బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: దుగ్గిరాల కంపెనీని సొంతం చేసుకోవడానికి ఇటు ఇందు, రాజు.. అటు రేఖ గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి స్టెప్ లో ఇందు గెలుస్తుంది. పరంధామయ్య మద్దతును కూడగడుతుంది.
పరంధామయ్య మద్దతు కూడగట్టిన రాజు, ఇందు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 27) ఎపిసోడ్ కంపెనీ బోర్డు మెంబర్ పరంధామయ్యతో రాజు, ఇందు మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. ఈ సందర్భంగా దుగ్గిరాల కుటుంబం కంపెనీకి, సమాజానికి చేసిన మంచి గురించి అతడు గొప్పగా చెబుతాడు. రేఖ వచ్చిన తర్వాత దారుణాలు చేస్తోందని, అందుకే తాను కంపెనీకి వెళ్లడం మానేశానని అంటాడు.
మన కంపెనీకి పునర్ వైభవం తెస్తానని ఇందు అంటుంది. అయితే దీనికోసం మద్దతు కావాలని అడగడంతో అతడు సరే అంటాడు. ఐదుగురిలో ఇద్దరు రేఖ మనుషులు ఉన్నారని, మిగిలిన ఇద్దరు మీరు చెప్పినట్లు వింటారని ఇందు చెబుతుంది. మీ ఓటు తనకు కావాలని అడగడంతో అతడు సరే అంటాడు.
ఇందుతో స్నేహం చేయాలని మదన్‌కు చెప్పిన రేఖ
మరోవైపు ఇంటి దగ్గర తన కొడుకు మదన్ కోసం వేచి చూస్తుంటుంది రేఖ. ఆమె దగ్గరికి భ్రమరాంబ, శేషు వెళ్తారు. అప్పుడే మదన్ కూడా వస్తాడు. వాళ్ల ముందే మదన్ తో రేఖ మాట్లాడుతూ.. ఇక నుంచి ఇందుతో స్నేహంగా ఉండాలని చెబుతుంది. ఎంతలా అంటే.. నువ్వు లేకపోతే అది పిచ్చిదైపోయేంతలా స్నేహం చేయాలి అని అంటుంది. అతడు సరే అని వెళ్లిపోతాడు.
ఆమెకు పెళ్లయింది కదా అని భ్రమరాంబ అంటే.. విడాకులు ఇప్పించి మళ్లీ తన కొడుకుతో పెళ్లి చేయిస్తానని రేఖ చెబుతుంది. మరో ఏడాది సమయం ఉంది కాబట్టి అంతలోపు ఇందుని మదన్ తన వైపుకు తిప్పుకుంటాడని అంటుంది. దీంతో భ్రమరాంబ షాకవుతుంది. నీ కూతురిని మా వాడికి ఇచ్చి చేయాలనుకుంటున్నావు కదా.. అది జరగనివ్వను అని రేఖ మనసులో అనుకొని వెళ్లిపోతుంది.
శేషుతో భ్రమరాంబ డ్రామా.. ఇందు శోభనం చేయాలంటూ..
{{/usCountry}}ఆమెకు పెళ్లయింది కదా అని భ్రమరాంబ అంటే.. విడాకులు ఇప్పించి మళ్లీ తన కొడుకుతో పెళ్లి చేయిస్తానని రేఖ చెబుతుంది. మరో ఏడాది సమయం ఉంది కాబట్టి అంతలోపు ఇందుని మదన్ తన వైపుకు తిప్పుకుంటాడని అంటుంది. దీంతో భ్రమరాంబ షాకవుతుంది. నీ కూతురిని మా వాడికి ఇచ్చి చేయాలనుకుంటున్నావు కదా.. అది జరగనివ్వను అని రేఖ మనసులో అనుకొని వెళ్లిపోతుంది.
శేషుతో భ్రమరాంబ డ్రామా.. ఇందు శోభనం చేయాలంటూ..
{{/usCountry}}అయితే భర్త శేషుతో కలిసి భ్రమరాంబ కొత్త నాటకానికి తెరతీస్తుంది. తాను చెప్పినట్లు చేయాలని అంటుంది. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి అపర్ణ, సుభాష్ ముందు నాటకం మొదలు పెడతారు. ఇందుపై భ్రమరాంబ ప్రేమ ఒలకబోస్తుంది. పెళ్లయి ఇన్నాళ్లయినా శోభనం జరిపించలేదు.. ఇంట్లో ఎవరికీ ఆ ఆలోచన లేదు అంటుంది. అది విన్న అపర్ణ, సుభాష్ ఆమె చెప్పింది నిజమే కదా అనుకుంటారు. వెంటనే పంతులుగారిని పిలిపించి మంచి ముహూర్తం పెడదామని అపర్ణ అంటుంది.
వెంకీ కోసం నందు షర్ట్ గిఫ్ట్
ఇటు వెంకీ కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి రెడీ అవుతుంటాడు. అంతలో అతనికి ఓ కొరియర్ వస్తుంది. అందులో షర్ట్ ఉండటం చూసి ఎవరు పంపించారని చలపతి అడుగుతాడు. నందుయే పంపి ఉండొచ్చని వెంకీ మనసులో అనుకుంటాడు. అంతలో ఆమె ఫోన్ చేస్తుంది. ఇంటర్వ్యూకి రెడీ అయ్యావా.. కొరియర్ వచ్చిందా అని అడుగుతుంది. నీ బోరింగ్ షర్ట్స్ వేసుకోకుండా ఇంటర్వ్యూ ఆ షర్ట్ వేసుకో చాాలా బాగుంటుంది అని చెబుతుంది. అతడు సరే అంటాడు.
తల్లి జ్ఞాపకం ఇచ్చేసిన ఇందు
ఇటు రాజుకి మరోసారి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. డబ్బు కడితేనే ట్రీట్మెంట్ కొనసాగిస్తానని అంటారు. దీంతో అతడు ఇందు దగ్గరికి వెళ్లి తన పేమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. డబ్బు లేకపోవడంతో ఆమె తన మెడలోని బంగారు చెయిన్ ఇస్తుంది. దానిని తాకట్టు పెట్టి హాస్పిటల్లో డబ్బు కడతాడు రాజు.
ఇందు మెడలో చెయిన్ లేకపోవడం చూసి అపర్ణ నిలదీస్తుంది. మీ అమ్మ ఇచ్చిన ఒకే ఒక్క జ్ఞాపకం అది.. ఎక్కడ అని అడుగుతుంది. రూమ్ లోనే ఉందంటూ ఆమె కవర్ చేసి వెళ్లిపోతుంది. ఆ మాట విని రాజు ఎమోషనల్ అవుతాడు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.