...
...
Next Story

Brahmamudi March 30 Episode: బ్రహ్మముడి- ఐశ్వర్యకు 2 రోజుల గడువు- ఫుల్ బాటిల్ తాగిన రేఖ-ఇందుపై ప్రేమ-పనులు చెప్పొద్దంటూ!

Brahmamudi Serial March 30th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 30వ ఎపిసోడ్‌లో రాజ్ పోలికలతో రాజును చూసిన రేఖ భయంతో ఫుల్ బాటిల్ తాగుతుంది. రాజు గురించి తెలుసుకునేందుకు చలపతి రావు ఇంటికి జనాభా లెక్కల పేరుతో ఒకతన్ని పంపిస్తుంది. ఐశ్వర్యకు 10 లక్షల అప్పు ఉన్న విషయం ఇందుకు తెలుస్తుది.

Published on: Mar 30, 2026, 09:13:33 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ తాగుతూ రాజ్ చనిపోవడం. రాజు ఇంటికి రావడం గురించి టెన్షన్ పడుతుంది. ఆ కంగారుతో ఫుల్ బాటిల్ తీసుకుని మరి తాగుతుంది. ఇంతలో భ్రమరాంబ వచ్చి ఎందుకంతా కంగారుపడుతున్నావ్ అని అడుగుతుంది. ఆ అబ్బాయికి నీకు ఏంటీ సంబంధం అని అంటుంది.

రాజ్ పోలికలతో ఒకడు వచ్చాడు

బ్రహ్మముడి సీరియల్ మార్చి 30 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ మార్చి 30 ఎపిసోడ్

చనిపోయినవాడు కళ్లముందుకు వస్తే ఎలా ఉంటుంది. రాజ్ పోలికలతో ఒకడు ఇంటికి వచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. రాజ్ పోలికలతో ఉండేందుకు ఒక ఛాన్స్ ఉంది. రాజ్ మేనల్లుడు స్వరాజ్. బాంబ్ బ్లాస్టర్‌లా వాడు బతికి ఉంటే.. అప్పుడు దుగ్గిరాల ఇంటికి మరో వారసుడు వచ్చినట్లే. ఇందుకు తోడుగా నిలబడతాడు అని రేఖ అంటుంది.

దాంతో ఈ ఆస్తి మనకు దక్కదా అని భ్రమరాంబ తెగ భయపడిపోతుంది. ఇదంతా నా అపోహే. కేవలం వాడు రాజ్ పోలికలతోనే ఉన్నాడా, ఇన్నిరోజులు ఇక్కడికి ఎందుకు రాలేదు. వాడి గురించి తెలుసుకోవాలి అని రేఖ అంటుంది. మరోవైపు ఉదయం బాంబ్ బ్లాస్టర్‌ కలలో వచ్చి మళ్లీ అరిచి లేస్తాడు రాజ్. ఎవరు పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులపై అరుస్తాడు రాజు.

ఏదో ఒక వ్యాన్ కాలిపోయింది. అందులో నుంచి ఒకడు ఎగిరి పడ్డాడు అని రాజు చెబుతాడు. దాంతో చలపతిరావు సెటైర్లు వేస్తాడు. దాంతో రాజు వెళ్లిపోతాడు. వాడు చిన్నప్పుడు శ్రీశైలంలో దొరికిన విషయం దాచి తప్పు చేస్తున్నామా. ఇప్పుడు వాడు పెద్దవాడు అయ్యాడు. ఇంకా నిజం దాచాలా అని తల్లి అంటుంది. వాడి తల్లిదండ్రులు బతికి ఉంటే చెప్పేవాళ్లం. కానీ, బతికి లేకుంటే వాడు ఎంత బాధపడతాడు అని చలపతి రావు అంటాడు.

రేఖకు తెలియని నిజం

ఎక్కడో దొరికితే అద్దెకు తెచ్చుకున్నామని చలపతి రావు అంటాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. తర్వాత వాడు నా కన్నకొడుకు, నా కష్టార్జీతం. ఇంకోడు నా చిన్నకొడుకు వెంకీ అని చలపతి రావు చెబుతాడు. ఎన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, చలపతి రావు తండ్రి, తాత గురించి కూడా ఫోన్‍లో అడిగిపిస్తుంది రేఖ. దాంతో చలపతి రావు అతనిపై సెటైర్లు వేస్తాడు. రాజుకు దూరపు చుట్టాలు, బంధువులు ఉన్నారా అని రేఖ అడిగిపిస్తుంది.

వాడికి ఉంటే నాకు ఉన్నట్లేగా అని తిడతాడు చలపతి రావు. వీళ్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ రాజుకు దుగ్గిరాల కుటుంబానికి ఏ సంబంధం లేదని రేఖ నిశ్చయంగా ఉంటుంది. మరోవైపు రేఖకు రాకేష్ పది లక్షల కోసం కాల్ చేస్తాడు. ఐశ్వర్య జరిగింది చెబితే రాకేష్ నమ్మడు. వారం రోజుల టైమ్ ఐశ్వర్య అడిగితే.. కేవలం 2 రోజులు మాత్రమే ఇస్తాను. లేకుంటే మీ ఆంటీతో తేల్చుకుంటాను అని రాకేష్ కాల్ కట్ చేస్తాడు.

దిగజారుతున్నావన్న ఇందు

ఐశ్వర్య మాటలు ఇందు వింటుంది. అది చూసి ఇందుపై అరుస్తుంది. సైలెంట్‌గా వచ్చి భయపెడతావేంటని అంటుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ ఐశు. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటీ. ఆ నెక్లెస్ తీసుకుంటే రేఖ ఆంటీకి చెప్పి తీసుకోవచ్చుగా. చెప్పలేదంటే ఏదో తప్పు చేశావ్. ఆ రాకేష్ గాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి. రోజు రోజుకీ ఎందుకు దిగజారుతున్నావ్ అని ఇందు అంటుంది.

దొంగతనం నువ్వు చేసి నా మీద ఎందుకు నింద వేశావ్ అని అడుగుతుంది ఇందు. నువ్వు మంచిదానిలా ముసుగేసుకుని తిరిగితే నేను నమ్ముతానా. మీ అమ్మ కూడా ఇలాగే అందరిని నమ్మించి ఆస్తి మొత్తం గుప్పిట్లో పెట్టుకుందటగా అని కావ్యను అంటుంది ఐశ్వర్య. నువ్వు రేఖ అంటీ మాయలో ఉన్నావ్. నిజం తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి తప్పు చేశానని అంటావ్ అని ఇందు అంటుంది. అలాంటి రోజు వస్తే చావనైనా చస్తాను కానీ నీ దగ్గరికి రాను అని ఐశ్వర్య అంటుంది.

రేఖ కొత్త ప్లాన్

మరోవైపు రెస్టారెంట్‍‌కు వెంకీ, నందు వస్తారు. అక్కడ రోజాను కలిసేందుకు నందుతోపాటు వెంకీ వెళ్తాడు. మరోవైపు ఇందు వేసే ఒక్క వేలిముద్రతో దుగ్గిరాల ఆస్తి మీ సొంతం అవుతుందని రేఖతో లాయర్ అంటాడు. దాంతో ఇందుపై రేఖ ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. ఇందుకు ఎలాంటి పనులు చెప్పనివ్వదు. ఆస్తి కొట్టేసేందుకే రేఖ ఇలా ప్లాన్ చేసిందని ఇందుతో అపర్ణ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe