Brahmamudi May 11 Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందులను చూసి రేఖలో ఫ్రస్ట్రేషన్ మరింత పెరుగుతుంది. ఎలాగైనా వాళ్ల పెళ్లిని పెటాకులు చేసి ఇందుని మళ్లీ తన కొడుకు మదన్ కు ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు రాజులో తన కొడుకున్న చూసుకుంటున్న అపర్ణలో మరింత అనుమానం కలుగుతుంది.
రాజు వివరాలు రాబట్టిన అపర్ణ

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మే 11) ఎపిసోడ్ రాజు గురించి అపర్ణ వివరాలు రాబట్టే సీన్ తో మొదలవుతుంది. రాజు తల్లిదండ్రుల వివరాలు ఇందు చెబుతుంది. ఎక్కడ ఉంటారని అడిగితే బస్తీలో ఉంటామని అతడు అంటాడు. రాజుని చూసి శేషు, భ్రమరాంబ కూడా మురిసిపోతారు.
స్వాతి అయితే పెళ్లి జరగనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. రాజును తన ఇంటి పేరు ఏంటని కూడా అపర్ణ అడుగుతుంది. ఇక్కడే ఉంటే తన పుట్టుపూర్వోత్తరాలన్నీ అడుగుతుందని అనుకొని మన గది చూపించమంటూ ఇందుని తీసుకొని రాజు వెళ్లిపోతాడు.
రాజు మన మనవడే అని చెప్పిన సుభాష్
అయితే అతన్ని చూసి అపర్ణ ఎంతో మురిసిపోతుంది. అచ్చూ మన కొడుకులాగే ఉండటమేంటని సుభాష్ తో అంటుంది. అతనితో కచ్చితంగా మనకు రక్త సంబంధం ఉండే ఉంటుంది.. లేకపోతే మన కొడుకులా ఉండటమేంటి.. అతడు కచ్చితంగా మన మనవడే.. మన కూతురు కొడుకే అయి ఉంటాడు అని సుభాష్ అంటాడు. అతని తల్లిదండ్రులను కలిస్తే అసలు వివరాలు తెలుస్తాయని అపర్ణ, సుభాష్ అనుకుంటారు.
రేఖ ఫ్రస్ట్రేషన్.. అసలు ఏం జరుగుతోందంటూ..
ఇటు ఇదంతా చూసి రేఖలో ఫ్రస్ట్రేషన్ మరింత పెరుగుతుంది. అసలు ఏం జరుగుతోందని భూషణ్ తో అంటుంది. ఆస్తి కోసం ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ కావడం లేదు.. ముందు కిడ్నాప్, తర్వాత సంతకం చెల్లకపోవడం, ఇప్పుడీ పెళ్లి అంటూ రేఖ వాపోతుంది.
{{/usCountry}}ఇటు ఇదంతా చూసి రేఖలో ఫ్రస్ట్రేషన్ మరింత పెరుగుతుంది. అసలు ఏం జరుగుతోందని భూషణ్ తో అంటుంది. ఆస్తి కోసం ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ కావడం లేదు.. ముందు కిడ్నాప్, తర్వాత సంతకం చెల్లకపోవడం, ఇప్పుడీ పెళ్లి అంటూ రేఖ వాపోతుంది.
{{/usCountry}}ఇందు సంతకం పెడితే ఆస్తంతా కలిసి వచ్చి మన అప్పులు తీరిపోయి కష్టాల్లో నుంచి బయటపడతామనుకుంటే ఇలా జరిగిందేంటని భూషణ్ కూడా బాధ పడతాడు.
ఈ పెళ్లిని ఎలాగైనా పెటాకులు చేసి తమ కొడుకుతో ఇందుకి మరో పెళ్లి చేయాల్సిందే అని చెబుతుంది. దానికి ఏం చేయాలో తాను ఆలోచిస్తానని, నువ్వు కూడా ఆలోచించు అని భూషణ్ తో అంటుంది.
ఇందు గురించి అసలు నిజం తెలిసి రాజు షాక్
మరోవైపు రాజును తన గదిలోకి తీసుకెళ్తుంది ఇందు. అయితే అది ఓ స్టోర్ రూమ్ కావడంతో అతడు షాక్ తింటాడు. ఈ ఇంటికి మహారాణి అనుకుంటే నువ్వు ఇలాంటి రూమ్ లో ఉండటమేంటని రాజు అంటాడు. ఇలాగైతే నాకు ఇస్తానన్న డబ్బులు ఎలా ఇస్తావని నిలదీస్తాడు. ఈ ఆస్తంతా తనదే అని, ఇస్తానన్న డబ్బులు ఇస్తాను కానీ.. తాను చెప్పిన కండిషన్స్ ఓసారి గుర్తు చేసుకోమని రాజుతో చెబుతుంది ఇందు.
ఇందు కండిషన్స్ గుర్తు చేసుకున్న రాజు.. రోజుకు రూ.10 వేలు
దీంతో అంతడు ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తాడు. పెళ్లి కోసం రాజు, ఇందు కుదుర్చుకునే డీల్ చూపిస్తారు. తన భర్తగా నటించాలని అతన్ని అడుగుతుంది. రోజుకు రూ.5 వేలు ఇస్తానంటుంది. అతడు రూ.50 వేలు కావాలంటాడు. చివరికి రూ.10 వేలకు డీల్ కుదురుతుంది. అయితే తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఇందు చెబుతుంది.
నువ్వు కేవలం అద్దె భర్తవే.. నామీద పెత్తనం చెలాయించడానికి ట్రై చేయొద్దు.. నీ కాళ్లుచేతులే కాదు నీ చూపులు కూడా కంట్రోల్లో ఉండాలని అంటుంది. డబ్బు అవసరం కావడంతో రాజు కూడా సరే అంటాడు. కానీ డబ్బు మాత్రం ఏ రోజుకు ఆరోజే ఇవ్వాలని రాజు అంటాడు. ఇందు సరే అంటుంది. ఆ కండిషన్స్ గుర్తు చేసుకొని ఇక తప్పుతుందా అని రాజు అనకుంటాడు. మరోవైపు ఇందు విడాకుల ప్లాన్ వేస్తూ ఉంటుంది రేఖ. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.