Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజును కాకా పడుతుంటాడు శేషు. రేఖకు హాఫ్ నాలెడ్జ్ ఫెలో, నీలా కాదు. ఎలా సాగుతున్నాయి నీ సీఈఓ పనులు అని శేషు అంటాడు. మీ ఇందు చేసే పనులు తెలిస్తే ఏమైపోతారో అని రాజు అనుకుంటాడు. మరి మీ ఇందు ఎలాంటిది అని రాజు అడుగుతాడు.
రాజుకు పీఏగా శేషు

నీలాగే బంగారం. కాకపోతే అమాయకురాలు. అక్షరం ముక్క కూడా రాదు అని శేషు అంటుంది. మిమ్మల్ని తింగరోళ్లను చేసి ఆడుకుంటుంది అది. ఎవరికి తెలియకుండా డిగ్రీల మీద డిగ్రీలు చేసింది. కొన్నాళ్ల తర్వాత మిమ్మల్ని ఆటాడేసుకుంటుంది. అది తలుచుకుంటుంటే అని మనసులో అనుకుని బయటకు నవ్వుతాడు రాజు.
నువ్వు సీఈఓ అయితే నన్ను పీఏగా పెట్టుకుంటావా అని శేషు అడుగుతాడు. ఛీ ఛీ అంటాడు రాజు. నీకు మంచి మంచి సలహాలు ఇస్తాను అని శేషు అంటాడు. సరే పీఏగా నిన్నే పెట్టుకుంటాను అని రాజు హామీ ఇస్తాడు. రేఖ గెలిస్తే భ్రమరాంబ పీఏ, రాజు గెలిస్తే నేను. ఎలా చూసిన డబ్బులే డబ్బులు అని శేషు సంతోషిస్తాడు. థ్యాంక్యూ సోమచ్ అని వెళ్లిపోతాడు శేషు.
తర్వాత రాజుకు డాక్టర్ కాల్ చేసి వారం రోజుల గడువు పూర్తయిందని, డబ్బులు కడితేనే ట్రీట్‌మెంట్ చేస్తాను. లేకపోతే పేషంట్‌ను పంపిస్తాను. ఇంకో గంటలో డబ్బులు అరెంజ్ చేయండి. లేకుంటే పేషంట్ హాస్పిటల్‌లో ఉండదని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో రాజు వెళ్లి ఇందును డబ్బులు అడిగితే వంద ఇస్తుంది. కామెడీగా ఉందా ఫుల్ పేమెంట్ ఇవ్వమంటాడు రాజు. నా దగ్గర లేవని ఇందు అంటే రాజు సీరియస్ అవుతాడు.
కేవలం డబ్బు కోసమే
డబ్బులు నాకు చాలా అవసరం ఇప్పుడు. నిజమే చెబుతున్నాను. నువ్వు ఎన్ని చేసిన అన్నీ సహించేది కేవలం డబ్బుల కోసమే. నీకు దండం పెడతాను. నేను ఆవరగా తిరుగుతాను అని నన్ను సీరియస్‌గా తీసుకోవద్దనుకోవద్దు. బయటకి చెప్పుకోలేని బారాన్ని మోస్తున్నాను. చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకు చిల్లరగాన్ని, దొంగను, కిడ్నాపర్‌ను, ఆఖరికి నీకు అద్దె మొగుడుని అయ్యాను. అది నాకు తప్పనిపించట్లేదు. ఒక మనిషి ప్రాణం కాపాడటమే నాకు ముఖ్యం. ఇది చావు బతుకుల సమస్య అని రాజు కన్నీళ్లు పెట్టిస్తాడు.
{{/usCountry}}డబ్బులు నాకు చాలా అవసరం ఇప్పుడు. నిజమే చెబుతున్నాను. నువ్వు ఎన్ని చేసిన అన్నీ సహించేది కేవలం డబ్బుల కోసమే. నీకు దండం పెడతాను. నేను ఆవరగా తిరుగుతాను అని నన్ను సీరియస్‌గా తీసుకోవద్దనుకోవద్దు. బయటకి చెప్పుకోలేని బారాన్ని మోస్తున్నాను. చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకు చిల్లరగాన్ని, దొంగను, కిడ్నాపర్‌ను, ఆఖరికి నీకు అద్దె మొగుడుని అయ్యాను. అది నాకు తప్పనిపించట్లేదు. ఒక మనిషి ప్రాణం కాపాడటమే నాకు ముఖ్యం. ఇది చావు బతుకుల సమస్య అని రాజు కన్నీళ్లు పెట్టిస్తాడు.
{{/usCountry}}ప్లీజ్ ఏమార్చద్దు. ఆటలు ఆడద్దు. ఈ ప్రయాణంలో నిన్ను హర్ట్ అయి ఉంటే చెంపలు వేసుకుంటాను. కావాలంటే కాళ్లు పట్టుకుంటాను అని ఇందు కాళ్లు పట్టుకుంటాడు రాజు. అయ్యో రాజు ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావ్ అని ఇందు అంటుంది. నేను కొన్ని చెప్పుకోలేను. నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నేను నీకు అద్దె మొగుడిగా నటించను అని రాజు బ్లాక్ మెయిల్ చేస్తాడు.
అసలు జీవితంలో కనిపించను కూడా అని తెగేసి చెబుతాడు రాజు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేందుకు నీకు అద్దె మొగుడిగా నటిస్తున్నా. అదే చేయలేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండి. ఇక నీ ఇష్టం అని రాజు అంటాడు. దాంతో ఆలోచనలో పడిన ఇందు తన మెడలో చైన్ చూస్తుంది. కావ్యకు గుర్తుగా ఉంచుకున్న గోల్డ్ చైన్ తీసి రాజుకు ఇస్తుంది ఇందు.
దయచేసి అమ్మొద్దు
నా దగ్గర డబ్బు లేదు. నిజంగానే నువ్వు ప్రాబ్లమ్‌లో ఉన్నావని అర్థమైంది. ఇది తాకట్టు పెట్టి నీ సమస్య తీర్చుకో. తర్వాత నేను డబ్బులు ఇచ్చాక తిరిగి తీసుకొద్దువు. ఇది మా అమ్మ జ్ఞాపకం. దయచేసి అమ్మొద్దు అని రాజు చేతిలో గోల్డ్ చైన్ పెడుతుంది ఇందు. డాక్టర్ మాట్లాడింది గుర్తుకు వచ్చిన రాజు సరే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటాను అని వెళ్లిపోతాడు.
అమ్మా నన్ను క్షమించు. రాజు ఉండటం చాలా ముఖ్యం. అందుకే నీకు జ్ఞాపకంగా పెట్టుకున్న గోల్డ్ చైన్ ఇచ్చాను. సారీ అమ్మా అని ఇందు అంటుంది. మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్లిన వెంకీ క్వాలిఫికేషన్ మెచ్చుకున్నా ఏఐ టెక్నాలజీ తెలియకుంటే జాబ్ కష్టమంటారు. ఏఐ టెక్నాలజీ గురించి తెలియకుంటే మీకు జాబ్ ఇవ్వలేమని వెంకీకి చెబుతాడు ఇంటర్వ్యూవర్.
దాంతో నిరాశగా వెళ్తాడు రాజు. మరోవైపు సేటు దగ్గరికి వెళ్లిన రాజు ఇందు గోల్డ్ చైన్ తాకట్టు పెడతాడు. ఇది నా పెళ్లానిది. తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వు. తర్వాత డబ్బు ఇచ్చి తీసుకుంటాను అని రాజు అంటాడు. దీనికి 50 వేలు ఇస్తానని సేటు అంటే.. రాజు 70 వేలు కావాలంటాడు. సేటుతో రాజు బేరమాడుతుంటాడు. అంతలో రాజుకు డాక్టర్ కాల్ చేసి గంట టైమ్ అయిపోయిందంటాడు.
50 వేలు కట్టిన రాజు
ఇప్పటికైతే 50 వేలు ఇద్దామని డబ్బులు అరెంజ్ అయ్యాయని రాజు చెబుతాడు. డాక్టర్ సరేనంటాడు. సేటు దగ్గర 50 వేలు తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు. క్యాష్ కౌంటర్‌లో 50 వేలు కడతాడు రాజు. తర్వాత డాక్టర్‌ను కలిసిన రాజు 50 వేలు కట్టానని, ఇంకో 20 వేలు నెక్ట్స్ పేమెంట్ కడతాను అని చెబుతాడు. సరే నిన్ను డబ్బుల గురించి ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ, పేషంట్‌కు మెడిసిన్ ఖర్చు ఎక్కువ అవుతుంది. మేనేజ్‌మెంట్ వాళ్లు డిశ్చార్జ్ చేద్దామంటే నేనే రిక్వెస్ట్ చేశాను అని డాక్టర్ చెబుతాడు.
నెక్ట్స్ టైమ్ లేట్ కాకుండా చూసుకోండి. తన ప్రాణానికి ఏ హానీ లేదు. కానీ, కోలుకోవాలంటే టైమ్ పడుతుందని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత పేషంట్ దగ్గరికి వెళ్లిన రాజు నువ్వేం కంగారుపడకు. నీకు ఏం కాదు. ఎన్ని కష్టాలు, అవమానాలు పడిన నిన్ను కాపాడుకుంటాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని రాజు అనుకుంటాడు.
మరోవైపు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్లిన రాజు ముందు జాబ్ ఇవ్వండి, తర్వాత ఏఐ టెక్నాలజీ గురించి నేర్చుకుంటానని వెంకీ అంటాడు. దానికి అతను ఒప్పుకోడు. బైక్ మీద వెళ్తున్న వెంకీ అంతా ఏఐ అని అంటున్నారు. అది లేకుంటే మనిషికి విలువ లేదా. ఏఐ వచ్చి నాలాంటి వాళ్ల జీవితంలో నిప్పులు పోసిందని అనుకుంటాడు. రాజు ఇంటికెళ్తాడు. ఇందు వచ్చి పలకరిస్తుంది.
బైక్ తాకట్టు పెట్టి
సమస్య గురించి అడుగుతుంది. క్లియర్ అయింది. కానీ, పేమెంట్ మాత్రం నెక్ట్స్ టైమ్ లేట్ చేయకు అని రాజు అంటాడు. అసలు అంత అవసరం ఏముందని ఇందు అడుగుతుంది. రాజు చెప్పనంటే ఇందు చెప్పమని పట్టుబడుతుంది. అసలు ఏంటీ దబాయిస్తున్నావ్. నువ్వేదో సొంత పెళ్లామైనట్లు అని రాజు అంటాడు. అంతలో బాబు అంటూ అపర్ణ వస్తుంది.
అది చూసి రాజు, ఇందు షాక్ అవుతారు. ఏమన్నావ్ బాబు అని అడుగుతుంది అపర్ణ. తర్వాత రాజు తన బైక్ తాకట్టు పెట్టి ఇందు గోల్డ్ చైన్ విడిపించి తీసుకొచ్చి ఇస్తాడు రాజు. అది తీసుకుని ఇందు తెగ మురిసిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.