...
...
Next Story

Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంటికి రాజు.. అపర్ణ, రేఖ షాక్.. రాజ్ తిరిగి వచ్చాడనుకొని..

Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఎదురైంది. రాజు ఏకంగా దుగ్గిరాల ఇంటికే వస్తాడు. అతన్ని చూసి అపర్ణ, రేఖ షాక్ తింటారు. రాజ్ తిరిగి వచ్చాడేమో అని వాళ్లు అనుకుంటారు.

Published on: Mar 25, 2026, 07:10:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు, లక్కీ కారులో ఐశ్వర్య తన నెక్లెస్ పారేసుకోవడం, దానిని తిరిగి ఇవ్వడం కోసం రాజు ఏకంగా దుగ్గిరాల ఇంటికే రావడం చూడొచ్చు. అటు ఇందు జాబ్ ప్రయత్నం మరోసారి విఫలమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

నెక్లెస్‌లు దొంగతనం చేసిన ఐశ్వర్య, భ్రమరాంబ

Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంటికి రాజు.. అపర్ణ, రేఖ షాక్.. రాజ్ తిరిగి వచ్చాడనుకొని..
Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంటికి రాజు.. అపర్ణ, రేఖ షాక్.. రాజ్ తిరిగి వచ్చాడనుకొని..

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మార్చి 25) ఎపిసోడ్ లో రేఖ తన కోసం తెచ్చిన నెక్లెస్ ను ఐశ్వర్య దొంగతనం చేసే సీన్ తో మొదలవుతుంది. అది భ్రమరాంబ చూస్తుంది. సొంత మేనకోడలే ఇలా చేయగా లేనిది తాను చేస్తే ఏంటని భ్రమరాంబ కూడా తన చేతివాటం చూపిస్తుంది. లాకర్ లో నుంచి మరో నెక్లెస్ కొట్టేస్తుంది.

జాబ్ ఇంటర్వ్యూకి ఇందు.. డిగ్రీ లేదని రిజెక్ట్

మరోవైపు ఇందు మళ్లీ జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. ఈసారి సరైన సమయానికే వెళ్లడంతో జాబ్ వస్తుందని అనుకుంటుంది. హెచ్‌ఆర్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తాడు. ప్రతిదానికి ప్రూఫ్ అంటూ అతడు తిక్కతిక్కగా మాట్లాడతాడు. తన తెలివితేటలతో ఇందులో అతన్ని ఇంప్రెస్ చేస్తుంది.

అయితే ఆమె సర్టిఫికెట్లను చూసే సమయంలో డిగ్రీ లేదని అడుగుతాడు. ఈ మధ్యే పరీక్షలు రాశానని, కచ్చితంగా పాసవుతానని ఆమె అంటుంది. కానీ డిగ్రీ లేకుండా జాబ్ ఇవ్వడం కుదరదని అతడు స్పష్టం చేస్తాడు. దీంతో ఇందు నిరాశగా వెనుదిరుగుతుంది.

ఐశ్వర్యకు రాజు, లక్కీ లిఫ్ట్.. ఫాలో అయిన ఇందు

అప్పుడే ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఇందు దూరం నుంచి ఐశ్వర్య ఆ కారు ఎక్కడం చూస్తుంది. పబ్ లో లక్కీని చూసి ఉండటంతో మళ్లీ ఇతని కారు ఎక్కుతోంది ఎందుకంటూ ఆటోలో ఆ కారును ఫాలో అవుతుంది. కారులో లక్కీ ఏం అడిగినా ఐశ్వర్య పట్టించుకోదు. పొగరుగా సమాధానం చెబుతుంది.

నందుకు సాయం చేసిన ఇందు

ఇటు కారును ఫాలో అవుతున్న సమయంలో ఆటోపైకి రౌడీల వెంట పడుతూ నందు అడ్డుగా వస్తుంది. ఇద్దరు రౌడీలను నందు కొట్టడం చూస్తుంది. ఒకడు ఆమెపైకి రావడంతో ఆటోలో ఉన్న ఇందు కంగారుగా బయటకు దిగి అతన్ని కొడుతుంది. ఆ ఇద్దరి నుంచి నందుని కాపాడుతుంది.

అది చూసి నందు ఆమెకు థ్యాంక్స్ చెబుతుంది. వీళ్లు అమ్మవారి నగలు దోచుకున్న దొంగలని, వీళ్లను పోలీస్ స్టేషన్ లో అప్పగించే వరకూ తన వెంటే ఉండాలని ఇందుని అడుగుతుంది నందు. ఆమె సరే అంటుంది. ఆ ఆటోలోనే వాళ్లు వెళ్తారు.

లక్కీ కారులో ఐశ్వర్య నెక్లెస్

ఐశ్వర్య లక్కీ కారు దిగుతుంది. టెన్షన్ లో ఉన్నట్లున్నావ్.. ఏదైనా సాయం కావాలా అని లక్కీ అడిగినా వద్దని చెప్పి వెళ్లిపోతుంది. కొంతదూరం వెళ్లాక బ్యాగు చూస్తే అందులో నెక్లెస్ కనిపించదు. ఎక్కడ పడిపోయిందో అంటూ ఆమె కంగారు పడుతుంది.

అటు రాజు, లక్కీ ఓ చోట కారు ఆపి కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అప్పుడే కారులో నెక్లెస్ కనిపిస్తుంది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కానీ దానిని తిరిగి ఇచ్చేద్దామనుకొని రాజు ఏకంగా దుగ్గిరాల ఇంటికే వచ్చేస్తాడు.

అప్పుడే ఆ ప్రమాదం గురించి సుభాష్ తో అపర్ణ మాట్లాడుతూ ఉంటుంది. స్వరాజ్ బాడీ మాత్రం కనిపించలేదని, అతడు ఎక్కడో చోట ఉండే ఉంటాడని, మనల్ని వెతుక్కుంటూ వస్తాడని అంటుంది. అప్పుడే రాజు ఇంట్లోకి వస్తాడు. అతన్ని చూసి అపర్ణ, రేఖ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks