Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య ప్లాన్ సక్సెస్ అయి.. డబ్బు ఒత్తిడిలో రాజు దిగి వస్తాడు. ఇందుని మోసం చేసి మళ్లీ రేఖకు అప్పగిస్తాడు. అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఇందుకి చివరికి తీవ్ర నిరాశే ఎదురవుతుంది.
ఇందుకి రాజ్ మిడిల్'క్లాస్'

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మే 1) ఎపిసోడ్ ఇందుకి డబ్బు గురించి, మిడిల్ క్లాస్ కష్టాల గురించి రాజు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లకు డబ్బు ఎంత అవసరమో అతడు చెబుతాడు. డబ్బులో పుట్టి పెరిగిన నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. డబ్బే అన్నీ ఇస్తుందని రాజు అంటాడు. డబ్బు కోసం తనలాంటి వాళ్లు పడే కష్టాల గురించి చెబుతాడు. అదంతా విన్న ఇందు.. వీడు మంచోడే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ అని అనుకుంటుంది.
ఐశ్వర్యకు ఫోన్ చేసి బెదిరించిన రాకేష్
ఇటు ఐశ్వర్యకు రాకేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. తనకు వెంటనే డబ్బు కావాలని అంటాడు. తనకు డబ్బులు రావాల్సి ఉందని, అవి రాగానే ఇచ్చేస్తానని ఐశ్వర్య చెప్పినా వినడు. వెంటనే ఇవ్వకపోతే మీ ఆంటీ దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పేస్తానని బెదిరిస్తాడు. దీంతో ఐశ్వర్యలో టెన్షన్ మొదలవుతుంది.
రేఖకు ఐశ్వర్య ప్లాన్
వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి ఇందు కిడ్నాప్ విషయం ఎంత వరకు వచ్చిందని అడుగుతుంది. డబ్బు సరిపోవడం లేదని, కేవలం రూ.20 లక్షలే ఉన్నాయని చెబుతుంది. అంతే ఇస్తామని కిడ్నాపర్లకు చెప్పమని అంటుంది. రూ.50 లక్షలకే ఒప్పుకోలేదు.. 20 లక్షలకు అస్సలు ఒప్పుకోరని రేఖ చెబుతుంది. ఓసారి ఫోన్ చేసి చూడండి అని ఐశ్వర్య అంటుంది.
రాజుకు రేఖ ఫోన్.. 20 లక్షలు వద్దంటూ..
సరే అని రాజుకి రేఖ ఫోన్ చేస్తుంది. డబ్బు రెడీ అయిందని అంటుంది. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెబుతానని రాజు అంటాడు. కానీ కోటి కాదు రూ.20 లక్షలే ఉన్నాయని అనడంతో రాజు కోప్పడతాడు. 50 లక్షలే వద్దంటే 20 లక్షలు ఎలా తీసుకుంటాను.. కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
రాజుకు ఫోన్ చేసి క్లాస్ పీకిన ఐశ్వర్య
{{/usCountry}}సరే అని రాజుకి రేఖ ఫోన్ చేస్తుంది. డబ్బు రెడీ అయిందని అంటుంది. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెబుతానని రాజు అంటాడు. కానీ కోటి కాదు రూ.20 లక్షలే ఉన్నాయని అనడంతో రాజు కోప్పడతాడు. 50 లక్షలే వద్దంటే 20 లక్షలు ఎలా తీసుకుంటాను.. కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
రాజుకు ఫోన్ చేసి క్లాస్ పీకిన ఐశ్వర్య
{{/usCountry}}అది విన్న ఐశ్వర్య మరోసారి తన గదిలోకి వెళ్లి రాజుకు ఫోన్ చేస్తుంది. 20 లక్షలకు ఎందుకు ఒప్పుకోవడం లేదు.. మా ఆంటీ దగ్గర అంత కన్నా ఎక్కువ లేవు.. ఆలస్యం చేస్తే నాకు ప్రాబ్లెమ్ అవుతుంది అని అంటుంది. అవి తీసుకొని ఇందుని వదిలెయ్యమని చెబుతుంది.
అటు రాజుకు కూడా సాహు ఇచ్చిన 24 గంటల గడువు గుర్తుకు వస్తుంది. దీంతో చేసేది లేక సరే అంటాడు. వెంటనే రేఖకు ఫోన్ చేసి 20 లక్షలు అయినా సరే అని అంటాడు. ఎక్కడికి, ఎప్పుడు రావాలో చెబుతానని అనడంతో రేఖతోపాటు ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు. ఇటు 20 లక్షలకు ఎందుకు ఒప్పుకున్నావని లక్కీ నిలదీస్తాడు. కానీ తన పరిస్థితి గురించి చెప్పి రాజు అతన్ని కన్విన్స్ చేస్తాడు.
ఇందుని గుడికి తీసుకొచ్చిన రాజు, లక్కీ
ఇందుకి ఏదో అబద్ధం చెప్పి గుడికి తీసుకొస్తారు రాజు, లక్కీ. ఇంత దైవభక్తి సడెన్ గా ఏంటి అని ఇందు అంటుంది. ఆమెను రేఖకు అప్పగించబోతున్నానని రాజు బాధగా ఉంటాడు. నీపై నాకు నమ్మకం ఉందని ఇందు అనడంతో రాజు మరింత బాధపడతాడు. గుడి చుట్టూ తిరిగి అమ్మావారికి మొక్కుకుంటే అనుకున్నవి జరుగుతాయని చెప్పి ఇందుని పంపిస్తాడు రాజు. తర్వాత లక్కీకి డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో చెబుతాడు.
ఇందుని తీసుకెళ్లిన రేఖ
అటు ఇందుని తీసుకురావడానికి రేఖ, భూషణ్ బయలుదేరుతారు. గుడిలో అమ్మవారికి తనను కష్టాల నుంచి గట్టెక్కించమని ఇందు మొక్కుకుంటుంది. వెనక్కి తిరగగానే ఆమె ముందు రేఖ ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే ఇందు షాక్ తింటుంది. వెంటనే ఇందుని రేఖ లాక్కెళ్తుంది. చాటు వాళ్లను రాజు చూస్తుంటాడు. వెనక్కి తిరిగి రాజుని చూస్తూ ఇందు బాధపడుతుంది. అటు డబ్బు అందిందని లక్కీ వచ్చి చెబుతాడు. అయితే ఇందుని మోసం చేసి మళ్లీ ఆమెను రేఖ గుప్పిట్లోకి పంపించిన రాజు బాధపడుతుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.