కచేయకుండా బయటకు వెళ్లిందా. చెబుతాను దీని సంగతి అని రేఖ అనుకుంటుంది.

వణికిపోయిన ఇందు

ఇందు కంగారు కంగారుగా ఇంట్లోకి వస్తుంది. తీరా హాల్లో రేఖ కూర్చుని ఉంటుంది. రేఖను చూసి ఇందు వణికిపోతుంది. మెల్లిగా రేఖకు తెలియకుండా తప్పించుకోవాలనుకుంటుంది. కానీ, రేఖ మాత్రం ఇందును పిలిచి ఎక్కడికి వెళ్లావ్, నేను ఇంటి గడప దాటకూడదని చెప్పానుగా అని అడుగుతుంది.

దాంతో ఇందు భయపడిపోతుంది. అపర్ణ వైపు చూస్తుంది. అటు ఏం చూస్తున్నావ్. నేను ఆఫీస్ నుంచి ఇంటి వస్తుండగా నువ్వు నాకు రోడ్డు మీద కనిపించావ్ అని రేఖ చెబుతుంది. దాంతో ఇందు ఉలిక్కిపడుతుంది. ఆ ఏరియాలో నీకెంటీ పని అని తాను ఎలా చూసిందో చెబుతుంది రేఖ.

అడ్డంగా బుక్కయిన ఇందు

దానికి స్వాతి తన డ్రెస్ కుట్టించుకుని రమ్మందని బ్యాగ్‌లో నుంచి డ్రెస్ తీసి చూపిస్తుంది ఇందు. ఆ డ్రెస్ చూసిన రేఖ కొద్దిసేపటికి ఆ టైలర్ షాప్ పేరు ఏంటీ, నాకు టైలర్ ఫోన్ నెంబర్ చెప్పు అని రేఖ అంటుంది. దాంతో ఇందు అడ్డంగా ఇరుక్కుంటుంది. షాక్ అయిన ఇందు కేవలం అడ్రస్ చెబితే వెళ్లానని, అతని ఫోన్ నెంబర్ తెలియదని అంటుంది.

దాంతో స్వాతిని పిలుస్తుంది రేఖ. టైలర్ షాప్ అతని ఫోన్ నెంబర్ ఉందా అని స్వాతిని అడిగితే.. ఉందని చెబుతుంది. స్వాతి నుంచి ఫోన్ తీసుకుని టైలర్‌కు రేఖ కాల్ చేస్తుంది. అలా ఇందు అడ్డంగా దొరికిపోతుంది. అదంతా చూస్తున్న అపర్ణ షాక్ అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More