బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్: రాజ్, కావ్యలా మారిపోయిన రాజు, ఇందు.. బిజినెస్ తమ చేతుల్లోకి.. రేఖలో వణుకు
బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ మే 16 ఎపిసోడ్ లో రాజు, ఇందు కాస్తా రాజ్, కావ్యలా మారిపోతారు. రేఖ నుంచి తమ బిజినెస్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. అది చూసి రేఖలో వణుకు పుడుతుంది.
బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ ఎదురైంది. స్వరాజ్ గ్రూపు బిజినెస్ ను పూర్తిగా అస్తవ్యస్తం చేసిన రేఖను అపర్ణ నిలదీయడం, ఇందుకి కూడా క్లాస్ పీకడం, తర్వాత రాజుతో కలిసి ఆ బిజినెస్ పనులు చూసుకోవడానికి ఇందు సిద్ధం కావడంలాంటి సీన్లతో సాగిపోయింది.

రాజుని నిలదీసిన లక్కీ
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 16) ఎపిసోడ్ రాజుని లక్కీ నిలదీసే సీన్ తో మొదలైంది. తనకు తెలియకుండా ఇందుని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో సెటిలైపోతావా.. నిజానికి ఐశ్వర్యని లైన్ లో పెట్టి నేను ఆ ఇంట్లోకి వెళ్దామనుకుంటే నాకంటే ముందే నువ్వు వెళ్తావా అని రాజుని నిలదీస్తాడు. తమది ఉత్తిత్తి పెళ్లి అని చెప్పినా లక్కీ వినడు.
సరే నిన్ను కూడా ఆ ఇంటికి తీసుకెళ్తాను.. అక్కడికి వెళ్లిన తర్వాత ఐశ్వర్యను ప్రేమలో పడేసి ఆ ఇంటికి అల్లుడివి అయిపో.. అప్పుడు మనిద్దరం ఆ ఇంటికి తోడల్లుళ్లం అవుతాం అని లక్కీతో అంటాడు రాజు. అయితే నేను అదే పనిలో ఉంటాను.. రిచ్ గా కనిపించడానికి షాపింగ్ చేస్తాను అని లక్కీ వెళ్లిపోతాడు.
అప్పుడే రాజుకి డాక్టర్ ఫోన్ చేసి డబ్బు కట్టాలని లేదంటే ట్రీట్మెంట్ ఆపేస్తానని అంటాడు. వారం రోజుల టైమ్ కావాలని రాజు అడుగుతాడు. ఇందు దగ్గర పేమెంట్ వసూలు చేయాలని రాజు అనుకుంటాడు.
జీతాల విషయంలో రేఖను ప్రశ్నించిన అపర్ణ
ఇటు ఇంటికి వచ్చిన అపర్ణ.. రేఖ అంటూ గట్టిగా అరుస్తుంది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు అని ఆమెను నిలదీస్తుంది. తాము ఏనాడూ ఒక్క రోజు కూడా జీతాలు ఆలస్యం చేయలేదని, ఇలా చేస్తే దుగ్గిరాల ఇంటి పరువు పోతుందని రేఖపై మండిపడుతుంది. అసలు ఆ డబ్బు ఏం చేశావ్.. ఉద్యోగుల బాగోగులు చూసుకోవాలి కదా అని అంటుంది.
ఇందు కోసమే ఖర్చు చేశానన్న రేఖ
అపర్ణ ఎంతలా చెలరేగినా రేఖ మాత్రం పెద్దగా పట్టనట్లు కూల్ గా ఉంటుంది. ఆ డబ్బు నీ మనవరాలి కోసమే ఖర్చు చేశానని చెబుతుంది. ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు ఆ రూ.20 లక్షలు ఇప్పుడు ఆమె భర్తగా ఉన్న రాజుకే ఇచ్చానని అంటుంది. ఒక్క నెల ఆలస్యం అయితే ఏమీ కాదులే.. వాళ్లకు జీతాలు ఇస్తానని చెబుతుంది. అయినా అపర్ణ వినకపోవడంతో రేఖ బెదిరింపులకు దిగుతుంది. నీ భర్త గురించి ఆలోచించుకో అని వార్నింగ్ ఇస్తుంది.
ఇందుపై తీవ్రంగా మండిపడిన అపర్ణ
లోపలికి వెళ్లిన తర్వాత ఇందుపైనా అపర్ణ మండిపడుతుంది. మీ అమ్మే ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ఆమె అన్నీ చక్కదిద్దేదని అంటుంది. నీకూ మీ అమ్మ తెలివి తేటలు ఉన్నా కూడా మా కోసం ఎన్నాళ్లు ఇలా భయపడుతూ కూర్చుంటావు అని ఇందుని నిలదీస్తుంది. నీ గురించి నీకు తెలియడం లేదు.. నీకు ఆ సామర్థ్యం ఉంది అని అంటుంది. కానీ తాను ఏమీ చేయలేనని ఇందు అంటుంది.
రాజు కోసం చలపతి, లక్ష్మీ ఆందోళన
మరోవైపు రాజు కోసం చలపతి, లక్ష్మీ ఆందోళన పడుతుంటారు. రెండు రోజులైనా వాడి జాడ లేదని బాధపడతారు. వాడు దుగ్గిరాల వారసుడు అని తెలియక బయట తిరుగుతున్నాడు.. ఆ విషయం రేఖకు తెలిస్తే వాడి ప్రాణాలకే ప్రమాదం అని చలపతి అంటాడు. మనం పిల్లలను తీసుకొని ఊరు వదిలి వెళ్లిపోదామని లక్ష్మీ అంటుంది. అలా చేస్తే కొత్త ఊళ్లో నాకు, వెంకీకి ఉద్యోగాలు రావని చలపతి అంటాడు. ఇక్కడే ఉండి పిల్లలను కాపాడుకోవాలని చెబుతాడు.
రాజుకి రూ.1000 చేతిలో పెట్టిన ఇందు
ఇటు ఇంట్లో తన రెండు రోజుల పేమెంట్ రూ.20 వేల కోసం రాజు ఆశగా ఎదురు చూస్తుంటాడు. ఇందు రాగానే ఆమెకు ఆ లెక్క చెబుతాడు. సరే ఇస్తానంటూ అతని చేతుల్లో రూ.1000 పెడుతుంది. వచ్చిన రోజు మన మధ్య ఏదో జరిగిపోయిందని నోరు జారినందుకు రూ.5 వేలు కట్.. మెట్లపై పడుతుంటే నన్ను పట్టుకున్నందుకు మరో రూ.2 వేలు కట్ అంటూ లిస్ట్ చెబుతూ వెళ్తుంది. ఆ వెయ్యి చూసి రాజు షాక్ తింటాడు.
ఆ తర్వాత అపర్ణ తనను అన్న మాటలను ఇందు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటుంది. చివరికి ఇక ఆఫీసుకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకుంటుంది. తన తల్లిదండ్రులైన రాజ్, కావ్య బట్టలను బయటకు తీస్తుంది. వాటిని వేసుకొని చివరికి రాజు, ఇందుయే వాళ్లలా మారిపోతారు. ఆఫీసుకు బయలుదేరుతారు. వాళ్లను చూసి అపర్ణ, సుభాష్ సంతోషించగా.. రేఖ, భ్రమరాంబ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


