...
...
Next Story

బ్రహ్మముడి మార్చి 2 ఎపిసోడ్: కావ్య, రాజ్ మళ్లీ వచ్చేశారు.. నందు, రాజుగా కొత్త లుక్స్.. సరికొత్త మలుపు తిరిగిన సీరియల్

Brahmamudi March 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ ఓ పెద్ద మలుపే తీసుకుంది. కావ్య, రాజ్ మళ్లీ నందు, రాజుగా తిరిగి రావడం విశేషం. దుగ్గిరాల ఫ్యామిలీని మళ్లీ నిలబెడతానని నందు శపథం చేస్తుంది.

Published on: Mar 2, 2026, 07:06:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ మార్చి 2 ఎపిసోడ్ ఊహకందని మలుపు తిరిగింది. కావ్య, రాజ్ చనిపోయిన తర్వాత వాళ్లు మళ్లీ ఒకప్పుడు పిల్లలుగా ఉన్న నందు, స్వరాజ్ రూపంలో తిరిగి వచ్చారు. గతం మరచిపోయి బస్తీలో పెరిగే స్వరాజ్ రాజుగా.. ఇటు దుగ్గిరాల ఇంట్లో నందు రూపంలో వాళ్లిద్దరూ రావడం విశేషం. దీంతో కథ మరో మలుపు తిరిగింది.

దుగ్గిరాల ఫ్యామిలీ ఫొటోలు తగలబెట్టేసిన రేఖ

బ్రహ్మముడి మార్చి 2 ఎపిసోడ్: కావ్య, రాజ్ మళ్లీ వచ్చేవారు.. నందు, రాజుగా కొత్త లుక్స్.. సరికొత్త మలుపు తిరిగిన సీరియల్
బ్రహ్మముడి మార్చి 2 ఎపిసోడ్: కావ్య, రాజ్ మళ్లీ వచ్చేవారు.. నందు, రాజుగా కొత్త లుక్స్.. సరికొత్త మలుపు తిరిగిన సీరియల్

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ గతం మరచిపోయిన స్వరాజ్ ను చూసి అతని కొత్త తల్లిదండ్రులు బాధపడే సీన్ తో మొదలవుతుంది. అతడు ఎవరు? తల్లిదండ్రులు ఎవరు కనిపెట్టడం వాళ్లకు కష్టమవుతుంది. దీంతో భయంతో వణికిపోతున్న స్వరాజ్ ను చూసి వాళ్లు బాధపడతారు.

ఇటు రేఖ ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ ఆనవాళ్లు లేకుండా ఫొటోలను కూడా తగలబెట్టేస్తుంది. అది చూసి అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె వేడుకున్న రేఖ వినదు. ఆమె భర్త, అతని అక్క సంతోషించగా.. అక్క భర్త శేషు మాత్రం ఇలా చేయడం పాపం అని అంటాడు.

రాజుగా మారిన స్వరాజ్

ఇటు స్వరాజ్ ను లక్ష్మి దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటారు. పేరు కూడా మరచిపోయిన అతనికి రాజు అనే పేరు పెడతారు. తమ ఇంటికి పెద్ద కొడుకుగా అతన్ని చూసుకుంటారు. అతని తల్లిదండ్రుల జాడ మాత్రం తెలుసుకోలేకపోతారు. ఇన్నాళ్లయినా మిస్సింగ్ కేసేమీ ఫైల్ కాకపోవడంతో వాళ్లు చనిపోయారేమో అని అనుకుంటారు. స్వరాజ్ కూడా వాళ్లనే తన అమ్మానాన్నలుగా ఫిక్సయిపోతాడు. తమ్ముడిని బాగా చూసుకుంటూ ఉంటాడు.

పిల్లలకు రేఖ అక్షరాభ్యాసం.. అపర్ణకు చేదు అనుభవం

తన మనవరాళ్లను చూసి అపర్ణ కుమిలికుమిలి ఏడుస్తుంటుంది. కావ్యకు ఇచ్చిన మాట తప్పాను.. వీళ్లను బాగా చూసుకోలేకపోతున్నానని అంటుంది. అదే సమయంలో అపర్ణ మనసులోని కావ్య ఆత్మ రూపంలో వచ్చి ఆమెకు ధైర్యం చెబుతుంది. పిల్లలను రేఖ చదివించొద్దని అంటే.. మీరు మానేస్తారా? స్కూలుకు వెళ్లకపోయినా మరో మార్గం చూడండి.. ఓ దారి మూసుకుపోతే మరో దారి ఉంటుంది అని కావ్య ఆమెతో అంటుంది.

పిల్లలు అక్షరాలు నేర్చుకోకుండా అడ్డుకున్న రేఖ

దీంతో తన మనవరాళ్లకు తానే అక్షరాలు నేర్పించాలని అపర్ణ ఫిక్సవుతుంది. అప్పుడే ఇద్దరికీ అక్షరాభ్యాసం చేయిస్తుంది. మీకు తానే గురువును అవుతానని, ఇక అన్నీ తానే నేర్పిస్తానని చెబుతుంది. రేఖతోనే కాదు ఈ స్వార్థంతో నిండిన ప్రపంచంతోనూ ఎలా పోరాడాలో తానే చెబుతానని అంటుంది. అది చూసిన రేఖ వదని ఆమెను తీసుకొస్తుంది. దీంతో రేఖ పిల్లల చేతుల్లో నుంచి పలకలు తీసి పగలగొడుతుంది. నువ్వు చెప్పింది వినమంటూ నందు అనడంతో ఆమెను కొట్టడానికి వస్తుంది రేఖ. అపర్ణ ఆమెను అడ్డుకుంటుంది. దీంతో రేఖ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. పిల్లలకు సుభాష్ ధైర్యం చెబుతాడు.

నందు, రాజుగా కావ్య, స్వరాజ్

సీరియల్ చివర్లో మేకర్స్ పెద్ద ట్విస్టే ఇచ్చారు. బ్రహ్మముడి సీరియల్ లో తరం మారిపోయింది. చనిపోయిన కావ్య, రాజ్ పాత్రలు మళీ ఇప్పుడు నందు, రాజుగా తిరిగి వచ్చారు. ఇంట్లో నాన్నమ్మ, తాతయ్యలకు నందు ధైర్యం చెబుతుంది. దుగ్గిరాల వంశాన్ని తిరిగి నిలబెడతానని శపథం చేస్తుంది. మీ అమ్మానాన్న బతికి ఉంటే ఈపాటికి మీ బావ స్వరాజ్ తో పెళ్లి జరిగేదని అపర్ణ అనుకుంటుంది.

అప్పుడే అటు బస్తీలో పెరిగిన రాజు మాస్ అవతారంలో కనిపిస్తాడు. వాటర్ ట్యాంకు దగ్గర ఆడవాళ్లతో గొడవ పడుతుంటాడు. ఈ ఇద్దరూ మళ్లీ ఎలా కలవబోతున్నారు? సీరియల్ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది అన్న ఆసక్తి కలుగుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe