బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజుని రేఖ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించినట్లుగా ఎవరికి వాళ్లు ఫీలవుతుంటారు. అయితే ఇందు వేసే తాజా ప్లాన్ దెబ్బకు రేఖ మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
రాజ భోగాల కోసం రాజు డిమాండ్

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మే 22) ఎపిసోడ్ ఇంట్లో రాజు చేసే హంగామాతో మొదలవుతుంది. ఇంటి అల్లుడిని ఇలాగే చూసుకుంటారా అంటూ హడావిడి చేసే రాజు.. తనకు విశాలమైన గది, కింగ్ సైజ్ బెడ్, మంచి ఏసీ ఉండాలని డిమాండ్ చేస్తాడు. అది విన్న రేఖ మొదట భ్రమరాంబను గది ఇవ్వమంటుంది.
ఆమె ఒప్పుకోదు. తర్వాత స్వాతి రూమ్ తీసుకోమంటుంది. దానికీ భ్రమరాంబ అడ్డు పడుతుంది. చివరికి ఐశ్వర్య రూమ్ తీసుకొమ్మని అడుగుతుంది. దానికి ఐశ్వర్య నో అంటే.. రాజు మెల్లగా ఆమె గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేయడంతో సరే అంటుంది.
మూడో అమ్మాయినీ రిజెక్ట్ చేసిన వెంకీ
మరోవైపు వెంకీకి అమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్న నందు.. మూడో అమ్మాయినీ అతడు రిజెక్ట్ చేయడంతో తల పట్టుకుంటుంది. డేటింగ్ యాప్ ద్వారా ముగ్గురి సెట్ చేయగా.. అందరినీ వెంకీ వద్దంటాడు. చివరిగా వచ్చిన అమ్మాయి తనకు మరో రెండు నెలల్లో పెళ్లి అంటూనే వెంకీతో డేటింగ్ కు రెడీ అవుతుంది. కానీ వెంకీ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ అంటూ వద్దంటాడు. దీంతో అతన్ని ఎలా వదిలించుకోవాలా అని నందు ఆలోచిస్తుంది.
ఇందుపై మండిపడిన ఐశ్వర్య
ఇటు ఇందు, రాజు కోసం ఐశ్వర్య గది ఖాళీ చేస్తుంటుంది. అప్పుడే ఇందు అక్కడికి వెళ్తుంది. ఆమెను చూడగానే ఐశ్వర్య తీవ్రంగా మండిపడుతుంది. నువ్వే ఇక్కడ ఉండు.. మాకు గది అవసరం లేదని ఇందు చెబుతున్నా.. నీ నాటకాలు చాలు అంటూ ఆమె తిడుతుంది. అన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి.. లోపల ఒకలా, పైకి ఒకలా మాట్లాడతావు.. నా నుంచి గది లాక్కుంటారా.. దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా అని వార్నింగ్ ఇచ్చి ఐశ్వర్య వెళ్లిపోతుంది.
రాజుకి క్లాస్ పీకిన ఇందు
{{/usCountry}}ఇటు ఇందు, రాజు కోసం ఐశ్వర్య గది ఖాళీ చేస్తుంటుంది. అప్పుడే ఇందు అక్కడికి వెళ్తుంది. ఆమెను చూడగానే ఐశ్వర్య తీవ్రంగా మండిపడుతుంది. నువ్వే ఇక్కడ ఉండు.. మాకు గది అవసరం లేదని ఇందు చెబుతున్నా.. నీ నాటకాలు చాలు అంటూ ఆమె తిడుతుంది. అన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి.. లోపల ఒకలా, పైకి ఒకలా మాట్లాడతావు.. నా నుంచి గది లాక్కుంటారా.. దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా అని వార్నింగ్ ఇచ్చి ఐశ్వర్య వెళ్లిపోతుంది.
రాజుకి క్లాస్ పీకిన ఇందు
{{/usCountry}}ఆ తర్వాత గదిలోకి వచ్చిన రాజుని చూసి ఇందు క్లాస్ పీకుతుంది. ఎందుకు అన్ని ఎక్స్‌ట్రాలు చేస్తున్నావని అంటుంది. నీకోసం ఇంత పెద్ద గది ఇప్పిస్తే నన్ను తిడతావా అని రాజు అంటాడు. మన గెటపే కాదు.. సెటప్ కూడా మార్చాలని ఇందుకి చెబుతాడు. ఈ విషయం వదిలెయ్ కానీ.. ఉద్యోగులకు జీతాలు, నాకు వారంలో పేమెంట్ ఇస్తానని చెప్పావ్.. ముందు దాని గురించి ఆలోచించు అని రాజు అంటాడు. దీంతో ఇందు ఆలోచనలో పడుతుంది.
రాజుని మచ్చిక చేసుకుంటున్నానన్న రేఖ
రేఖ చేస్తున్న పనులు చూసి భ్రమరాంబ, భూషణ్ ఆమెకు క్లాస్ పీకుతారు. వాడు ముందే కంత్రీలాగా ఉన్నాడు.. వాడిని నెత్తి మీద పెట్టుకుంటే సింహాసనం ఎక్కి కూర్చొంటాడు అని భూషణ్ అంటాడు. ఈరోజు రూమ్ అడిగాడు.. రేపు ఇంకేదో అడుగుతాడు ఇస్తావా అంటూ భ్రమరాంబ కూడా అంటుంది.
మీరు ఏమనుకున్నా సరే.. వాడిని మచ్చిక చేసుకునే పనిలో నేను ఉన్నాను.. వాడు సంతకం పెడితేనే ఆస్తి వస్తుందని లాయర్ చెప్పాడు కదా.. నా దృష్టంతా ఈ ఆస్తిని సొంతం చేసుకోవడంపైనే ఉంది.. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే.. కుక్కకు బిస్కెట్ వేసినట్లు వాడికి ఓ రూమ్ పడేశాను అంతేకదా అని చెప్పి రేఖ వెళ్లిపోతుంది.
స్వాతితో ఐశ్వర్య గొడవ
ఇటు స్వాతి గదిలోకి వెళ్తుంది ఐశ్వర్య. తన బట్టలు పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ లేకపోవడంతో నీ బట్టలు తీసేయ్ అంటూ స్వాతికి ఆర్డర్ వేస్తుంది. కానీ ఆమె వినదు. రిక్వెస్ట్ చేస్తే చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయనంటూ గొడవకు దిగుతుంది. ఇద్దరూ మాటా మాటా అనుకుంటారు. ఇందు వల్లే ఇదంతా జరిగిందని ఐశ్వర్య అంటే.. అక్కను ఎందుకు అంటున్నావని స్వాతి అంటుంది. చివరికి పడుకునే విషయంలోనూ ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది. తన టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ ఐశ్వర్య అంటుంది.
మరోవైపు కంపెనీని సొంతం చేసుకోవడానికి సీఈవో పదవి కోసం పోటీ పడాలని, తాను పోటీ పడితే రేఖకు అనుమానం వస్తుందని రాజుతో ఇందు చెబుతుంది. బోర్డు సభ్యులను బుట్టలో వేసుకునే పనిలో రాజు ఉంటాడు. అదే విషయాన్ని ఇటు రేఖకు చెబుతుంది ఇందు. దీంతో ఆమె షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.